క్రీడలతో మానసిక ఉల్లాసం
క్రీడలతో మానసిక ఉల్లాసం
Published Sat, Dec 10 2016 10:12 PM | Last Updated on Mon, Sep 4 2017 10:23 PM
* వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్ డాక్టర్ టి.రమేష్‌బాబు
* అంతర్ కళాశాలల క్రీడాపోటీలు ప్రారంభం
బాపట్ల: క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యాన్ని పెంచుతాయని వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్ డాక్టర్ టి.రమేష్‌బాబు చెప్పారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో శనివారం అంతర్ కళాశాలల క్రీడాపోటీలను వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో పట్టుదలను పెంపొందిస్తాయని తెలిపారు. క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. క్రీడల వల్ల మంచి శారీరక దారుఢ్యంతోపాటు ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా ఉంటాయని చెప్పారు. విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ టి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ వ్యవసాయ విద్యార్థులు, వ్యవసాయంతోపాటు క్రీడల్లోనూ నైపుణ్యాన్ని పెంపుందించుకుంటున్నారని చెప్పారు. క్రీడల్లోనూ నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం అభినందనీయమన్నారు. పోటీల్లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ, వ్యవసాయ ఇంజినీరింగ్, ఫుడ్, హోమ్‌సైన్స్ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థిని మంజీర క్లాసిక్ డ్యాన్సులో, సఫీయా మోగాసనాలు వేసి అబ్బురపరిచారు. తొలుత విశ్వవిద్యాలయం డీన్ డాక్టర్ టి.రమేష్‌బాబు, రిజిస్ట్రార్ టి.వి.సత్యనారాయణ తదితరులు పావురాళ్లను ఎగురవేసి క్రీడలను ప్రారంభించారు. కార్యక్రమంలో కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పిఆర్‌కె.ప్రసాద్, డీన్ ఆఫ్ స్టూడెంట్స్ అఫైర్స్ డాక్టర్ సాంబశివరావు, ఫిజికల్ డైరెక్టర్ పురుషోత్తమరావు, వ్యవసాయ ఇంజినీరింగ్ కళాశాల డీన్ డాక్టర్ మణి తదితరులు పాల్గొన్నారు.
హోరాహోరీగా ఫుట్‌బాల్ పోటీలు..
తొలి రోజు ఫుట్‌బాల్ పోటీలు హోరాహోరీగా సాగాయి. ఈ పోటీలో తొలుత బాపట్ల వ్యవసాయ కళాశాల, రాజమండ్రి కళాశాల జట్ల మధ్య పోటీ జరిగింది. ఈ పోటీలో 7–0 పాయింట్ల తేడాతో బాపట్ల కళాశాల జట్టు గెలుపొందింది. అదే విధంగా తిరుపతి, బాపట్ల కళాశాలల జట్లకు పోటీ జరగ్గా ఒక పాయింట్ తేడాతో తిరుపతి కళాశాల జట్టు విజయం సాధించింది. వీటితోపాటు నైరా కళాశాలకు మహానంది జట్ల మధ్య పోటీ జరగ్గా మహానంది జట్టు గెలుపొందింది. మడకశిర, బాపట్ల కళాశాలల మధ్య జరిగిన పోటీల్లో బాపట్ల కళాశాల విద్యార్థులు గెలుపొందారు.
Advertisement
Advertisement