ఐక్యూ బాగుంటేనే ఆరోగ్యం...
పరిపరి శోధన
ఐక్యూ బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుందట. తెలివితేటలు గల వారు సహజంగానే ఆరోగ్యంగా ఉంటారని, వారి జన్యువులు వ్యాధులను అంత తేలికగా దరిచేరనీయని తీరులో ఉంటాయని స్కాటిష్ పరిశోధకులు చెబుతున్నారు. బ్రిటన్‌లోని ‘బయో బ్యాంకు’లో నమోదైన లక్షమంది ఆరోగ్య సమస్యలు, వారి తెలివితేటల స్థాయి తదితర వివరాలపై కూలంకషంగా అధ్యయనం చేసిన తర్వాత ఈ మేరకు నిర్ధారణకు వచ్చామని పరిశోదకులు అంటున్నారు.
ఇదిలా ఉంటే, ఎడిన్‌బర్గ్ వర్సిటీ పరిశోధకులు చేపట్టిన వేరే అధ్యయనంలో కూడా ఇంచుమించు ఇలాంటి ఫలితాలే తేలడం విశేషం. చదువులో చురుగ్గా ఉండేవారికి తర్వాతి కాలంలో అల్జిమర్స్ వ్యాధి, పక్షవాతం, గుండెజబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని వారి అధ్యయనంలో తేలింది.