‘ఇన్ఫోసిస్‌ ప్రైజ్‌ 2024’.. విజేతలు వీరే | Infosys Science Foundation announces 2024 prize winners, Check list | Sakshi
Sakshi News home page

Infosys Science Foundation: ‘ఇన్ఫోసిస్‌ ప్రైజ్‌ 2024’.. విజేతలు వీరే

Published Thu, Nov 14 2024 7:43 PM | Last Updated on Thu, Nov 14 2024 8:05 PM

Infosys Science Foundation announces 2024 prize winners, Check list

ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ గురువారం ‘ఇన్ఫోసిస్‌ ప్రైజ్‌ 2024’ విజేతలను ప్రకటించింది. ఎకనామిక్స్, ఇంజనీరింగ్ అండ్‌ కంప్యూటర్ సైన్స్, హ్యుమానిటీస్ అండ్‌ సోషల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ అనే ఆరు విభాగాలలో ఈ ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న వారి పేర్లను వెల్లడించింది.

అవార్డు అందుకున్న వారిలో భారత్‌లోని ప్రముఖ సంస్థలకు చెందిన వారు ఇద్దరు. ‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఇద్దరు, వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి ఒకరు, ఎడిన్‌బర్గ్ యూనివర్సిటీ నుంచి ఒకరు ఉన్నారు. ఈ అవార్డు కింద 100,000 డాలర్ల (భారత కరెన్సీ ప్రకారం సుమారు 84 లక్షల, 42 వేలు) నగదు బహుమతిని అందజేయనున్నారు. అవార్డు ప్రదానోత్సవం జనవరిలో జరగనుంది.

ఇన్ఫోసిస్‌ ప్రైజ్‌ 2024 గెలుపొందిన విజేతలు:

1. ఎకనామిక్స్‌ విభాగంలో.. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అరుణ్ చంద్రశేఖర్

2. ఇంజినీరింగ్ అండ్‌ కంప్యూటర్ సైన్స్‌ విభాగంలో.. వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుంచి శ్యామ్ గొల్లకోట.

3. హ్యుమానిటీస్ అండ్‌ సోషల్ సైన్సెస్‌ విభాగంలో.. ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయం నుంచి మహమూద్ కూరియా.

4. లైఫ్‌ సైన్సెస్‌ విభాగంలో.. పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌కు చెందిన సిద్ధేష్ కామత్

5. మ్యాథమెటికల్ సైన్సెస్ విభాగంలో.. కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రొఫెసర్ నీనా గుప్తా

6. ఫిజికల్ సైన్సెస్‌ విభాగంలో  స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అసోసియేట్ ప్రొఫెసర్‌ వేదిక ఖేమానీకి బహుమతి లభించింది.

కాగా ఇన్ఫోసిస్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో.. శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఇంజినీర్లు సంబంధిత రంగాల్లో విశేష కృషి చేసినందుకుగాను పత్రి ఏటా ‘ఇన్ఫోసిస్ ప్రైజ్’ను అందిస్తోంది. ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, హ్యుమానిటీస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్య వంటి ఆరు విభాగాల్లో  కృషి చేసిన వారికి  ఈ బహుమతిని ప్రదానం చేస్తారు. 

ప్రతి కేటగిరి నుంచి గెలుపొందిన విజేతలకు ఒక బంగారు పతకంతోపాటు, ప్రశంస పత్రం, లక్ష డాలర్లు( భారత కరెన్సీ ప్రకారం రూ. 84 లక్షల 40 వేలు), దానికి సమానమైన ప్రైజ్‌ పర్స్‌ అందిస్తారు. మానవాళికి మేలు చేసే అత్యుత్తమ పరిశోధనలను గుర్తించడం, దేశంలోని యువ పరిశోధకులకు, ఔత్సాహిక శాస్త్రవేత్తలకు ఆదర్శంగా నిలవడమే ఇన్ఫోసిస్ ప్రైజ్  ప్రాథమిక లక్ష్యం.

అయితే విదేశాలకు చెందిన విజేతలు బహుమతిని గెలుచుకునే సమయంలో తమకు నచ్చిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో తగిన సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. దేశంలో గరిష్టంగా రెండు పర్యటనలలో 30 రోజులు గడవాల్సిందిగా ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ కోరుతుంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement