మహారాణి శ్రీదేవి! | In pulli of tamil cinema sri devi | Sakshi
Sakshi News home page

మహారాణి శ్రీదేవి!

Published Sat, Jun 27 2015 12:04 AM | Last Updated on Sun, Sep 3 2017 4:25 AM

మహారాణి శ్రీదేవి!

మహారాణి శ్రీదేవి!

చాలాకాలం తరువాత ‘ఇంగ్ల్లిష్ వింగ్లిష్’ సినిమాతో వెండితెరపై కనిపించి తన అభిమానులను అలరించింది అందాల తార శ్రీదేవి. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర మంచి హిట్ కావడంతో ‘మా సినిమాలో నటించండి’ అని పెద్దపెద్ద నిర్మాతలు క్యూ కట్టారు. అయితే శ్రీదేవి మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. రాజీపడకుండా ఎన్నో సినిమా ఆఫర్లను తిరస్కరించింది కూడా.
 
అయితే విజయ్ హీరోగా వస్తున్న ‘పులి’తో  చాలాకాలం తరవాత తమిళ సినిమాలో కనిపించబోతుంది శ్రీదేవి. ఈ యాక్షన్, అడ్వెంచర్, ఫాంటసీ ఫిల్మ్ ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా మహారాణిగా శ్రీదేవి  రాజదర్పంతో కనిపిస్తోంది. ‘అవతార్’ సినిమాలో రేఖ పోషించిన మహారాణి పాత్రను స్ఫూర్తిగా తీసుకొని ‘పులి’ సినిమాలో శ్రీదేవి పాత్రను డిజైన్ చేశారట.
 
ట్రైలర్‌లో శ్రీదేవి ‘న్యూ లుక్’ను చూసి పాతతరం దర్శకులు మొదలు కొత్తతరం దర్శకుల వరకు ఆమె కోసమని కథానాయిక ప్రాధాన్యత ఉన్న పౌరాణిక, చారిత్రక సబ్జెక్ట్‌ల వేటలో పడ్డారట.
 
‘రుద్రమదేవి’లాంటి సబ్జెక్ట్ ఏదైనా దొరికితే... పచ్చ జెండా ఊపడానికి శ్రీదేవి రెడీగా ఉందట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement