శ్రీనివాసరావు తన మేడపై చెక్కపెట్టెలు, టబ్‌లలో సాగు చేస్తున్న ఇంటిపంటలు
హైదరాబాద్ మియాపూర్‌లో సొంత భవనంలో నివాసం ఉంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వక్కలెంక శ్రీనివాసరావు కుటుంబం గత కొన్నేళ్లుగా టెర్రస్‌పై సేంద్రియ ఇంటిపంటలు పండించుకుంటూ ఇంటిల్లపాదీ ఆరోగ్యదాయకమైన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా జీవిస్తున్నారు. వాడేసిన చెక్క పెట్టెలను స్వల్ప ధరకే కొనుక్కొచ్చి గార్డెన్‌కు అనుగుణంగా పెట్టెలను తనంతట తానే తయారు చేసుకొని, ప్లాస్టిక్ షీట్ వేసి మట్టి మిశ్రమం నింపి ఇంటిపంటలు పండిస్తుండటం శ్రీనివాసరావు ప్రత్యేకత. 5% ఎర్రమట్టి + 40% కొబ్బరి పొట్టు + 45% ఆవు, గేదె, గుర్రం, గొర్రెల ఎరువులు ఎన్ని రకాలు దొరికితే అవి, వర్మీకంపోస్టు కలిపి మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకుంటున్నారు. చెక్క పెట్టెల వల్ల ఎండ దెబ్బ నుంచి మొక్కలను సులభంగా పరిరక్షించుకుంటున్నారు. తమ కుటుంబానికి అవసరమైన ఆకుకూరలను 100%, కూరగాయలను 60–70% మేరకు ఇంటిపైనే పండించుకుంటున్న శ్రీనివాసరావు (91829 71978) అభినందనీయులు.
Comments
Please login to add a commentAdd a comment