ఇవేం జాగ్రత్తలు! | How to subvert Russian women! | Sakshi
Sakshi News home page

ఇవేం జాగ్రత్తలు!

Published Fri, May 18 2018 12:23 AM | Last Updated on Fri, May 18 2018 4:34 AM

How to subvert Russian women! - Sakshi

రష్యన్‌ అమ్మాయిలను జాగ్రత్తగా డీల్‌ చెయ్యాలని చెబుతూ అర్జెంటీనా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ తన మాన్యువల్‌లో క్రీడాకారులకు సూచనలు చేయడం వివాదాస్పదం అయింది.  

జూన్‌ 14 నుంచి జూలై 15 వరకు రష్యాలో ప్రపంచ ఫుట్‌బాల్‌ పోటీలు జరుగుతున్నాయి. ప్రపంచ దేశాల ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌లన్నీ తమ క్రీడాకారులను కయ్యానికి కాలు దువ్వించి పంపిస్తుంటే, అర్జెంటీనా అక్కడితో ఊరుకోకుండా, ‘రష్యన్‌ స్త్రీలను లోబరుచుకోవడం ఎలా?’ అనే అంశంపై తన క్రీడాకారులకు కొన్ని టిప్స్‌ కూడా ఇచ్చి పంపుతోంది! రాజధాని బ్యూనస్‌ఏర్స్‌లో గత వారం అర్జెంటీనా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ (ఎ.ఎఫ్‌.ఎ.) విడుదల చేసిన మాన్యువల్‌లోని ఒక అధ్యాయంలో రష్యన్‌ సంస్కృతి, సంప్రదాయాల గురించి చెబుతూ.. అక్కడి ఆడవాళ్లను వశం చేసుకోడానికి జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుందని ఎడ్యురాడో పెన్నిసీ అనే ఒక ఉపాధ్యాయుని చేత కొన్ని మెళకువలను చెప్పించింది ఎ.ఎఫ్‌.ఎ.!

రష్యన్‌ మహిళతో అవకాశం కోసం ఏం చేయాలి?’ అనే శీర్షికతో అచ్చయిన ఆ వ్యాసంలో రష్యన్‌ ఆడవాళ్ల మనసెరిగి మసలుకోవలసి ఉంటుందన్న హెచ్చరిక ఉంది. ‘‘రష్యన్‌ యువతులు మగవాళ్లలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మీకు ఆత్మవిశ్వాసం లేకపోతే వారి మనసుకు దగ్గరవడం కష్టం. సాధారణంగా రష్యన్‌ అమ్మాయిలు చాలా ముఖ్యమైన పనుల్లో నిమగ్నం అయి ఉంటారు. వారి అటెన్షన్‌ను పొందడం అంత తేలిక కాదు. ఏమంత ముఖ్యం కాని పనుల్లో ఉండే ఆడవాళ్లను మాత్రం డబ్బుతో మీ వైపునకు తిప్పుకోవచ్చు. అయితే మీరు కొంచెమైనా ఆకర్షణీయంగా ఉండాలి’’ అని మాన్యువల్‌ ప్రబోధించింది. ఒక ప్రతిష్టాత్మకమైన మాన్యువల్‌లో ఇలాంటి  చవకబారు సూచనలు రావడంపై అర్జెంటీనా ప్రభుత్వం వెంటనే దర్యాప్తునకు ఆదేశించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement