
ఆగస్టు 13 న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు:
శ్రీదేవి (నటి), షోయబ్ అక్తర్ (మాజీ క్రికెటర్)
ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 2. ఇది చంద్రునికి సంబంధించిన సంఖ్య. ఈ వ్యక్తులపై చంద్రుని ప్రభావం వచ్చే సంవత్సరం ఇదేరోజు వరకు ఉంటుంది. పుట్టిన తేదీ 13. ఇది రాహు సంఖ్య. చాల మంది 13 మంచిది కాదు అనే అభిప్రాయంలో ఉంటారు కాని, 13 అనేది సూర్య, గురుల కలయికతో ఏర్పడటం వల్ల రాజయోగాన్నిస్తుంది. అయితే ఈ యోగం జీవితం ప్రథమార్ధంలో కొంత కష్టాలను ఇచ్చి 35 సంవత్సరాల తరవాత నుంచి మంచి అభివృద్ధి, పేరు ప్రఖ్యాతులు, స్థిర ఆస్తులు ఇస్తుంది. అందువల్ల 13వ తేదీన పుట్టిన వారు అధైర్యపడవద్దు. ఈ సంవత్సర సంఖ్య 2. దీనివల్ల చాలా మంచి ప్లానింగ్ ఉంటుంది. మీ పుట్టిన తేదీ బుధ, గురుల సంయోగం వ ల్ల ఏర్పడినందువల్ల టెక్నికల్ రంగాలలో రాణిస్తారు. విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తారు. గురు శుక్రుల కలయిక వల్ల మంచి ఆరోగ్యం, ధనలాభం కలుగుతాయి. విలువైన వస్తువులు కొంటారు. ఆనందంగా గడుపుతారు. ఈ సంవత్సరం ఉద్యోగం మారకుండా, ఉన్న వాటిని కొనసాగించడం మంచిది. గ్యాస్ట్రిక్, ఉదర సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్త వహించడం మంచిది.
లక్కీ నంబర్స్: 1,2,4,6,7; లక్కీ కలర్స్: వయొలెట్, గ్రీన్, సిల్వర్, గోల్డెన్, శాండల్; లక్కీ మంత్స్: మార్చి, ఏప్రిల్, జూన్, ఆగస్ట్, డిసెంబర్. సూచనలు: కోపం తగ్గించుకోవడం మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, వికలాంగులకు, అనాథలకు తగిన సాయం చేయడం; వృద్ధాశ్రమాలలో సేవ చేయడం మంచిది.
- డాక్టర్ మహమ్మద్ దావూద్