ఇంటిప్స్
ఆయా సీజన్లలో వాడే దుస్తులను సీజన్ అయిపోయాక అల్మరాలో పెట్టి ఉంచేస్తాం. అలాంటప్పుడు అవి వాసన వస్తుంటాయి. అలా జరగక్కుండా ఉండాలంటే ఆ బట్టల మధ్య ఒకట్రెండు వేప పుల్లలు పెట్టండి.షెల్ఫులు, వార్డ్‌రోబ్‌ల తలుపులు బిగిసిపోతే... చక్రాలు, స్క్రూలకు సబ్బు కానీ, మైనం కానీ పూయాలి.
పింగాణీ పాత్రల మీద మరకలు పోవాలంటే... నెయిల్ పాలిష్ రిమూవర్‌లో ముంచిన గుడ్డతో తుడవాలి. ఇల్లంతా సువాసన రావాలంటే... ఓ ప్రమిదలో వేపనూనె వేసి దీపం వెలిగిస్తే సరి.