గోళ్లు అందంగా కనిపించడానికి వాటికి నెయిల్‌పాలిష్ వేస్తాం. ఇంకాస్త కొత్తగా కనిపించాలంటే పాలిష్‌పైన డిజైన్లు వేయడం చూస్తుంటాం. కానీ గోళ్లకు అందమైన రింగులు తొడిగితే అవి ఇంకెంత మెరిసిపోతాయో తెలపడానికే డిజైనర్లు పోటీపడుతున్నారు. వాటిని తమ మునివేళ్లకు తగిలించుకుని ముదితలు ముచ్చటపడుతున్నారు. ఇప్పటి వరకు వేళ్లకే ఉన్న ఉంగరాలు కాస్తా ఇంకాస్త ముందుకు జరిగి గోళ్లపై హొయలుపోతున్నాయి. ప్రాచీన చైనాలో గోళ్ల సంరక్షణలో భాగంగా ఈ రింగ్ ట్రెండ్ మొదలైంది.
గోళ్ల మీద నక్షత్రాలు, కీ చెయిన్‌లను పోలి ఉండే డిజైన్లు మొదట వచ్చాయి. ఇటీవలి కాలంలో వీటిలో ఎన్నో విభిన్న డిజైన్లు వెలుగు చూస్తున్నాయి. బంగారం, వెండి, స్టీల్‌తో తయారయ్యే ఈ నెయిల్ రింగ్స్‌లో స్వరోస్కి క్రిస్టల్స్ పొదగడంతో మరింత మెరుపులీనుతున్నాయి. స్టైలిష్ యాక్ససరీస్‌లో ‘ఎండ్’ అనేది లేదని నిరూపిస్తున్న ఈ తరహా రింగ్స్ మగువలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆన్‌లైన్‌లోనూ లభిస్తున్న వీటి ధరలు రూ. 200 నుంచి వేల రూపాయల్లో ఉన్నాయి.
వెలి కొసలలో మెరుపులు... గోళ్ల రింగులు!
Published Tue, Jun 12 2018 12:12 AM | Last Updated on Tue, Jun 12 2018 12:12 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment