సముద్ర నురుగుతో తయారుచేసినట్లు చెప్పే వినాయక విగ్రహం ప్రపంచంలో ఒకటే ఒకటి ఉంది. ఆ విగ్రహం తమిళనాడులో శ్వేత వినాయకర్ పేరుతో పూజలు అందుకొంటూ ఉంది. ఇక్కడ విగ్రహానికి అభిషేకం చేయరు, పూలు, కుంకుమ, పసుపుతో అర్చన చేయరు. వస్త్రాలు కూడా కట్టరు. అంటే ఏవిధంగానూ విగ్రహాన్ని తాకరు.
విగ్రహాన్ని తాకకుండా కేవలం పచ్చ కర్పూరం పొడిని విగ్రహం పైకి చల్లుతారు. ఈ విగ్రహాన్ని వినాయకచవితి రోజు పూజిస్తే ప్రతి రోజు వినాయక పూజ చేసిన ఫలితం దక్కుతుందని స్థానికులు చెబుతారు. ఇక స్వామిని సేవిస్తే వివాహ విషయంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.
మహిమ ఏమిటి?
ఇక్కడ వినాయకుడు మహావిష్ణువు కళ్ల నుంచి పుట్టిన ఇంద్రదేవి కమలాంబల్, బ్రహ్మ వాక్కు నుంచి పుట్టిన బుద్ధి దేవిని వివాహం చేసుకొన్నారని స్థలపురాణం. అందువల్లే ఇక్కడ స్వామిని సేవిస్తే వివాహ విషయంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.
ఎక్కడ ఉంది?: ఈ శ్వేత వినాయక దేవాలయం కుంభకోణం బస్టాండు నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది.
తమిళనాడులోని తంజావూర్ జిల్లాలోని కుంభకోణం తాలూకాలో ఉన్న స్వామిమలై సమీపంలోని తిరువల్లాంచూజి గ్రామంలో ఉన్న ఒక హిందూ ఆలయం ఈ శ్వేత వినాయగర్ దేవాలయం.
Comments
Please login to add a commentAdd a comment