పెరుగు రాస్తే కరవవు!
ఇంటిప్స్
రాగిపాత్రలను శుభ్రం చేయడానికి చింతపండు లేదా నిమ్మచెక్క వాడుతుంటాం. కాని చింతపండుతోపాటు ఉప్పు కూడా కలిపి రుద్దితే గార త్వరగా వదులుతుంది. చేతిలో నిలవకుండా జారిపోతున్న బాత్‌సోప్ ముక్కలను వాషింగ్ మెషీన్‌లో కాని దుస్తులను నానబెట్టే నీటిలో కాని వేస్తే దుస్తులకు సువాసన అంటుతుంది.
కొత్త చెప్పులు, షూస్ కరుస్తుంటే ఆ ప్రదేశంలో పెరుగురాసి రాత్రంతా అలాగే ఉంచి ఉదయం తుడిచి వేసుకోవాలి. బాటిల్ మూత గట్టిగా ఉండి తీయడానికి రాకుంటే కొద్ది సెకన్లపాటు కొవ్వొత్తితో వేడి చూపించాలి లేదా మంటకు కొద్దిదూరంలో వేడి మూతకు తగిలేటట్లు ఉంచి తీయాలి. మూత మీద వేడి నీటిని పోసి ప్రయత్నించినా ఫలితం ఉంటుంది.