
లండన్ : రోజుకు కేవలం కొద్దిపాటి మద్యం తీసుకున్నా చిగుళ్ల వ్యాధులు, నోటి క్యాన్సర్, గుండెజబ్బుల బారిన పడే ప్రమాదం ఉందని తాజా అథ్యయనం వెల్లడించింది. రోజూ పరిమితంగా మద్యం సేవిస్తే పలు ఆరోగ్య ప్రయోజనాలుంటాయని ఇప్పటివరకూ వచ్చిన పలు అథ్యయనాలను తాజా సర్వే తోసిపుచ్చింది. పరిమితంగా తీసుకునే మద్యంలోనూ ఉండే నిర్థిష్ట బ్యాక్టీరియాతో పలు తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తాయని తేల్చింది.
మద్యం అసలే ముట్టుకోని వారితో పోలిస్తే రోజుకు ఒకసారి అంతకంటే ఎక్కువ సార్లు మద్యం తీసుకునే వారి నోటిలో హానికారక బ్యాక్టీరియా ఎక్కువ మోతాదులో ఉంటుందని న్యూయార్క్ యూనివర్సిటీ నివేదిక వెల్లడించింది. హానికారక క్రిములతో పోరాడే ఆరోగ్యకర బ్యాక్టీరియా సైతం మద్యం సేవించే వారిలో అతితక్కువగా ఉంటుందని పేర్కొంది. మద్యపానానికి దూరంగా ఉండటం ద్వారా వ్యాధినిరోధక శక్తి బలహీనపడకుండా, తల, మెడ, నోటి క్యాన్సర్ల బారినపడకుండా ఉండవచ్చని అథ్యయన రచయిత న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వైద్యులు జియోంగ్ ఆన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment