కావలసినవి: చింతపండు – అర కప్పు; గింజలు లేని ఖర్జూరాలు – అర కప్పు; బెల్లం తురుము – అర కప్పు; నీళ్లు – 2 కప్పులు; వేయించిన జీలకర్ర పొడి – అర టీ స్పూను; ధనియాల పొడి – అర టీ స్పూను; శొంఠి పొడి – అర టీ స్పూను; మిరప కారం – అర టీ స్పూను; ఉప్పు – తగినంత.
తయారీ: బాణలిలో చింతపండు, ఖర్జూరాలు, నీళ్లు వేసి స్టౌ మీద పెట్టి సుమారు పది నిమిషాల పాటు పదార్థాలు మెత్తబడేవరకు ఉడికించాలి
♦ బెల్లం తురుము జత చేసి బాగా కలియబెట్టాలి
♦ జీలకర్ర పొడి, ధనియాల పొడి, శొంఠి పొడి, మిరపకారం జత చేసి మరోమారు కలపాలి
♦ ఉప్పు జత చసి బాగా కలిపి దింపేయాలి
♦ బాగా చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి
♦ మిశ్రమాన్ని వడగట్టి, డబ్బాలోకి తీసుకోవాలి
♦ ఎక్కువరోజులు నిల్వ ఉండాలంటే, ఫ్రిజ్‌లో భద్రపరచుకోవాలి.
గ్రీన్ చట్నీ
కావలసినవి:
కొత్తిమీర – 2 కప్పులు; పచ్చిమిర్చి – 2; అల్లం – చిన్న ముక్క; నిమ్మరసం – అర టీ స్పూను; జీలకర్ర పొడి – అర టీ స్పూను; చాట్ మసాలా – అర టీ స్పూను; ఉప్పు – తగినంత.
తయారీ: కొత్తిమీర ఆకులను శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి
♦ మిక్సీ జార్‌లో కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి, నిమ్మ రసం, చాట్ మసాలా, జీలకర్ర పొడి, అల్లం ముక్క, ఉప్పు వేసి మెత్తగా చేసి, చిన్న గిన్నెలోకి తీసుకోవాలి
♦ అవసరమనుకుంటే కొద్దిగా నీరు జత చేయ వచ్చు.
Comments
Please login to add a commentAdd a comment