కార్తీక శుద్ధ ఏకాదశికే ఉత్థాన ఏకాదశి అని పేరు. ఉత్థానమంటే లేవడమని అర్థం. నాలుగు మాసాలుగా పాలకడలిపై పవళించి ఉన్న శ్రీ మహావిష్ణువు ఏకాదశినాడు నిద్రమేల్కొంటాడని పురాణాలు చెబుతున్నాయి. మరుసటి రోజున అంటే క్షీరాబ్ది ద్వాదశినాడు శ్రీ మహావిష్ణువుతో తులసీ కళ్యాణం నిర్వహిస్తారు.
ఈ రోజున తులసికోటలో ఉసిరి కొమ్మను నాటి, దీపారాధన చేసి, ప్రత్యేక పూజలు చేస్తారు. చలిమిడితో చేసిన ప్రమిదల్లో ఆవునేతితో దీపాలు పెడతారు. ఈవేళ చేసే గోదానం, పెరుగన్నం దానం చేసినా ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. (19, సోమవారం క్షీరాబ్ధి ద్వాదశి)
జ్వాలాతోరణం
కార్తీక పున్నమి సందర్భంగా శ్రీశైలంతో సహా అన్ని శైవక్షేత్రాలలోనూ జ్వాలాతోరణం నిర్వహిస్తారు. జ్వాలాతోరణ సందర్శనం వల్ల ఆపదలు తొలగుతాయనీ, శుభప్రదమని నమ్మకం. (23, శుక్రవారం కార్తీక పున్నమి)
Comments
Please login to add a commentAdd a comment