జారిపోయేలా మృదుత్వం
బ్యూటిప్స్
జుత్తు పట్టుకుంటే పట్టుకుచ్చులా చేతివేళ్ల నుంచి జారిపోవాలి. పూసలు గుచ్చేటంత బలంగా వెంట్రుక కుదురు ఉండాలి. సహజమైన రంగుతో కురులు ఎప్పుడూ నిగనిగలాడుతూ ఉండాలి. అలా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించాలి...
- మగ్ నీటిలో గుడ్డులోని తెల్లసొనను గిలకొట్టి, తలస్నానం చేసిన తర్వాత ఈ నీటిని వెంట్రుకలన్నీ తడిచేలా పోసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మంచినీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టుకు పట్టులాంటి మృదుత్వం లభిస్తుంది.
- ఆముదం, తేనె సమపాళ్లలో కలపాలి. ఈ మిశ్రమాన్ని శిరోజాలకు, ముఖ్యంగా వెంట్రుకల చివరలకు పట్టించి, అరగంట తర్వాత తలస్నానం చేయాలి. దీనివల్ల వెంట్రుకల చివర్లు చిట్లకుండా, మృదువుగా ఉంటాయి.
- బీట్‌రూట్‌ను పేస్ట్ చేసి, నీళ్లలో కలిపి మరిగించాలి. చల్లారిన తర్వాత వడకట్టిన నీటిని రాత్రి పడుకోబోయేముందు మాడుకు పట్టించి, వేళ్లతో మసాజ్ చేసుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి. వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే చుండ్రు సమస్య తగ్గిపోతుంది.
- ఎర్రని బంతిపూలను వేసి, బాగా మరిగించిన కప్పుడు నీటిని మాడునుంచి శిరోజాలకు పూర్తిగా పట్టించాలి. గంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. తలలో అక్కడక్కడా తెల్లబడిన వెంట్రుకలు ఎర్రగా అవుతాయి. జట్టుకు రంగు వేసుకోవాలనుకునేవారికి ఇది ఆర్గానిక్ హెయిర్ డైలా ఉపయోగపడుతుంది.