kanaka durga devi
-
ఇంద్రకీలాద్రి: శ్రీదుర్గాదేవి అలంకరణలో విజవాడ దుర్గమ్మ (ఫోటోలు)
-
నవరాత్రి అలంకరణలో నవనవోన్మేషంగా...
శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దుర్గమ్మ పది విశేష అలంకారాలలో భక్తులకు దర్శనమిస్తున్నారు.3వ తేదీ గురువారం – శ్రీబాలా త్రిపుర సుందరీదేవిదసరా ఉత్సవాలలో తొలిరోజున దుర్గమ్మ శ్రీబాలా త్రిపుర సుందరీదేవిగా అలంకరించారు. బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనది. దసరా ఉత్సవాలలో భక్తులకు పూర్ణఫలం అందించే అలంకారం శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి.4వ తేదీ శుక్రవారం – శ్రీగాయత్రిదేవిరెండోరోజున దుర్గమ్మ శ్రీ గాయత్రిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. గాయత్రి అమ్మవారిని దర్శించడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది. వేదమాత గా గాయత్రిదేవిని దర్శించుకోవడం వలన సకల మంత్రసిద్ధి, తేజస్సు, జ్ఞానం ΄÷ందుతారు.5వ తేదీ శనివారం – శ్రీఅన్నపూర్ణాదేవిదసరా ఉత్సవాలలో మూడోరోజున దుర్గమ్మను శ్రీఅన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులు దర్శించుకున్నారు. నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో శ్రీ దుర్గమ్మను దర్శించడం వల్ల అన్నాదులకు లోపం లేకుండా, ఇతరులకు అన్నదానం చేసే భాగ్యాన్ని ΄÷ందగలుగుతారు.6వ తేదీ ఆదివారం- శ్రీలలితా త్రిపుర సుందరీదేవిదసరా ఉత్సవాలలో నాల్గో రోజున దుర్గమ్మను శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులు దర్శించుకున్నారు. శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా దర్శమిచ్చే సమయంలో పరమేశ్వరుడు మహాకామేశ్వరుడిగా, అమ్మవారు త్రిపుర సుందరీదేవిగా భక్తుల పూజలందుకుంటారు.7వ తేదీ సోమవారం – శ్రీ మహాచండీదేవిఐదవ రోజున దుర్గమ్మ శ్రీమహాచండీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ మహాచండీ అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి, సంపదలు లభించి, శత్రువులు మిత్రులుగా మారి కోరికలు అన్ని సత్వరమే తీరుతాయి.8వ తేదీ మంగళవారం – శ్రీమహాలక్ష్మీదేవిఆరో రోజున దుర్గమ్మ శ్రీమహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. లోక స్ధితికారిణిగా, «అమృత స్వరూపిణిగా భక్తులను అనుగ్రహిస్తుంది. శ్రీమహాలక్ష్మీదేవిని దర్శించుకోవడం వల్ల ఐశ్వర్య్ర΄ాప్తి కలుగుతుంది. 9వ తేదీ బుధవారం – శ్రీసరస్వతిదేవిఏడవరోజయిన మూల నక్షత్రం రోజున సరస్వతి అవతారంలో దుర్గాదేవి భక్తులకు దర్శనమిస్తారు. సరస్వతీదేవిని సేవించడం వల్ల సర్వ విద్యలయందు విజయం ΄÷ందుతారు.10వ తేదీ గురువారం – శ్రీదుర్గాదేవి 8వ రోజున దుర్గమ్మ శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. లోక కంటకుడైన దుర్గమాసురుడు అనే రాక్షసుడిని సంహరించి దుర్గతులను ΄ోగొట్టి దుర్గగా వెలుగొందినది. శరన్నవరాత్రులలో దుర్గాదేవిని ఆర్చించటం సద్గతులను ప్రసాదిస్తుంది.11వ తేదీ శుక్రవారం – శ్రీమహిషాసుర మర్ధనిదేవిదసరా ఉత్సవాలలో 9వ రోజున దుర్గమ్మ శ్రీమహిషాసురమర్ధనిదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. అష్టభుజాలతో అవతరించి సింహవాహినిౖయె, దుష్టుడైన మహిషాసురుని సంహరించి శ్రీదుర్గాదేవి దేవతల, ఋషుల, మానవుల కష్టాలను తొలగించింది. మహిషాసురమర్ధనిదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించడం వల్ల అరిష్ట్వర్గాలు నశించి, సాత్విక బావం ఉదయిస్తుంది. సర్వ దోషాలు పంటాపంచలు అవుతాయి. ధైర్య, స్థైర్య, విజయాలు చేకూరుతాయి.12వ తేదీ శనివారం – శ్రీరాజరాజేశ్వరిదేవిదసరా ఉత్సవాలలో 10వ రోజున దుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. చెరుకుగడను వామహస్తంతో ధరించి, దక్షిణ హస్తం తో అభయాన్ని ప్రసాదిస్తూ, శ్రీషోడశాక్షరీ మహా మంత్ర స్వరూపిణి గా, శ్రీచక్రరాజ దేవతగా వెలుగొందే శ్రీరాజరాజేశ్వరిదేవిని దర్శించి అర్చించడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయి.– సుభాని, సాక్షి, ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ) -
ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో ఆషాఢమాసం ఉత్సవాలు
-
ఘనంగా ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు ప్రారంభం
-
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఘనంగా శరన్నవరాత్రులు ఉత్సవాలు
-
నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతున్న బెజవాడ కనకదుర్గమ్మ
-
దుర్గమ్మకు గాజుల ఉత్సవం
సాక్షి, ఇంద్రకీలాద్రి : కార్తీక శుద్ధ విదియను పురస్కరించుకుని సోమవారం దుర్గమ్మకు గాజులతో అలంకరించనున్నారు. ప్రస్తుతం నెలకున్న కోవిడ్ నేపధ్యంలో ఈ ఏడాది కేవలం అంతరాలయంలో అమ్మవారికి మాత్రమే గాజుల అలంకారం చేయాలని వైదిక కమిటీ నిర్ణయించింది. అమ్మవారితో పాటు ఆలయ ప్రాంగణంలో మాత్రమే ఈ ఏడాది గాజులతో అలంకరిస్తారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు అమ్మవారి సన్నిధిలో ధనలక్ష్మీ పూజ నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం అమ్మవారికి పంచహారతుల సేవ జరిగింది. సేవ అనంతరం ఆలయం చుట్టూ ఉన్న అష్టలక్ష్ముల విగ్రహాల వద్ద ఏర్పాటు చేసిన జ్యోతులను ఆలయ ఈఓ ఎంవీ సురేష్‌బాబు దంపతులు, చైర్మన్ పైలా సోమినాయుడు, ఆలయ అర్చకులు వెలిగించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆలయ అధికారులు, సిబ్బంది టపాసులు కాల్చి, మిఠాయిలను పంచుకున్నారు. రాత్రి 7 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేశారు. నేటి నుంచి కార్తీక మాసోత్సవాలు ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి సన్నిధిలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. కార్తీక మాసం తొలి రోజు సోమవారం కావడంతో పెద్దఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు విచ్చేసే అవకాశాలున్నాయని ఆలయ అధికారులు భావిస్తున్నారు. దుర్గమ్మకు బంగారు హారం బహూకరణ.. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు నగరానికి చెందిన భక్తులు బంగారపు హారాన్ని కానుకగా అందచేశారు. విజయవాడ కాళేశ్వరరావు రోడ్డుకు చెందిన భార్గవ రాము దంపతులు అమ్మవారి అలంకరణ నిమిత్తం సుమారు 40 గ్రాముల బంగారంతో తయారు చేసిన హారాన్ని ఆలయ ఈఓ ఎంవీ. సురేష్‌బాబుకు అందచేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. -
శరన్నవరాత్రి అమ్మవారి అలంకారాలు ఇవే
సాక్షి, విజయవాడ : శరన్నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్భంగా తొలి రోజు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ భక్తులకు స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. అష్ట భుజాలతో సింహాసనం మీద త్రిశూలధారియై.. కనకపు ధగధగలతో మెరిసిపోయే ఆ తల్లిని దర్శించుకోవడం నిజంగా భక్తులకు కనుల పండగే. ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల దరిద్రాలూ తొలగిపోతాయంటారు. ఇలా నవరాత్రుల్లో కనకదుర్గమ్మ అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమివ్వనున్నారు. అవేంటంటే... రెండో రోజు.. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు రెండవరోజు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ బాలా త్రిపుర సుందరీదేవి రూపంలో దర్శనమివ్వనున్నారు. మనస్సు, బుద్ధి, చిత్తం శ్రీ బాల త్రిపురసుందరీ దేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో ఉండే ఈ తల్లి అనుగ్రహం కోసం ఉపాసకులు బాలార్చన చేస్తారు. ఈ రోజున రెండు నుంచి పదేళ్ల లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి.. పూజించి కొత్త బట్టలు పెడతారు. అమ్మవారికి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగు చీరలు కట్టి పాయసం, గారెలను నైవేద్యంగా నివేదిస్తారు. శ్రీ బాల త్రిపుర సుందరీదేవిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని అర్చకులు చెబుతున్నారు. చదవండి: కోవిడ్ నియమాలతో దసరా ఉత్సవాలు.. మూడో రోజు.. దుర్గగుడిలో మూడో రోజున అమ్మవారు గాయత్రీదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ది పొందిన ముక్తా, విద్రుమ, హేమ నీల, దవళ వర్ణాలతో ప్రకాశించే పంచ ముఖాలతో గాయత్రీదేవి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందుతారు. గాయత్రీదేవి శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖలో రుద్రుడు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కర్మసాక్షి సూర్యభగవానుడు గాయత్రీమంత్రానికి అధిష్టాన దేవతగా భాసిల్లుతున్నాడు. గాయత్రీమాతను దర్శించుకోవడం వల్ల సకల మంత్ర సిద్ది ఫలాన్ని పొందుతారని భక్తుల విశ్వాసం. చదవండి: అమ్మవారి దర్శనానికి అన్ని ఏర్పాట్లు నాలుగో రోజు.. దసరా వేడుకల్లో అమ్మవారు నాలుగో రోజున శ్రీ లలితా త్రిపురసందరీదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీచక్ర అధిష్టాన దేవతగా.. పంచదశాక్షరీ మంత్రాధిదేవతగా కొలిచే భక్తులకు అమ్మవారు వరప్రదాయినిగా నిలుస్తారు. సాక్షత్తూ శ్రీలక్ష్మి, సరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తుండగా... చిరుమందహాసంతో.. చెరుగడను చేతపట్టుకుని.. పరమశివుని వక్షస్థలంపై కూర్చుకున్న అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. చదవండి: స్వర్ణకవచాలంకృత రూపంలో దుర్గాదేవి అయిదవ రోజు: శరన్నవరాత్రి ఉత్సవాల్లో అయిదో రోజున అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం రోజున అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపాలతో దుష్టసంహారం చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. సకల విద్యలకు అధిదేవతగా వున్న సరస్వతీ దేవిని దర్శించుకుని అమ్మవారి అనుగ్రహం పొందేందుకు విద్యార్ధులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. మూలానక్షత్రం రోజు నుంచి విజయదశమి విశేష పుణ్యదినాలుగా అమ్మవారి ఆరాదనలు ముమ్మరమవుతాయి. ఆరవ రోజు.. అమ్మవారి అవతారాల్లో అన్నపూర్ణాదేవి రూపం విశిష్టమైనది. ఉత్సవాలు ప్రారంభమైన ఆరో రోజున ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఎడమ చేతిలో బంగారు పాత్రతో.. తన భర్త అయిన ఈశ్వరునికి భిక్షను అందించే రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే ఆకలి బాధలు వుండవని భక్తుల విశ్వాసం. ఏడోరోజు.. ఉత్సవాల్లో ఏడో రోజున అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవి అవతారంలో భక్తులకు కనువిందు చేస్తారు. జగన్మాత మహాలక్ష్మీ అవతారంలో దుష్ట సంహారం చేసి, లోకాలు కాపాడినట్లు పురాణాలు చెబుతున్నాయి. ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్మీ రూపాల్లో అష్టలక్ష్ములుగా అమ్మవారు మహాలక్ష్మీ అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఎనిమిదవ రోజు.. శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదో రోజున అమ్మవారు దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. లోకకంఠకుడైన దుర్గమాసురుడిని వధించి దుర్గాదేవీ స్వకంగా కీలాద్రిపై అవతరించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. దుర్గతులను పోగొట్టే దుర్గాదేవి అవతారాన్ని దర్శించుకుంటే సద్గతులు సంప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. తొమ్మిదవ రోజు.. దసరా నవరాత్రి వేడుకల ముగింపు నాడు విజయదశమి రోజున అమ్మవారు రెండు అవతారాలలో దర్శనం దర్శనమివ్వనున్నారు. దుష్టుడైన మహిషాసరుడిని అంతమొందించిన భీకర శక్తి స్వరూపిణి మహిషాసుర మర్థని రూపంలో తొమ్మిదో రోజున ఇంద్రకీలాద్రిపై అమ్మవారు దర్శనమిస్తారు. ఎనిమిది భుజములు.. అష్ట ఆయుధాలు... సింహవాహినిగా.. రౌద్ర రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే.. శత్రు భయం వుండదని భక్తుల విశ్వాసం. మహిషుడిని అంతం చేయడం ద్వారా లోకాలను అమ్మవారు కాపాడినట్లే... భక్తుల మనస్సులోని సకల దుర్గుణాలను అమ్మవారు హరించి వేస్తుందని అమ్మవారి విశిష్టతను పురాణాలు చెబుతున్నాయి. ఆఖరి అవతారంగా శ్రీ రాజరాజేశ్వరీ రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. వామహస్తంలో చెరకుగడను ధరించి, దక్షిణ హస్తంలో అభయాన్ని ప్రసాదించే రూపంలో శ్రీచక్రరాజ అధిష్టాన దేవతగా అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తారు. చెడుపై అమ్మవారు సాధించిన విజయానికి చిహ్నంగా విజయదశమి నాడు అమ్మవారి చక్కని రూపంను దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందుతారు. -
బాలాత్రిపుర సుందరిగా దుర్గమ్మ దర్శనం
సాక్షి, అమరావతి బ్యూరో: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం కనకదుర్గమ్మ బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మల్లికార్జున మహామండపంలో ఏర్పాటు చేసిన లక్షకుంకుమార్చనలో దంపతులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి దిగువన ఉన్న అన్నదాన భవనంలో భక్తులకు ఉచిత అన్నదాన ప్రసాద వితరణ నిర్వహించారు. సాయంత్రం మల్లేశ్వరస్వామి దేవాలయం నుంచి ప్రారంభమైన శ్రీ గంగా పార్వతీ సమేత నగరోత్సవం అర్జునవీధి మీదుగా ఇంద్రకీలాద్రి వరకు కనుల పండువగా సాగింది. దసరా ఉత్సవాల్లో మూడోరోజు అమ్మవారు భక్తులకు గాయత్రీదేవిగా దర్శనం ఇస్తారు. చిన్నశేషుడిపై గోపాలుడి విహారం తిరుమల: తిరుమలేశుని బ్రహ్మోత్సవాల రెండో రోజు గురువారం ఉదయం చిన్నశేషవాహనం, రాత్రి హంసవాహనంపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం 7.00 నుంచి 8.00 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరిగింది. ఉదయం శ్రీమలయప్ప స్వామి ఐదు తలల చిన్నశేష వాహనంపై పండరీపురం శ్రీపాండురంగ స్వామి అలంకారంలో ఊరేగారు. వెలసిపోయింది! బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన చిన్నశేష వాహన సేవ పీఠానికి బంగారుపూత వెలసిపోయి కనిపించింది. పీఠానికి అమర్చిన రాగిరేకు కనిపించడంతో భక్తులు ఒకింత అసంతృప్తికి గురయ్యారు. అన్నపూర్ణగా భద్రకాళి హన్మకొండ కల్చరల్: శ్రీ భద్రకాళి దేవీ శరన్నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు అమ్మవారిని అన్నపూర్ణా దేవీగా అలంకరించారు. గురువారం ఉదయం 4గంటలకు ఆలయ ప్రధానార్చకులు శేషు ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు నిత్యాహ్నికం, సుప్రభాత పూజలు జరిపారు. అమ్మవారి స్వపనమూర్తిని అన్నపూర్ణ అమ్మవారిగా అలంకరించి మకరవాహనంపై ఊరేగించారు. రాత్రి 9గంటలకు మహాపూజ, కుమారీ, సువాసినీ పూజలు మహానీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. అనంతరం జరిపిన మహాప్రసాదవితరణ కార్యక్రమంలో దేవాదాయశాఖ డీసీ నర్సింహులు పాల్గొన్నారు. శుక్రవారం అమ్మవారిని గాయత్రీగా అలంకరించనున్నారు. -
రెండవ రోజు శ్రీబాలాత్రిపురసుందరీదేవి
అరుణ కిరణ జాలై రంజితా సావకాశా విద్ధృత జప వాటికా పుస్తకాభీతి హస్తా ఇతర కరవరద్యా ఫుల్ల కల్హార సంస్థా నివసతు హృది బాలా నిత్యకల్యాణరూపా శరన్నవరాత్రి మహోత్సవాలలో కనకదుర్గాదేవి బాలాత్రిపురసుందరీదేవిగా దర్శనమిస్తుంది. బాలాదేవి మహిమాన్వితమైన తల్లి. శ్రీబాలామంత్రం సమస్త దేవీమంత్రాల్లోకి గొప్పది, ముఖ్యమైనది. అందుకే శ్రీవిద్యోపాసకులకి మొట్టమొదట బాలామంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపురసుందరీదేవి నిత్యం కొలువుండే పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత ఈ బాలా దేవి. అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపురసుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలం. దసరా మహోత్సవాలలో భక్తులకు పూర్ణ ఫలం అందించే అలంకారం శ్రీబాలాదేవి. -
దేవీ అలంకారాలు
భక్తితో నమస్కరిస్తే చాలు... అమ్మలా అనుగ్రహించి, అన్ని కార్యాలలోనూ విజయాలను ప్రసాదించే బెజవాడ కనకదుర్గాదేవి ఆలయంలో ఏటా ఆశ్వయుజ శుద్ధ ప్రతిపద అంటే పాడ్యమి నుండి విజయదశమి వరకు వైభవంగా శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తారు. ఇది ఆనవాయితీ. ఈ సందర్భంగా అమ్మవారి రేపటి అలంకార విశేషాలు, పఠించవలసిన శ్లోకం, చేయవలసిన నివేదన, పూజించడం వల్ల కలిగే ఫలితాలను సాక్షి ఫ్యామిలీ పాఠకుల కోసం రోజూ ప్రత్యేకంగా అందిస్తుందని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం. శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మొదటిరోజు బుధవారం అమ్మవారు శ్రీస్వర్ణ కవచాలంకృత శ్రీదుర్గాదేవిగా దర్శనమిస్తుంది. అమ్మవారిని బంగారు కవచాలతో, ఎరుపురంగు చీరతో అలంకరిస్తారు. నివేదన ఆవునేతితో చేసిన పొంగలి ఈరోజు పఠించవలసిన శ్లోకం: సౌమ్యాని యాని రూపాణి త్రైలోక్యే విచరంతి తే! యాని చాత్యుర్థ ఘోరాణి తైర్మాస్మాంస్తథా భువమ్ భావం: ఓ జననీ! ముల్లోకాలయందు సంచరిస్తుండే నీ సాత్త్విక రూపాలతో, మిక్కిలి భయంకరమైన స్వరూపాలతో మమ్మల్ని, ఈ సమస్త భూమండలాన్ని కాపాడు! ఫలమ్: ఇంటిలో ఉన్న చిక్కులు తొలగి, శక్తి, సంపదలు కలుగుతాయి. -
రూ. లక్ష పైన విరాళమిస్తే రెండు సార్లు దర్శనం
విజయవాడ : కనక దుర్గమ్మకు రూ. లక్ష లేదా ఆపైన విరాళమిచ్చిన వారికి ఇకపై సంవత్సరానికి రెండుసార్లు అమ్మవారి దర్శనం కల్పిస్తామని, అలాగే వారికి ప్రత్యేక కార్డులు అందజేస్తామని దుర్గగుడి ఈవో పద్మ తెలిపారు. బుధవారం దుర్గగుడి పాలకమండలి సమావేశం జరిగింది. సమావేశం ముగిసిన తర్వాత దుర్గ గుడి ఈఓ పద్మ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న రూ. 300 టికెట్ ధరను రూ.250 చేసే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలియజేశారు. ఫిబ్రవరి 24 నుండి 26 వరకు ప్రత్యేక పూజలు నిర్వహించి, 26 నుంచి భక్తులకు శివాలయ దర్శనం అనుమతిస్తామని వెల్లడించారు. రానున్న ఎండాకాలంలో భక్తులు ఎండ వేడిమిని తట్టుకునేందుకు షెల్టర్లు ఏర్పాటు చేసేందుకు దాతల సహకారం కోరతామని చెప్పారు. అమ్మవారి దర్శనానికి రాజ గోపురం మీదుగా క్యూలైన్లు వెళ్లే ఏర్పాటును పరిశీలిస్తున్నామని, చీరల పేరు చెప్పి ముక్కలుగా అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరతామని వెల్లడించారు. కొండ మీద పార్కింగ్ సమస్య పై అధ్యయనం చేస్తున్నామని వివరించారు. -
దుర్గమ్మను ఐదు కోర్కెలు కోరా: సీఎం
సాక్షి, విజయవాడ: అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా మహిళలు పోటీపడాలని, వారి కంటే ఎక్కువ రాణించాలని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ కనకదుర్గమ్మను చంద్రబాబు తన కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనుమడు దేవాన్ష్లతో కలసి శనివారం దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను దుర్గమ్మను దర్శించుకుని ఐదు కోర్కెలు కోరానని చెప్పారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్మార్ట్ వాటర్ గ్రిడ్, స్మార్ట్ పవర్ గ్రిడ్, పోలవరం సకాలంలో పూర్తిచేయడం, రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపచేసేలా అమరావతి నిర్మాణం ఆ కోర్కెలని తెలిపారు. -
నాల్గవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం
ఈరోజు అమ్మవారిని కాశీపురాధీశ్వరి అయిన అన్నపూర్ణాదేవిగా గోధుమరంగు చీరతో అలంకరిస్తారు. సకల దానాలలో ఉత్కృష్టమైనది అన్నదానం. లోకాలకు క్షుధార్తి తీర్చేది అమ్మ స్వరూపం. ఎందరున్నా అమ్మకాదు, ఎన్ని తిన్నా అన్నం కాదు. ఎడమ చేతిలో రసాన్న పాత్ర ధరించి ఆదిభిక్షువుగా యాచించ వచ్చిన లయకారుడయిన విశ్వేశ్వరుడికి కుడిచేతితో అన్నప్రదానం చేస్తూ దయతో మనపై కరుణామృతాన్ని కురిపిస్తూ తనకు ఆయురారోగ్యాలను ప్రసాదిస్తూ అమ్మ అన్నపూర్ణగా దర్శనమిస్తుంది. అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మను దర్శిస్తే కాశీవాస పుణ్యం లభిస్తుందని ఆర్యోక్తి. ఫలమ్: పాడిపంటలు, ధనధాన్యాభివృద్ధి, నూతన గృహ యోగం కలుగుతాయి. ఉపాసకులకు జ్ఞానం, వైరాగ్యం ప్రాప్తిస్తాయి. నివేదన : అప్పాలు, షడ్రసోపేత మహానైవేద్యం (ఓపిక లేనివారు స్నానం చేసి శుచిగా వండిన అన్నం, పప్పు, కూరలను కూడా నివేదించవచ్చు) శ్లోకం: అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధర్థం భిక్షాం దేహిచ పార్వతి భావం: ఓ అన్నపూర్ణాదేవీ, సాక్షాత్తూ శంకరుని ప్రాణేశ్వరివైన నీవు మాకు జ్ఞానాన్ని, వైరాగ్యాన్నీ భిక్షగా ప్రసాదించు తల్లీ! -
అమ్మకు భక్తితో...
సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణీ నమోస్తుతే!! అంటూ జగన్మాతను నవరాత్రులు భక్తిశ్రద్ధలతో కొలిచే దసరా మొదలైంది.. రోజూ చేసే పూజలు సరే.. మరి నైవేద్యాల మాటో..? అవీ ఉండాల్సిందే కాబట్టి అన్నంతో చేసే ఈ తొమ్మిది రకాల పదార్థాలను ఓసారి చూడండి.. మీకు అనువైన వాటిని చేసి నివేదించండి. కేసరీ బాత్ కావల్సినవి: అన్నం – కప్పు, చక్కెర – ముప్పావుకప్పు, జీడిపప్పు, కిస్మిస్ పలుకులు – రెండూ కలిపి పావు కప్పు, నెయ్యి – అరకప్పు, యాలకులపొడి – చెంచా. తయారీ: అడుగు మందంగా ఉన్న గిన్నెలో నెయ్యీ, నాలుగుకప్పుల నీళ్లు తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. రెండు నిమిషాలయ్యాక అందులో కడిగిన బియ్యం వేసి కలిపి మూత పెట్టేయాలి. అన్నం ఉడికాక చక్కెర వేసి మధ్య మధ్య కలుపుతూ ఉండాలి. అది పూర్తిగా దగ్గరకు అయ్యాక యాలకులపొడీ, జీడిపప్పు, కిస్మిస్ పలుకులు వేసి ఓసారి కలిపి దింపేయాలి. కావాలనుకుంటే ఇందులో రంగు వేసుకోవచ్చు. కదంబం కావల్సినవి: బియ్యం – కప్పు, కందిపప్పు – కప్పు, చింతపండు రసం – పెద్ద చెంచా, బెండకాయ, క్యారెట్, చిలగడదుంప, బంగాళాదుంప, వంకాయ, క్యాప్సికం, బఠాణీ, తీపి గుమ్మడికాయ, చిక్కుడుకాయ ముక్కలు – అన్నీ కలిపి మూడున్నర కప్పులు, సాంబారుపొడి – పెద్ద చెంచా, ఉప్పు – తగినంత, నెయ్యి – రెండు స్పూన్లు, జీలకర్ర–చెంచా, కొత్తిమీర–కట్ట, కరివేపాకు రెబ్బలు– రెండు. తయారీ: బియ్యంలో మూడుకప్పుల నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టాలి. నాలుగు కూతలు వచ్చాక దింపేయాలి. అదేవిధంగా కందిపప్పూ, కూరగాయ ముక్కల్ని విడివిడిగా ఉడికించుకుని తీసుకోవాలి. ఇప్పుడు పొయ్యిమీద బాణలి పెట్టి... నెయ్యి వేయాలి. అది కరిగాక జీలకర్రా, కరివేపాకు వేయించి ఉడికించి పెట్టుకున్న కూరగాయముక్కలు వేయాలి. తరవాత సాంబారుపొడీ, తగినంత ఉప్పూ, చింతపండు రసం వేయాలి. ఐదు నిమిషాలయ్యాక ఉడికించి పెట్టుకున్న కందిపప్పు వేసి కాసిని నీళ్లు పోసి ఒకసారి ఉడకనివ్వాలి. తరవాత అందులో అన్నం, కొత్తిమీర వేసి కలిపితే చాలు. మిరియాల అన్నం కావల్సినవి: అన్నం – కప్పు, నెయ్యి – మూడు చెంచాలు, జీలకర్ర – చెంచా, ఉప్పు – తగినంత, మిరియాలు – ఒకటిన్నర టేబుల్‌స్పూను, కరివేపాకు రెబ్బలు – నాలుగు, జీడిపప్పు–4. తయారీ: పొయ్యిమీద బాణలి పెట్టి మిరియాలను వేయించి తీసుకోవాలి. తరవాత మెత్తగా పొడిలా చేసుకోవాలి. అదే బాణలిలో నెయ్యి వేసి జీలకర్రా, కరివేపాకు రెబ్బలూ, మిరియాలపొడి వేయాలి. తరవాత అందులో అన్నం, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి వేయించిన జీడిపప్పు వేసి దించేయాలి. పాల పరమాన్నం కావల్సినవి: బియ్యం – అరకప్పు, పాలు – రెండు కప్పులు, బెల్లం తరుగు – ఒకటిన్నర కప్పు, యాలకులపొడి – అరచెంచా, నెయ్యి – పావుకప్పు, జీడిపప్పు, కిస్మిస్ – రెండూ కలిపి పావుకప్పు. తయారీ: పాలు ఓ గిన్నెలోకి తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అవి మరిగాక కడిగిన బియ్యం వేసి మంట తగ్గించాలి. అన్నం మెత్తగా అయ్యాక బెల్లం వేసి బాగా కలపాలి. అది దగ్గరకు అయ్యాక యాలకులపొడివేసి దింపేయాలి. ఇప్పుడు పొయ్యిమీద బాణలి పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించి.. దీన్ని పరమాన్నంలో వేసి ఒకసారి కలపాలి. కట్టు పొంగలి కావల్సినవి: పెసరపప్పు – కప్పు, బియ్యం – రెండు కప్పులు, జీలకర్ర – టేబుల్‌స్పూను, మిరియాలు – రెండు చెంచాలు, జీడిపప్పు – అరకప్పు, ఉప్పు – తగినంత, నెయ్యి – పావుకప్పు. తయారీ: పెసరపప్పూ, బియ్యాన్ని కలిపి కడిగి ఆరున్నర గ్లాసుల నీళ్లు పోసి కుక్కర్లో మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు పొయ్యిమీద బాణలి పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక జీలకర్రా, మిరియాలూ, జీడిపప్పు వేసి వేయించి దింపేయాలి. ఈ తాలింపును ఉప్పు కలిపిన పెసరపప్పు అన్నంలో వేసి కలపాలి. పులిహోర కావల్సినవి: అన్నం – కప్పు, నూనె – టేబుల్ స్పూను, పల్లీలు – టేబుల్ స్పూను, మినప్పప్పు, సెనగపప్పు – ఒకటిన్నర చెంచా చొప్పున, పచ్చిమిర్చి – మూడు, ఆవాలు – చెంచా, ఎండుమిర్చి – నాలుగు, కరివేపాకు రెబ్బలు – రెండు, పసుపు – అరచెంచా, ఉప్పు – తగినంత, చింతపండు గుజ్జు – ఒకటిన్నర టేబుల్‌స్పూను, బెల్లం ముక్క – చిన్నది. తయారీ: అన్నాన్ని ఓ పళ్లెంలో పరిచి పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యిమీద బాణలి పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక పల్లీలు వేయాలి. అవి కాస్త వేగుతున్నప్పుడు సెనగపప్పూ, మినప్పప్పూ, ఆవాలూ, ఎండుమిర్చి వేయాలి. ఈ తాలింపు వేగాక కరివేపాకూ, పచ్చిమిర్చి వేయాలి. నిమిషం తరవాత చింతపండు గుజ్జూ, పసుపూ, తగినంత ఉప్పూ, బెల్లంముక్క వేసి మంట తగ్గించాలి. చింతపండు ఉడికాక అన్నంలో ఈ పులుసు వేసి బాగా కలిపితే చాలు. చక్కెర పొంగలి కావల్సినవి: బియ్యం – కప్పు, పెసరపప్పు – అరకప్పు, బెల్లం – ఒకటింబావు కప్పు, నెయ్యి – అరకప్పు, కిస్మిస్, జీడిపప్పు – రెండూ కలిపి అరకప్పు, ఎండుకొబ్బరిముక్కలు – పావుకప్పు, యాలకులపొడి – అరచెంచా. తయారీ: పొయ్యిమీద బాణలి పెట్టి పెసరపప్పును దోరగా వేయించి తీసుకోవాలి. అందులో కడిగిన బియ్యం వేసి నాలుగు కప్పుల నీళ్లు పోసి నాలుగు కూతలు వచ్చేవరకూ ఉడికించుకుని తీసుకోవాలి. ఇంతలో బెల్లంలో అరకప్పు నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టాలి. అది కరిగాక దింపేయాలి. ఇప్పుడు పొయ్యిమీద ఉడికించి పెట్టుకున్న అన్నం ఉంచి.. అందులో కరిగిన బెల్లం పాకం కలిపి మంట తగ్గించాలి. మరో పొయ్యిమీద బాణలి పెట్టి.. సగం నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరిముక్కలు వేసి వేయించుకుని అన్నంలో వేయాలి. చివరగా యాలకులపొడీ, మిగిలిన నెయ్యి వేసి దగ్గరకు అయ్యేవరకూ ఉడకనిచ్చి దింపేయాలి. కొబ్బరి అన్నం కావల్సినవి: బియ్యం – కప్పు, కొబ్బరి తురుము – ఒకటిన్నర కప్పు, కొత్తిమీర – కట్ట, జీడిపప్పు – పది, ఎండుమిర్చి – మూడు, పచ్చిమిర్చి – నాలుగు, కరివేపాకు – రెండు రెబ్బలు, సెనగపప్పు – టేబుల్‌స్పూను, మినప్పప్పు – చెంచా, జీలకర్ర – చెంచా, ఆవాలు – అరచెంచా, నెయ్యి – టేబుల్‌స్పూను, నూనె – చెంచా, ఉప్పు – తగినంత. తయారీ: బియ్యం కడిగి రెండు గ్లాసుల నీళ్లు పోసి పొడిపొడిగా వండి వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు పొయ్యిమీద బాణలి పెట్టి... నెయ్యి, నూనె వేయాలి. నెయ్యి కరిగాక ఎండుమిర్చీ, సెనగపప్పూ, మినప్పప్పూ, జీలకర్రా, ఆవాలు, జీడిపప్పు వేసి వేయించాలి. అవి వేగాక నిలువుగా తరిగిన పచ్చిమిర్చీ, కరివేపాకు వేయాలి. రెండు నిమిషాలయ్యాక కొబ్బరితురుమూ, తగినంత ఉప్పు వేసి పచ్చివాసన పోయాక దింపేయాలి. దీన్ని అన్నంలో వేసి బాగా కలిపి కొత్తిమీర తరుగు వేయాలి. దద్ధ్యోదనం కావల్సినవి: అన్నం – కప్పు, పెరుగు – ఒకటిన్నర కప్పు, ఉప్పు – తగినంత, ఆవాలు – చెంచా, జీలకర్ర – చెంచా, కరివేపాకు – రెండు రెబ్బలు, అల్లం తరుగు – చెంచా, పచ్చిమిర్చి ముక్కలు – రెండు చెంచాలు, నెయ్యి – రెండు చెంచాలు, కొత్తిమీర – కట్ట. తయారీ: అన్నాన్ని ఓ గిన్నెలోకి తీసుకుని పెరుగు వేసి బాగా కలపాలి. ఇప్పుడు పొయ్యిమీద బాణలి పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక ఆవాలూ, జీలకర్ర వేయాలి. అవి వేగాక కరివేపాకూ, పచ్చిమిర్చి ముక్కలూ, అల్లం తరుగు వేసి దింపేయాలి. ఈ తాలింపును పెరుగున్నంలో వేయాలి. తగినంత ఉప్పూ, కొత్తిమీర తరుగు వేసి కలపాలి. కావాలనుకుంటే ఇందులో క్యారెట్ తురుము, దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చు -
మొదటిరోజు: స్వర్ణకవచాలంకృత కనకదుర్గాదేవి
దేవీనవరాత్రులు భక్తితో దణ్ణం పెట్టుకుంటే చాలు... అమ్మలా అనుగ్రహించి, అన్ని కార్యాలలోనూ విజయాలను ప్రసాదించే బెజవాడ కనకదుర్గాదేవి ఆలయంలో ప్రతియేడూ ఆశ్వయుజ శుద్ధ ప్రతిపద అంటే పాడ్యమినుండి విజయదశమి వరకు వైభవంగా శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తారు. ఇది ఆనవాయితీ. ఈ సందర్భంగా ప్రతిరోజూ అమ్మవారి అలంకార విశేషాలు, పఠించవలసిన శ్లోకం, చేయవలసిన నివేదన, పూజించడం వల్ల కలిగే ఫలితాలను సాక్షి ఫ్యామిలీ పాఠకులకోసం రోజూ ప్రత్యేకంగా అందిస్తున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం. శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా మొదటిరోజు శుక్రవారం అమ్మవారు శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవి (శైలపుత్రి)గా దర్శనమిస్తుంది. అమ్మవారిని బంగారు కవచాలతో, ఎరుపురంగు చీరతో అలంకరిస్తారు. నివేదన: ఆవునేతితో చేసిన పొంగలి. ఈరోజు పఠించవలసిన శ్లోకం: సౌమ్యాని యాని రూపాణి త్రైలోక్యే విచరంతితే! యాని చాత్యుర్థ ఘోరాణి తై ర్మాస్మాంస్తథా భువమ్ భావం : ఓ జననీ! ముల్లోకాలయందు సంచరిస్తుండే నీ సాత్త్విక రూపాలతో మిక్కిలి భయంకరమైన స్వరూపాలతో మమ్మల్ని, ఈ సమస్త భూమండలాన్ని కాపాడు! ఫలమ్ : ఇంటిలో ఉన్న చిక్కులు తొలగి, శక్తి, సంపదలు కలుగుతాయి. -
నయన మనోహరం.. దుర్గమ్మ నదీవిహారం
సాక్షి, విజయవాడ : దుర్గమ్మ కృష్ణానదీ విహారం ఆదివారం రాత్రి నయనానందకరంగా సాగింది. దసరా ఉత్సవాల్లో చివరిరోజు దశమినాడు కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా దుర్గామల్లేశ్వరస్వామివార్ల ఉత్సవ మూర్తులను ఆలయ అధికారులు, నగర పోలీసులు పల్లకీలో ఊరేగిస్తూ దుర్గాఘాట్‌కు తీసుకొచ్చారు. రంగురంగుల విద్యుద్దీపాలు, వివిధ రకాల పూలతో అలంకరించిన హంస వాహనంపై ఉత్సవమూర్తులను ఉంచి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మేళతాళాలు, వేదమంత్రాల మధ్య సుమారు రెండు గంటలపాటు తెప్పోత్సవం జరిగింది. హంస వాహనంపై స్వామి, అమ్మవార్లు నౌకా విహారం చేస్తుంటే భక్తులు జయజయధ్వానాలు చేశారు. కళ్లు మిరమిట్లు గొలిపేలా బాణసంచా కాల్చారు. కార్యక్రమంలో కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం. జ్యోతి, జాయింట్ కలెక్టర్ ఉషాకుమారి, సబ్ కలెక్టర్ హరిచందన, పోలీసు కమిషనర్ బి.శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాజరాజేశ్వరిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ దసరా ఉత్సవాల్లో ఆఖరిరోజు అమ్మవారు రాజరాజేశ్వరీదేవిగా దర్శనం ఇచ్చారు. శాంతస్వరూపిణి అలంకారంలో భక్తుల్ని కటాక్షించించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే దర్శనం కోసం భక్తులు క్యూలో నిలబడ్డారు. నలభై రోజుల భవానీ దీక్షలు విరమణ చేసేందుకు రాష్ట్రం నలమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఇంద్రకీలాద్రి ఎరుపెక్కింది. రద్దీ ఎక్కువగా ఉండటంతో అంతరాలయ దర్శనాన్ని రద్దు చేసి లఘు దర్శనానికి మాత్రమే అనుమతిచ్చారు. ఆదివారం టీటీడీ ఏఈవో రామ్మూర్తిరెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తొమ్మిది రోజులపాటు కనులపండువగా జరిగిన దసరా ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి.