
అరుణ కిరణ జాలై రంజితా సావకాశా
విద్ధృత జప వాటికా పుస్తకాభీతి హస్తా
ఇతర కరవరద్యా ఫుల్ల కల్హార సంస్థా
నివసతు హృది బాలా నిత్యకల్యాణరూపా
శరన్నవరాత్రి మహోత్సవాలలో కనకదుర్గాదేవి బాలాత్రిపురసుందరీదేవిగా దర్శనమిస్తుంది. బాలాదేవి మహిమాన్వితమైన తల్లి. శ్రీబాలామంత్రం సమస్త దేవీమంత్రాల్లోకి గొప్పది, ముఖ్యమైనది. అందుకే శ్రీవిద్యోపాసకులకి మొట్టమొదట బాలామంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపురసుందరీదేవి నిత్యం కొలువుండే పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత ఈ బాలా దేవి. అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపురసుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలం. దసరా మహోత్సవాలలో భక్తులకు పూర్ణ ఫలం అందించే అలంకారం శ్రీబాలాదేవి.
Comments
Please login to add a commentAdd a comment