
తొలి ఏకాదశి సందర్భంగా ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
సాక్షి, తాడేపల్లి: తొలి ఏకాదశి సందర్భంగా ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘పవిత్రమైన తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగువారందరికీ శుభాకాంక్షలు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
పవిత్రమైన తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగువారందరికీ శుభాకాంక్షలు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 17, 2024