
వందేళ్లు బతకాలని ఎవరు అనుకోరు చెప్పండి. కానీ.. చాలా తక్కువ మందికి ఈ అదష్టం దక్కుతుంది. ఇప్పటివరకూ ఇదే పరిస్థితి. కానీ ఓ అంతర్జాతీయ శాస్త్రవేత్తల బందం పరిశోధనలు పూర్తిస్థాయిలో సఫలమైతే మాత్రం మనిషి ఆయుష్షు నాలుగు రెట్లు అంటే సుమారు 400 ఏళ్లకు పెంచేందుకు అవకాశం ఏర్పడుతుంది! ఎందుకంటే.. సి.ఎలిగాన్స్ అనే సూక్ష్మస్థాయి పురుగులపై జరిగిన పరిశోధనల్లో వాటి ఆయుష్షు ఐదు రెట్లు ఎక్కువైంది కాబట్టి. అదెలాగో తెలుసుకునే ముందు మన కణాలెలా పనిచేస్తాయో కొంచెం అర్థం చేసుకుందాం. కణాల్లోపల ఉండే భాగాలు నిర్దిష్ట పనులు నిర్వహించేందుకు సిగ్నలింగ్ పాథ్‌వేస్‌ను ఏర్పాటు చేసుకుంటాయి. ఒక భాగానికి సంకేతం అందితే.. ఆ పని చేసిన తరువాత సంకేతం పక్కనున్న భాగానికి వెళుతుంది.
ఇన్సులిన్‌తోపాటు రాపమైసిన్ పాథ్‌వేలకూ.. ఆయుష్షుకు మధ్య సంబంధం ఉందని గతంలోనే రుజువైంది. రాపమైసిన్ పాథ్‌వేను నియంత్రిస్తే ఆయుష్షు 100 శాతం పెరిగితే ఇన్సులిన్ నియంత్రణ ద్వారా 30 శాతం పెరిగినట్లు గత పరిశోధనలు చెబుతున్నాయి. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే.. ఈ రెండింటినీ మార్చడం ద్వారా ఆయుష్షు ఐదు రెట్లు పెరుగుతుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. అయితే మానవుల్లోనూ ఇదే ఫలితాలు కనిపిస్తాయా? అన్నది ప్రస్తుతానికైదే తెలియదు. కానీ.. సి–ఎలిగాన్స్‌తోపాటు మానవుల్లోనూ ఒకే రకమైన జన్యువులు ఉండటం గమనించాలని అంటున్నారు ఈ పరిశోధనలకు నేతత్వం వహించిన జరోడ్ రోలిన్స్ అనే శాస్త్రవేత్త. విస్తత స్థాయి పరిశోధనల ద్వారా మానవుల్లోనూ ఇదే ఫలితాలు సాధించేందుకు అవకాశముందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment