సార్! ఒకమ్మాయి నన్ను ఐదేళ్లుగా ప్రేమిస్తోంది. కానీ నేను పట్టించుకోలేదు. ఇప్పుడు నాకు ఆ అమ్మాయి కావాలనిపిస్తోంది. అయితే, తానిప్పుడు కాంటాక్ట్ అవట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలి సార్? – నగేశ్
‘అయ్యో పాపం సార్! అబ్బాయి బెంగపడుతున్నాడు!!’ అవునా!? ‘అవునా... ఏంటి సార్? అల్లల్లాడిపోతున్నాడు!?’ నీకెలా తెలుసు అల్లల్లాడిపోతున్నాడని!? ‘చదివితే అర్థం కావడం లేదా సార్?’ ఏది... ఆ నాలుగు ముక్కల్లోనే నీకంత అర్థమయిపోయిందా? ‘సార్... లవ్ అంటే పేజీలు... పేజీలు రాయడం కాదు సార్!’ మరేంటో? ‘ఫోర్ వర్డ్స్‌లో ఫుల్లుగా చెప్పేయడమే సార్!!’ అమ్మాయి మనోడిని ఇష్టపడినప్పుడు మాత్రం పోజులు కొట్టాడు! ట్రెయిన్ వెళ్లాక ప్లాట్‌ఫామ్ మీద అడుక్కుంటున్నాడు!!
‘ఏంటి సార్, ప్రేమను అడుక్కోవడం... అర్ధించుకోవడం... అంటున్నారు!? వెరీ బ్యాడ్ సార్!!’ అదే ప్లాట్‌ఫామ్ మీద ఇష్టమైన ఇంకో అమ్మాయి కనబడితే కూడా మనోడు మళ్లీ స్టైల్ కొట్టడని ఏంటి గ్యారెంటీ? ‘ఊరుకోండి సార్... బాధ పడతాడు. ఏదైనా మంచి విషయం చెప్పండి!!’ నగేశ్! డోన్ట్‌వర్రీ. గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు గుడ్ బాయ్స్ లైక్ యూ!! అప్పుడు తొందరపడలేదు! అమ్మాయిని మోసగించలేదు!! యూ ఆర్ గ్రేట్! నీకు తప్పకుండా లవ్ మళ్లీ చాన్స్ ఇస్తుంది!!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి. లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com