సంతోషంగా ఉంటే పోయేదేమీ లేదు... బాధ తప్ప! | If you are happy   Do not stop ... except for the pain! | Sakshi
Sakshi News home page

సంతోషంగా ఉంటే పోయేదేమీ లేదు... బాధ తప్ప!

Published Thu, Mar 20 2014 3:12 AM | Last Updated on Sat, Sep 2 2017 4:55 AM

సంతోషంగా ఉంటే  పోయేదేమీ లేదు... బాధ తప్ప!

సంతోషంగా ఉంటే పోయేదేమీ లేదు... బాధ తప్ప!

 సంతోషమే సగం బలం అని పెద్దలు అన్నారుగానీ... నిజానికి సంపూర్ణ బలం.
‘నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ’ అన్నారు హీరోగారు.
నవ్వు రావాలంటే సంతోషంగా ఉండాలి కదా! అందుకే ఎప్పుడూ సంతోషంగా ఉండండి. కొత్త బలాన్ని సొంతం చేసుకోండి. సంతోషంగా ఉండడం వల్ల ప్రయోజనాలు ఇవి...
    

నిరాశా నిస్పృహల్లో ఉన్నప్పుడు చిన్న సమస్య అయినా సరే పెద్ద అనకొండగా మారి భయపెడుతుంది. సంతోషంగా ఉంటే పెద్ద సమస్య సైతం తేలికగా పరిష్కారమైపోతుంది. సంతోషంగా ఉన్నప్పుడు నవ్వగలుగుతాం. ఆ నవ్వు మన మెదడును ఉత్తేజితం చేస్తుంది. ఫలితంగా సమస్య పరిష్కారానికి కొత్త రకంగా ఆలోచించగలుగుతాం.
     

సంతోషంగా ఉంటే శారీరక వ్యాయామాల పట్ల శ్రద్ధ పెరుగుతుంది. ఆటల మీద ఆసక్తి కలుగుతుంది.
సంతోషంగా ఉండేవాళ్లలో ఆత్మవిశ్వాసం అధిక స్థాయిలో ఉంటుంది. ఏ పని అయినా చేయగలమనే ధీమా ఉంటుంది.
సానుకూల దృక్పథం పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది.                                                              కోపం, ఒత్తిడి ఆరోగ్యానికి హాని చేస్తాయి. సంతోషం మేలు చేస్తుంది.
 (నేడు ప్రపంచ సంతోష దినోత్సవం)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement