ఎర్ర రక్త కణాలకు సూపర్‌ శక్తులు... | Red Blood Cells Have Super Powers Says McMaster University Scientists | Sakshi
Sakshi News home page

ఎర్ర రక్త కణాలకు సూపర్‌ శక్తులు...

Published Sat, Jan 18 2020 3:14 AM | Last Updated on Sat, Jan 18 2020 3:14 AM

Red Blood Cells Have Super Powers Says McMaster University Scientists - Sakshi

మనిషి శరీరంలో అపారంగా ఉండే ఎర్ర రక్త కణాలను వ్యాధులపై దాడుల చేసే సరికొత్త వ్యవస్థగా మార్చేందుకు మెక్‌మాస్టర్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఓ కొత్త పద్ధతిని అభివృద్ధి చేశారు. సమస్య ఉన్న అవయవాలకు నేరుగా మందులు అందించేలా ఎర్ర రక్త కణాలకు సూపర్‌ శక్తులు జోడించారు. మందులు మోసుకెళ్లేందుకు ఎర్ర రక్తకణాలు చాలా అనువైనవని ఇప్పటికే పలు పరిశోధనలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో మందులతో కూడిన ఎర్ర రక్త కణాలను సిద్ధం చేసేందుకు మెక్‌మాస్టర్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్త మైకెల్‌ రీన్‌స్టడర్‌ పరిశోధనలు చేశారు.

ఈ హైబ్రిడ్‌ కణాలను సిద్ధం చేసేందుకు ముందుగా ఎర్ర రక్త కణాల్లోపలి భాగాలను ఖాళీ చేస్తారు. ఆ తరువాత దీన్ని కృత్రిమ లైపోసోమ్‌ పదార్థంతో నింపుతారు. ఇది కాస్తా ఓ తిత్తిలా పనిచేస్తుంది. అవసరమైన మందులను ఇక్కడ నిల్వ చేయవచ్చు. ఈ హైబ్రిడ్‌ కణాలు కొన్ని వారాలపాటు శరీరంలో తిరుగుతూ ఉండగలవని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త సెబాస్టియన్‌ హింబర్ట్‌ తెలిపారు. ఎర్ర రక్త కణాలను హైబ్రిడ్‌ కణాలుగా మార్చడం ఒక్కరోజులోనే పూర్తి చేయవచ్చునని చెప్పారు. ఈ హైబ్రిడ్‌ కణాలను జంతువుల్లో ప్రయోగించేందుకు ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement