నన్నడగొద్దు ప్లీజ్
సర్... నేను నా గర్ల్‌ఫ్రెండ్‌కి చాలాసార్లు ప్రపోజ్ చేశాను. తను రెస్పాండ్ అవడం లేదు. ఎన్నిసార్లు అయినా నవ్వుతుంది కాని ఏమీ చెప్పదు. కాని మళ్లీ బాగా మాట్లాడుతుంది. నాకేమీ అర్థం కావడం లేదు. నన్ను ఏం చేయమంటారు?
– మహేంద్ర, ఇ–మెయిల్
‘మీరసలు ఎవరినైనా ప్రేమిస్తే కదా ఇంకొకరి ప్రేమ ప్రాబ్లమ్స్‌కి సమాధానం ఇవ్వాల్సింది. అసలు మీకీ ఉత్తరాలు ఎందుకు రాస్తారో అర్థం కాదు. మీలో ఏమి చూసి వీళ్లు ఫీలైపోతున్నారో నాట్ ఏబుల్ టు అండర్‌స్టాండ్’ అంది నీలాంబరి అక్కసుగా. నవ్వాను. ‘విరిగిన కాలు రిపేర్ చేయడానికి నా కాలు విరగ్గొట్టుకోనక్కర్లా. వీళ్ల ప్రేమను తప్పుదారి పట్టించడానికి డైవర్షన్ బోర్డు పెట్టక్కర్లా. డాక్టర్ బోర్డు పెట్టుకుంటే చాలు’ అన్నాను. మూతి ముడిచింది నీలాంబరి. ఇక నీ క్వశ్చన్‌కు నా ఆన్సర్. హిందీలో ఒక నానుడి ఉంది...‘హసీ తో ఫసీ’అని. దీని తెలుగు అనువాదమేంటంటే ... ‘నవ్విందంటే లవ్‌లో పడిందన్నమాటే’. కాని ఎందుకో నీకంత సీన్‌లేదనిపిస్తోంది.
జోకర్‌ని చూస్తే నవ్వొçస్తుంది. అరటితొక్క మీద కాలేసి జారిపడ్డవాణ్ని చూస్తే నవ్వొస్తుంది. సిగ్గుపడితే వర్కవుట్ అయినట్టు కాని, నవ్విందంటే అర్థమేంది బాస్... మన గురించి ఆ అమ్మాయికి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. మనం అమ్మాయిల్ని అదో రకంగా చూస్తామని ఆ అమ్మాయి ఫ్రెండ్స్ ఆల్రెడీ పేపర్ లీక్ చేసినట్టున్నారు. నామాట విని ఒక ట్రయల్ వేయ్. లవ్ లెటర్ రాసి ఆ అమ్మాయి చేతికందించు. లెటరంతా చదివి పకపకా నవ్విందనుకో నీ కుళ్లు జోకు... అదే నీ లవ్‌లెటర్ వర్కవుట్ అయి ఉండొచ్చు. ఇంకా మంచి ఐడియా ఇస్తా. ఒక ఎన్వలప్‌లో లాఫింగ్ గ్యాస్ ప్యాక్ చేసి లవ్‌లెటర్‌గా అందించు.
నవ్వి నవ్వి అమ్మాయికి కడుపునొప్పి వస్తుంది. అప్పుడు నువ్వు హీరోలా అమ్మాయిని హాస్పిటల్‌కి తీసుకెళ్లి చక్కగా సేవ చేసి ఇంప్రెషన్ కొట్టెయ్. ఏమైనా అర్థమయిందా? బ్రో... వెకిలివేషాలు మాని బుద్ధిగా చదువుకో. లవ్‌లెటర్ బదులు రిపోర్ట్ కార్డ్ చూపించు. ఇంప్రెషన్ పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ...
ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
లవ్ డాక్టర్ రీవిజిట్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్
ఈ కింది అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారా హిల్స్,
హైదరాబాద్–34.
lovedoctorram@sakshi.com