Red blood cells
-
కేన్సర్ కాటు..? వద్దు కుంగుబాటు
కేన్సర్ బాధితుల ఎదుట రెండు సవాళ్లు ఉంటాయి. మనోబలంతో కేన్సర్‌ను ఎదుర్కోవడం మొదటిదైతే... ఇక రెండోది... కేన్సర్ చికిత్స కారణంగా తమలో ఉండే విపరీతమైన నీరసం, తీవ్రమైన నిస్సత్తువలను అధిగమించడం.ముఖ్యంగా కీమోథెరపీ తీసుకునేవాళ్లలో ఈ నీరసం, నిస్సత్తువ చాలా ఎక్కువ. తమకు కేన్సర్ వచ్చిందని తెలియగానే బాధితులు కుంగిపోతారు. ఆపైన ఏ పనీ చేయనివ్వని తమ నీరసం మరింత కుంగుబాటుకు గురిచేస్తుంది. వాళ్లలో కలిగే ఈ నీరసాన్ని ‘కేన్సర్ ఫెటీగ్’గా చెబుతారు. రూన్సర్పై తమ పోరాటానికి తోడు ఈ నీరసం, నిస్సత్తువలపై పోరాటమే మరింత పెద్ద సవాలుగా మారుతుంది. ఈ ‘కేన్సర్ ఫెటీగ్’ ఎందుకు వస్తుంది, దాన్ని అధిగమించడమెలా అనే అనేక అంశాలపై అవగాహన కోసమే ఈ కథనం.కేన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న చాలామంది తమలోని నీరసం, బలహీనతల కారణంగా రోజువారీ పనులను సమర్థంగా చేసుకోలేరు. దాంతో జీవితం చాలా నిస్సారం గా అనిపించడం, జీవితాన్ని ఆస్వాదించలేక΄ోవడంతో కుంగుబాటు (డిప్రెషన్)కు గురవుతారు. ఈ నీరసాలూ, నిస్సత్తువలకు అనేక అంశాలు కారణమవుతాయి. కొంత కృషి చేస్తే దీన్ని అధిగమించడం అంత కష్టం కాదు. కానీ తమ జబ్బు, కుంగుబాటు కారణంగా తామీ ‘ఫెటీగ్’ను అధిగమించగలమనే ఆత్మవిశ్వాసాన్ని చాలామంది కోల్పోతారు. కాస్తంత కృషితోనే నీరసాలను జయించడం అంత కష్టమేమీ కాదు. తొలుత ఈ ‘ఫెటీగ్’కు కారణమయ్యే అంశాలేమిటో చూద్దాం...కారణాలు... రక్తహీనత (అనీమియా) : కేన్సర్ వ్యాధిగ్రస్తుల్లో నీరసం, నిస్సత్తువలకు ‘అనీమియా’ ఓ ముఖ్యమైన కారణం. సాధారణంగా క్యాన్సర్ బాధితుల్లో, అందునా మరీ ముఖ్యంగా బ్లడ్‌క్యాన్సర్ బాధితుల్లో ఎముక మూలుగ దెబ్బతినడం వల్ల ఎర్రరక్తకణాల ఉత్పత్తీ, వాటి సంఖ్యా తగ్గుతాయి. ఈ ఎర్రరక్తకణాలే శరీరంలోని ప్రతి కణానికీ ఆక్సిజన్ అందజేస్తాయన్న సంగతి తెలిసిందే. ఇవి తగ్గడంతో దేహంలోని కణాలకు అవసరమైన ΄ోషకాలూ, ఆక్సిజన్ కూడా తగ్గి బాధితుల్లో నీరసం కనిపిస్తుంది. విషాలు (టాక్సిన్స్) బయటకు వెళ్లకపోవడం: ఎర్రరక్తకణాలు దేహంలోని కణాలకు ఆక్సిజన్‌ను అందించడంతో పాటు జీవక్రియల కారణంగా అక్కడ ఏర్పడ్డ కార్బన్ డై ఆక్సైడ్, ఇతర విషపదార్థాల (టాక్సిన్స్)ను బయటకు పంపడానికి సహాయపడతాయి. అయితే ఎర్రరక్తకణాలు తగ్గడంతో బయటకు విసర్జితం కావాల్సిన విషపదార్థాలూ పోవాల్సినంతగా బయటకు వెళ్లవు. దేహంలో ఉండిపోయిన ఈ టాక్సిన్స్... ఇతర జీవక్రియలకూ అంతరాయం కలిగిస్తుంటాయి. ఫలితంగా బాధితుల్లో నీరసం, నిస్సత్తువ ఏర్పడి వాళ్లు తీవ్రమైన అలసటతో ఉన్నట్లుగా కనిపిస్తుంటారు.చికిత్సల కారణంగా: చాలా సందర్భాల్లో బాధితులు తీసుకునే కీమో, రేడియోథెరపీ వంటి చికిత్సల వల్ల, అలాగే బోన్ మ్యారో క్యాన్సర్ బాధితులకు అందించే మందుల కారణంగా తీవ్రమైన నీరసం, నిస్సత్తువ కనిపిస్తాయి. ఈ మందులు నిజానికి క్యాన్సర్ కణాలను నశింపజేయల్సి ఉంటుంది. కానీ ఈ క్రమంలో అవి ఆరోగ్యవంతమైన కణాలనూ ఎంతోకొంత దెబ్బతీస్తుంటాయి. ఇలా ఆరోగ్యకరమైన కణాలూ దెబ్బతిని నశించిపోవడంతో కేన్సర్ బాధితుల్లో నీరసం, నిస్సత్తువ ఏర్పడతాయి. ఇక కీమో తీసుకుంటున్నవారిలో దేహం చాలా వేడిగా ఉన్నట్లు అనిపించడం, ఒంట్లోంచి వేడి బయటకు వస్తున్న ఫీలింగ్‌తో నిద్రాభంగం అవుతుండటం, నిద్రలో అంతరాయాలు, ఆకలి తగ్గినట్లుగా ఉండటంతో సరిగా భోజనం తీసుకోక΄ోవడం వంటి అంశాలు కూడా నీరసం, నిస్సత్తువ (ఫెటీగ్)కు కారణమవుతాయి.ఫెటీగ్‌ను అధిగమించడమిలా... తినాలని మనస్కరించక΄ోయినా వేళకు పుష్టికరమైన ఆహారం తీసుకోవడం, మెల్లమెల్లగా వ్యాయామాలకు ఉపక్రమించి, క్రమబద్ధంగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండటం... మనసు ఇచ్చగించకపోయినప్పటికీ ఇలాంటివి క్రమం తప్పకుండా చేస్తూ చురుగ్గా ఉండటానికి ప్రయత్నిస్తే ‘కేన్సర్ ఫెటీగ్’ సమస్యను సులువుగానే అధిగమించవచ్చు. ఇలాంటి వ్యాయామాలతో ఎండార్ఫిన్స్ అనే రసాయనాల స్రావాల వల్ల సంతోషం పెరగడం, దాంతో క్రమంగా చురుగ్గా ఉండటం సాధ్యమవుతాయి. న్యూట్రిషన్ కౌన్సెలింగ్: క్యాన్సర్ బాధితులు ఆహారం సరిగా తీసుకోక΄ోవడంతో బరువు కోల్పోయి... సన్నబడతారు. ఆకలి లేక΄ోవడం, కుంగుబాటు (డిప్రెషన్), మందుల వల్ల కలిగే వికారం వంటివి వారిని సరిగా తిననివ్వవు. దాంతో దేహానికి అవసరమైన పోషకాలు అందక΄ోవడంతో సన్నబడి నీరసించిపోతారు. బాధితుల నోటికి రుచిగా ఉండేలాంటి ఆహారాల తయారీ, అవసరమైన పోషకాలు అందడానికి తీసుకోవాల్సిన పదార్థాల వంటివి తెలుసుకోడానికి ‘న్యూట్రిషనిస్ట్ / డైటీషియన్’ను సంప్రదించాలి. విశ్రాంతి : రోజులో తగినంత చురుగ్గా ఉండటంతోపాటు తగినంత విశ్రాంతి తీసుకోవడమూ అవసరమే. ఈ విశ్రాంతి తమ శక్తిసామర్థ్యాలను మరింత శక్తి పుంజుకుని మళ్లీ క్రీయాశీలం కావడానికి ఉపయోగపడుతుందని బాధితులు గ్రహించాలి. ఇతర విషయాలపైకి దృష్టి మళ్లించడం (డిస్ట్రాక్షన్): ఎప్పుడూ వ్యాధి గురించే ఆలోచించకుండా... తమ దృష్టిని ఇతర అంశాలపైకి మళ్లించాలి. మంచి పుస్తకాలు చదవడం, హాస్యభరితమైన, వినోదాత్మకమైన సినిమాలు చూడటం, ఫ్రెండ్స్‌తో మాట్లాడుతుండటం, సమయాన్ని సరదాగా గడపడం వంటి వాటితో జబ్బునుంచి దృష్టిమళ్లించగలిగితే ఇది కూడా ఫెటీగ్‌ను అధిగమించడానికి తోడ్పడుతుంది. కంటి నిండా నిద్ర : క్యాన్సర్ బాధితుల్లో చాలామందికి నిద్రపట్టడం కష్టమై తరచూ నిద్రాభంగమవుతుంటుంది. దాంతో మరింత నిస్సత్తువగా అనిపిస్తుంటుంది. రిలాక్సేషన్ టెక్నిక్స్ వంటి ప్రక్రియల ద్వారా బాధితులు ఈ సమస్యను అధిగ మించవచ్చు. అలాగే కాఫీ లేదా కెఫిన్ ఉండే ద్రవాహారాలను తగ్గించడం కూడా మంచిదే. చిన్నపాటి కునుకు తీయడం, మధ్యాహ్నం కాసేపు ఓ పవర్‌న్యాప్ వంటి వాటితోపాటు వేళకు పెందలాడే నిద్రించి పెందలాడే లేవడం లాంటి మంచి నిద్ర అలవాట్లతో నిద్ర సమస్యను తేలిగ్గానే అధిగమించవచ్చు. అలాగే మంచి నిద్ర కోసం చీకటిగా ఉండే గది (డార్క్ రూమ్) లో నిద్ర΄ోవడంతో గాఢంగా నిద్రపట్టి నిద్ర సమస్యలు దూరమయ్యే అవకాశముంది. అప్పటికీ నిద్రపట్టనివాళ్లలో డాక్టర్లు ‘మెలటోనిన్’ సప్లిమెంట్లు ఇవ్వడం వంటి (ముఖ్యంగా కీమోధెరపీ తీసుకునే బాధితులకు) జాగ్రత్తలు తీసుకుంటారు. అవసరాన్ని బట్టి మందులు: బాధితుల్లో నీరసం, నిస్సత్తువ ఎక్కువగా ఉన్నప్పుడు కారణాలను బట్టి డాక్టర్లు వారికి కొన్ని మందుల్ని సూచిస్తారు. ఉదాహరణకు రక్తహీనత ఉన్నవారికి ఐరన్ సప్లిమెంట్లూ, పోషకాహార లోపాలను బట్టి ఇతర సప్లిమెంట్లు, మానసిక సమస్యలను బట్టి యాంటీ డిప్రెసెంట్లు, సైకో స్టిమ్యులెంట్ల వంటి మందులు ఇస్తారు. కేన్సర్ ఫెటీగ్‌తో బాధపడుతున్నవారు పై సూచనలు పాటిస్తే తమంతట తామే సమస్యలను అధిగమించవచ్చు. కుదరకపోతే వైద్యనిపుణుల సహాయం తీసుకోవచ్చు. కేన్సర్ ఫెటీగ్ అధిమించలేని సమస్యేమీ కాదని గ్రహించడం అన్నిటికంటే ముఖ్యం.డాక్టర్ శ్రీనివాస్ జూలూరి, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ -
ఎర్ర రక్త కణాలకు సూపర్ శక్తులు...
మనిషి శరీరంలో అపారంగా ఉండే ఎర్ర రక్త కణాలను వ్యాధులపై దాడుల చేసే సరికొత్త వ్యవస్థగా మార్చేందుకు మెక్‌మాస్టర్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఓ కొత్త పద్ధతిని అభివృద్ధి చేశారు. సమస్య ఉన్న అవయవాలకు నేరుగా మందులు అందించేలా ఎర్ర రక్త కణాలకు సూపర్ శక్తులు జోడించారు. మందులు మోసుకెళ్లేందుకు ఎర్ర రక్తకణాలు చాలా అనువైనవని ఇప్పటికే పలు పరిశోధనలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో మందులతో కూడిన ఎర్ర రక్త కణాలను సిద్ధం చేసేందుకు మెక్‌మాస్టర్ యూనివర్శిటీ శాస్త్రవేత్త మైకెల్ రీన్స్టడర్ పరిశోధనలు చేశారు. ఈ హైబ్రిడ్ కణాలను సిద్ధం చేసేందుకు ముందుగా ఎర్ర రక్త కణాల్లోపలి భాగాలను ఖాళీ చేస్తారు. ఆ తరువాత దీన్ని కృత్రిమ లైపోసోమ్ పదార్థంతో నింపుతారు. ఇది కాస్తా ఓ తిత్తిలా పనిచేస్తుంది. అవసరమైన మందులను ఇక్కడ నిల్వ చేయవచ్చు. ఈ హైబ్రిడ్ కణాలు కొన్ని వారాలపాటు శరీరంలో తిరుగుతూ ఉండగలవని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త సెబాస్టియన్ హింబర్ట్ తెలిపారు. ఎర్ర రక్త కణాలను హైబ్రిడ్ కణాలుగా మార్చడం ఒక్కరోజులోనే పూర్తి చేయవచ్చునని చెప్పారు. ఈ హైబ్రిడ్ కణాలను జంతువుల్లో ప్రయోగించేందుకు ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
త్వరలో ఎలక్ట్రానిక్ ద్రావణాలు
లండన్: వ్యాధి నిర్ధారణకు త్వరలోనే ఓ వినూత్నమైన విధానం అందుబాటులోకి రానుంది. బ్యాక్టీరియా రూపంలో ఉండే చిన్న చిన్న ఎలక్ట్రానిక్ సెన్సర్లు కలిగిన ద్రావణాన్ని తాగడం ద్వారా అనారోగ్యానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఎలక్ట్రానిక్ సెన్సర్లు పరిమాణంలో ఎర్ర రక్త కణాల కంటే తక్కువగా ఉండటం గమనార్హం. బ్రిటన్‌లోని ఇంపీరియల్ కాలేజ్ లండన్, ఫ్రాన్స్‌లోని ఈపీఎఫ్‌ఎల్‌కు చెందిన పరిశోధకులు దీన్ని తయారు చేశారు ఇది అందుబాటులోకి వస్తే కేన్సర్‌తోపాటు ఇతర ప్రాణాంతక వ్యాధుల నిర్ధారణా పద్ధతులు సులువవుతాయని పేర్కొన్నారు. -
అమ్మకు ఆహారం!
గర్భధారణ ఒక అద్భుతమైన అనుభవం. పండంటి బిడ్డ కావాలనుకోవడం కాబోయే తల్లిదండ్రులు కోరుకునే వరం. అందుకోసం చేయాల్సిందల్లా సమతులమైన పౌష్టికాహారాన్ని తీసుకోవడం. ఏయే రకాల ఆహారాలు, ఎంతెంత తీసుకోవాలి, ఏయే వేళల్లో తినాలన్న విషయంపై అవగాహన కోసం ఈ వివరాలు... ఎప్పుడూ తీసుకునే దానికంటే గర్భవతిగా ఉన్నప్పుడు పుష్టికరమైన ఆహారాన్ని తీసుకోవడం మరింత ఎక్కువ అవసరం. ఆ సమయంలో ఆహారంలో ప్రోటీన్లు, ఐరన్, క్యాల్షియమ్... అన్ని పోషకాలు ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ తీసుకోవడానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలి. గర్భవతులు ఏయే సమయాల్లో ఏయే ఆహారం తీసుకోవాలో తెలుసుకోండి. 1 గర్భధారణ సమయంలోని మొదటి మూడు నెలల కాలంలో ఫస్ట్ ట్రైమిస్టర్ ఫోలిక్ యాసిడ్: ఈ పోషకాన్ని గర్భధారణ జరగకమునుపు ఒక నెల ముందునుంచే తీసుకోవడం పుట్టబోయే బిడ్డకు చాలా మేలు చేస్తుంది. ఆకుపచ్చని రంగులో ఉండే పాలకూర వంటి ఆకుకూరల్లో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. ఈ పోషకం బిడ్డలో ఆరోగ్యకరమైన వెన్ను అభివృద్ధికి దోహదం చేస్తుంది. కణవిభజన బాగా జరిగేందుకు దోహదం చేస్తుంది. ఆకుపచ్చని కూరల్లో ఉండే హైమెగ్నీషియమ్ పాళ్ల వల్ల దాదాపు 90 శాతం కేసుల్లో వేవిళ్లు తగ్గుతాయని ఒక అధ్యయనంలో తేలింది. ఐరన్: కడుపులోని బిడ్డ త్వరత్వరగా ఎదుగుతుంది. ఆరో వారంలో గుండె స్పందనలు, ఎర్ర రక్తకణాలు మొదలవుతాయి. అందుకే ఈ సమయంలో ఐరన్ ఎక్కువగా అవసరం. ముదురాకుపచ్చరంగులో ఉండే ఆకుకూరల్లో ఐరన్ ఉంటుంది. మనం తీసుకునే ఆహారంలో ఐరన్ రెండు రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి హీమ్ ఐరన్ కాగా, మరొకటి నాన్ హీమ్ ఐరన్. ఈ రెండూ కడుపులోని బిడ్డకు మేలు చేసేవే. హీమ్ ఐరన్ చాలావరకు మాంసం, చేపలు... లాంటి మాంసాహారం నుంచి లభిస్తుంది. నాన్–హీమ్ (ఇనార్గానిక్ ఐరన్) ఆకుపచ్చని ఆకుకూరల్లో (గ్రీన్ లీఫీ వెజిటబుల్స్), డ్రైఫ్రూట్స్‌లో ఉంటుంది. నాన్ హీమ్ ఐరన్‌తో పోలిస్తే హీమ్ ఐరన్ మన శరీరంలోకి నేరుగా వేగంగా అబ్సార్బ్ అవుతుంది. అదే నాన్‌హీమ్ ఐరన్ అబ్సార్బ్ అయ్యేందుకు విటమిన్ ’సి’ సహాయం అవసరం. అందుకే ఆరంజ్ జ్యూస్ వంటివి తాగితే అందులోని విటమిన్ ’సి’ సహాయంతో నాన్‌హీమ్ ఒంటిలోకి ఇంకిపోతుంది. డీహెచ్ఏ: గర్భధారణ జరిగిన పన్నెండో వారంలో చిన్నారి శరీరంలోని మిగతా అవయవాలతో పోలిస్తే మెదడు ఎదుగుదల చాలా వేగంగా జరుగుతుంది. ఒమెగా ఫ్యాటీ 3 యాసిడ్స్‌లో ఒక రకమైన... డొకోజా హెగ్సీనిక్ యాసిడ్ (డీహెచ్ఏ) అనే పోషకం పుష్కలంగా ఉండే చేపలు ఎక్కువగా తినడం వల్ల బిడ్డ మెదడు ఎదుగుదల మరింత ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే డీహెచ్ఏ, ఒమెగా 3–ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా దొరికే చేపల వంటి ఆహారాన్ని తీసుకోవాలి. డీహెచ్ఏ ఎక్కువగా తీసుకునేవారి పిల్లల్లో జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంటుందని ఒక అధ్యయనంలో తెలిసింది. 2 నాలుగో నెల నుంచి ఆరో నెల వరకు రెండో ట్రైమిస్టర్ విటమిన్ ఏ: ఈ సమయంలో ‘విటమిన్ ఏ’ పాళ్లు ఎక్కువగా ఉన్న పోషకాహారాన్ని తీసుకోవాలి. క్యారట్, చిలగడదుంప వంటి ఆహారపదార్థాల్లో బీటాకెరోటిన్ ఎక్కువ. ఇది విటమిన్ ఏ ను సమకూరుస్తుంది. ఈ సమయంలో బిడ్డ కళ్లు క్రియాశీలమవుతాయి కాబట్టి విటమిన్ ఏ ను సమకూర్చే బీటాకెరొటిన్ లభ్యమయ్యే ఆహారాలు బిడ్డకు మేలు చేస్తాయి. క్యాల్షియమ్: రెండో ట్రైమిస్టర్లో బిడ్డ ఎముకల ఎదుగుదల, అవి బలంగా రూపొందడం జరుగుతుంది. అందుకే తల్లి ఆ సమయంలో క్యాల్షియమ్ పుష్కలంగా ఉండే ఆహారాలైన పాలు, పెరుగు, చీజ్, టోఫూ, సార్డిన్ చేపల వంటివి తీసుకోవాలి. విటమిన్ డి: ఈ విటమిన్ ఎముకల్లోకి క్యాల్షియమ్‌ను ఇంకేలా చేసి, ఎముకలకు బలాన్ని సమకూరుస్తుంది. లేత ఎండలో నిలబడటం లేదా తేలికపాటి వ్యాయామాలు చేయడం, పాలు, కొన్ని రకాల పుట్టగొడుగులలో విటమిన్–డి పుష్కలంగా లభిస్తుంది. జింక్: ఈ సమయంలో తీసుకోవాల్సిన మరో ముఖ్యమైన పోషకం జింక్. ఇది డీఎన్ఏలు రూపొందడం, వాటి రిపేర్లు, అవి క్రీయాశీలంగా మారడానికి దోహదం చేస్తుంది. కణవిభజన వేగంగా జరగడానికి తోడ్పడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపకరిస్తుంది. 3 7వ నెల నుంచి తొమ్మిదో నెల నిండాక ప్రసవం వరకు మూడో ట్రైమిస్టర్ గర్భధారణ సమయంలో 30 వారాలు నిండాక విటమిన్ కె పుష్కలంగా అందేలా పాల కూర వంటి ఆకుకూరలు తీసుకోవాలి. ఈ విటమిన్ రక్తం గడ్డకట్టడానికి ఉపకరిస్తుంది. మెగ్నీషియమ్: బిడ్డకు తగినంత మెగ్నీషియమ్ సమకూరేందుకు తల్లి పుష్కలంగా పాలు తాగాలి. ఇక 38వ వారానికి బిడ్డలో ఊపిరితిత్తులు మినహా మిగతా అవయవాలన్నీ పూర్తిగా రూపొందుతాయి. సెలీనియమ్: ఈ పోషకాన్ని పొందడానికి బ్రెజిల్ నట్స్ తీసుకోవడం మేలు చేస్తుంది. ఇది ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల రూపకల్పనకు దోహదపడుతుంది. యాంటీఆక్సిడెంట్స్, ఇంకా విటమిన్ సి, విటమిన్ ఇ.. ఇవి బిడ్డ వ్యాధి నిరోధకశక్తిని మరింత పెంచుతాయి. అందుకే అవి సమకూరడానికి పొట్టుతో ఉన్న ధాన్యాలు, చేపలు, టొమాటోలతో పాటు నారింజ, జామ వంటి పండ్లుతో పాటు ఉసిరిని ఏ రూపంలోనైనా తీసుకోవాలి. సుజాతా స్టీఫెన్ చీఫ్ న్యూట్రిషనిస్ట్ యశోదా హాస్పిటల్స్ మలక్‌పేట, హైదరాబాద్ -
కామెర్లకు, ఎర్ర రక్తకణాలకు గల సంబంధం ఏమిటి?
హెమటాలజీ కౌన్సెలింగ్ మా బాబుకు పన్నెండేళ్లు. అతడికి ఈ మధ్య పచ్చకామెర్లు వచ్చాయి. అంటే ఏమిటి? దానికి కారణాలు, జాగ్రత్తలు చెప్పండి. కామెర్లకు, ఎర్ర రక్తకణాలకు మధ్య సంబంధం ఏమిటి? - సురేశ్, వరంగల్ రక్తంలోని ఎర్రరక్తకణాల విచ్ఛిత్తి జరుగుతూ బిలురుబిన్ అనే రంగు పదార్థం తయారవుతుంటుంది. రక్తంలో ఈ బిలురుబిన్ పరిమాణం రెట్టింపు అవ్వడం వల్ల వచ్చేవే పచ్చకామెర్లు. వీటినే జాండిస్ అని కూడా అంటారు. కామెర్లు వచ్చిన వారి చర్మం, కళ్లు పసుపుపచ్చ రంగులో కనిపిస్తాయి. పచ్చకామెర్లు వ్యాధి కాదు. ఇది వ్యాధి తాలూకు ఒక లక్షణం. ఇది రావడానికి మూడు ముఖ్య కారణాలు. అవి... 1) రక్తంలో ఎర్రరక్తకణాలు అత్యధికంగా విచ్ఛిత్తికావడం. దీన్ని హీమోలిటిక్ జాండీస్ అంటారు. 2) ఎర్రరక్తకణాల విచ్ఛిత్తి వల్ల చోటుచేసుకున్న బిలురుబిన్ లివర్ కణాలలోకి చేరలేకపోవడం. దీన్ని ‘హెపాటిక్ జాండీస్’ అంటారు. 3) లివర్‌లో ఉత్పత్తి అయిన పైత్యరసం (బైల్) ప్రవాహమార్గంలో అవరోధం ఏర్పడి, అది పేగులలోకి చేరలేకపోవడం. దీన్ని ‘అబ్స్ట్రక్టివ్ జాండిస్’ అంటారు. లివర్ ఇన్ఫెక్షన్కు గురైనట్లయితే ‘హెపటైటిస్’ అని వ్యవహరిస్తారు. హెపటైటిస్ కేసుల్లో హెపాటిక్ జాండిస్ చోటుచేసుకుంటుంది. హెపటైటిస్‌కు ప్రధాన కారణాలు: ఇన్ఫెక్షన్ ఆల్కహాల్ పౌష్టికాహార లోపం. ఇన్ఫెక్షన్ పరంగా ఐదు రకాల వైరస్‌లను గుర్తించారు. ఇవి.. హెపటైటిస్ ఎ, బి, సి, డి, ఈ. నివారణ : కామెర్ల నివారణకు ఆహారంలో కొన్ని నియమాలు పాటించాలి ఏ ప్రాంతంలో ఉన్నా, తాగే నీటిని కాచి, వడబోసి, చల్లార్చి వాడటం మంచిది. లేదా ఫిల్టర్ చేసిన నీటిని మరగబెట్టయినా వాడవచ్చు పచ్చకామెర్లు సోకితే దుంపలు వాడకూడదు. అలాగే సరిగా జీర్ణం కానివి ఏవీ వాడకూడదు మజ్జిగ బాగా వాడాలి. కొబ్బరినీళ్లు తాగాలి. అరటిపండ్లు బాగా తినాలి మాంసాహారులు మాంసానికీ, చేపలకు దూరంగా ఉండాలి గోంగూర ప్రియులు విధిగా దానికి దూరంగా ఉండాలి ఆవకాయ, మాగాయ వాడకపోతే భోజనం పూర్తయినట్లు కాదని భావించేవాళ్లు కొన్నాళ్లు వాటికి గుడ్‌బై చెప్పాలి కారం, పులుపు, ఉప్పు తగ్గించక తప్పదు. - డా॥శైలేశ్ ఆర్ సింగీ సీనియర్ హిమటో ఆంకాలజిస్ట్, బీఎమ్‌టీ స్పెషలిస్ట్, సెంచరీ హాస్సిటల్స్, హైదరాబాద్ పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా బాబుకు రెండున్నర నెలల వయసు. అదేపనిగా ఏడుస్తున్నాడు. మా బాబు సమస్య ఏమిటి? తగిన సలహా చెప్పండి. - నాగరాజు, ఆదిలాబాద్ పిల్లలు తమ బాధలను ఏడుపు ద్వారానే వ్యక్తపరుస్తుంటారు. వాళ్లు కమ్యూనికేట్ చేసే ఒక విధానం ఏడుపు. అందుకే పిల్లలు ఏడుస్తున్నప్పుడు వాళ్లకు ఏదైనా సమస్య ఉందేమోనని తల్లిదండ్రులు అనుమానించాలి. పిల్లల్లో ఏడుపుకు కొన్ని ముఖ్య కారణాలు: ఒ ఆకలి వేసినప్పుడు ఒ భయపడినప్పుడు ఒ దాహం వేసినప్పుడు ఒ పక్క తడిగా అయినప్పుడు ఒ పళ్ళు వస్తున్నప్పుడు ఒ ఇన్ఫెక్షన్లు ముఖ్యంగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఒ కడుపు నొప్పి (ఇన్‌ఫ్యాంటైల్ కోలిక్) ఒ జ్వరం ఒ జలుబు ఒ చెవినొప్పి ఒ మెదడువాపు జ్వరం ఒ గుండె సమస్యలు ఒ కొన్ని జన్యుపరమైన సమస్యలు వంటి తీవ్రమైన వాటిని కూడా పిల్లలు ఏడుపు ద్వారానే తెలియపరుస్తారు. కొన్ని సందర్భాల్లో ఫిట్స్ సమస్యను కూడా ఏడుపు రూపంలోనే వ్యక్తపరుస్తుండవచ్చు. ఇన్‌ఫ్యాంటైల్ కోలిక్: చిన్న పిల్లల్లో ఏడుపుకు సాధారణ కారణం కడుపునొప్పి. దీన్నే ఇన్‌ఫ్యాంటైల్ కోలిక్ అంటారు. సాధారణంగా మూడు నెలలలోపు పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఒ ఆకలి, గాలి ఎక్కువగా మింగడం వల్ల, ఓవర్ ఫీడింగ్, పాలలో చక్కెరపాళ్లు ఎక్కువగా ఉండటం ఇన్‌ఫ్యాన్‌టైల్ కోలిక్‌కు కొన్ని కారణాలని చెప్పుకోవచ్చు. ఇటువంటి పిల్లలను ఎత్తుకోవడం (అప్ రైట్ పొజీషన్), ప్రాపర్ ఫీడింగ్ టెక్నిక్ (ఎఫెక్టివ్ బర్పింగ్ - తేన్పు వచ్చేలా చేయడం)తో ఏడుపు మాన్పవచ్చు. కొందరికి యాంటీస్పాస్మోడిక్స్తో పాటు మైల్డ్ సెడేషన్ ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అయితే యాంటీస్పాస్మోడిక్, మైల్డ్ సెడేషన్ అనే ఈ రెండు మందులు ఏడుపు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి. చిన్న పిల్లలు మరీ ఎక్కువగా ఏడుస్తుంటే అంటే పదే పదే ఏడవటం, ఆపకుండా ఏడవటం చేస్తుంటే తక్షణం పిల్లల డాక్టర్‌కు చూపించాలి. మీరు కూడా ఒకసారి మీ బాబును పీడియాట్రీషియన్‌కు చూపించండి. వారు తగిన కారణాన్ని కనుగొని, దానికి తగినట్లుగా చికిత్స అందిస్తారు. - డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్,రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ,హైదరాబాద్ హోమియో కౌన్సెలింగ్ నా వయసు 42 ఏళ్లు. నేను మార్కెటింగ్ వృత్తిలో కొనసాగుతున్నాను. నాకు కొంతకాలంగా కడుపులో విపరీతమైన మంటతోనూ, నొప్పి, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే గ్యాస్ట్రైటిస్ అన్నారు. మందులు వాడుతున్నంత సేపు బాగానే ఉన్నా, అవి మానేస్తే మళ్లీ మామూలే. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది. హోమియో చికిత్స ద్వారా నయమవుతుందా? - నాగేశ్వరరావు, హైదరాబాద్ ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో అధిక పని ఒత్తిడి వల్ల ఉరుకులు పరుగుల జీవితం గడుపుతున్న నేపథ్యంలో చాలామంది సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురికావడం, శారీరక శ్రమ పెద్దగా లేకపోవడం వంటి కారణాలతో చాలామంది గ్యాస్ట్రైటిస్ సమస్యతో బాధపడుతున్నారు. జీర్ణకోశం లోపల ఉండే మ్యూకస్ పొర ఇన్ఫ్లమేషన్ లేదా వాపునకు గురికావడాన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు. మనం తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మన మెదడు లాగే జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఆకస్మికంగా మొదలై కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటారు. దీర్ఘకాలికంగా ఇదే సమస్య ఉంటే దాన్ని క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అంటారు. కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య ముదిరితే అవి కడుపులో అల్సర్స్ లేదా పుండ్లుగా ఏర్పడతాయి. కారణాలు: 20 నుంచి 50 శాతం అక్యూట్ గ్యాస్ట్రైటిస్‌లకు వైరస్, బ్యాక్టీరియా (ముఖ్యంగా హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా) కారణమవుతుంది తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం కొన్ని రకాల మందులు... ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ వాడటం పైత్య రసం వెనక్కి ప్రవహించడం కొన్ని జీర్ణకోశ వ్యాధులు, కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు శస్త్రచికిత్స లేదా వంశపారంపర్య చరిత్ర ఉన్నవారిలో ఆహారంలో వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు వంటివి ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్ట్రైటిస్ సమస్య కనిపిస్తుంది. లక్షణాలు: కడుపు నొప్పి, మంట కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం అజీర్ణం, వికారం, రక్తంతో కూడిన వాంతులు ఆకలి తగ్గిపోవడం కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య వల్ల మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నివారణ కోసం పాటించాల్సిన జాగ్రత్తలు: సమయానికి ఆహారం తీసుకోవాలి కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లు పూర్తిగా మానేయాలి ఆహారంలో మసాలాలు, కారం, వేపుళ్లు తగ్గించాలి తిన్న వెంటనే పడుకోకూడదు. కనీసం రెండు గంటల తర్వాత నిద్రించాలి. చికిత్స: హోమియో వైద్య విధానం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఈ సమస్యలకు మూలకారణమైన ఆమ్లాలు, తీవ్ర రసాయనాల సమతౌల్యతను చక్కదిద్దడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు. - డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ ఫౌండర్ చైర్మన్ హోమియోకేర్ ఇంటర్నేషనల్,హైదరాబాద్ -
నేను మీ కిడ్నీని
నేను ఆనంద్ కవల కిడ్నీని. నడుములోని వెన్నుపూసకు ఇరుపక్కలా ఇద్దరం ఉంటాం. నేను మూత్రం తయారీకి మాత్రమేనని ఆనంద్ అనుకుంటూ ఉంటాడు. నిజానికి ఆనంద్ శరీరమంతటికీ నేనే మాస్టర్ కెమిస్ట్‌ను. అంతేకాదు... శరీరంలోని ఎర్ర రక్తకణాల ఉత్పాదనలో నాకూ వాటా ఉంది. శరీర భాగాలన్నింటిలోనూ ఎక్కువ రక్తం అందేది మెదడుకు అని అందరూ అనుకుంటుంటారు. ఇది కొద్దిమేరకు మాత్రమే వాస్తవం. నిజానికి ఎక్కువ రక్తం నాలోంచే ప్రవహిస్తుంటుంది. శరీరంలోని నీటి సరఫరాను నేనే నియంత్రిస్తుంటాను. రక్తంలోని పొటాషియమ్, సోడియమ్ క్లోరైడ్ మోతాదులను సరిచూసేదీ నేనే. ఆకారం చిన్నది... పని పెద్దది నా బరువు కేవలం 140 గ్రాములే కానీ... నేను చేసే పనులను ఒక పట్టికలా రాసినా... ఒక పట్టాన అది పూర్తి కాదు. ఒకవైపు నేనూ, మరోవైపు నా హలోబ్రదర్... ఇద్దరం కలిసి వడపోత పనిని చేస్తుంటాం. నాలో కనీసం పది లక్షల వడపోత యూనిట్లు పనిచేస్తుంటాయి. ఒక్కో యూనిట్‌ను నెఫ్రాన్ అంటారు. ఇది సన్నటి తీగలుగా, చుట్టలు చుట్టినట్లుగా ఉంటుంది. తోకలాంటి ఈ సన్నటి పైపునకు ఒక తల కూడా ఉంటుంది. తీగలుగా చుట్టున ఒక పైపును సాగదీస్తే అది కనీసం 105 కిలోమీటర్ల పొడవుంటుంది. ఇంత పొడవుండే సన్నటి తీగల ద్వారా కొనసాగే ఈ వడపోత ఎంత నిరంతరాయం సాగుతుందో వివరించాలంటే తనకు తెలికుండా నేను ఆనంద్ ఒంట్లో చేసే ఒక అద్భుతం గురించి చెప్పాలి. అదేమిటంటే... ఆనంద్ ఒంట్లో ఆరు లీటర్ల రక్తం ఉందనుకుందాం. మేమిద్దరమూ కలిసి గంటకు 12 లీటర్ల రక్తాన్ని వడపోస్తాం. అంటే ఆనంద్ శరీరంలో ఉన్న మొత్తం రక్తానికి రెట్టింపు ఫిల్టర్ చేస్తాం. చక్కెర బయటకు పోదు... పొటాషియమ్ తగ్గద ఇంత జరుగుతున్నా శరీరంలోని అమైనో యాసిడ్స్, విటమిన్లు, చక్కెర లాంటి వాటిని బయటకు వెళ్లనివ్వం. ఇలా దేహంలో ఎన్నో వైపరిత్యాలు, అనర్థాలూ జరగకుండా మేం నిత్యం ఆపుతుంటాం. వడపోసిన పదార్థాల్లో మళ్లీ అవసరమైన వాటిని 99 శాతాన్ని తిరగి శరీరానికి అందిస్తుంటాం. కేవలం వ్యర్థాలను మాత్రమే మూత్రం రూపంలో బయటకు పోనిస్తాం. ఒకవేళ ఆనంద్ రెండు పెద్ద పెద్ద పేస్ట్రీలు తిని... తాను డయాబెటిస్ పేషెంట్ అని తన డాక్టర్‌ను నమ్మించడానికి ప్రయత్నిస్తే ఆనందే ఫూల్ అవుతాడు. ఎందుకంటే చక్కెరలను నేను అంత తేలిగ్గా బయటకు పోనివ్వను. కానీ తాను రుచి కోసం అధిక మోతాదులో తీసుకున్న ఉప్పు అంతా రక్తంలోనే ఉండిపోతుందని ఆనంద్ నమ్మితే... అతడు ఉప్పులో కాలేసినట్టే! చక్కెరలనంటే బయటకు పోనివ్వలేదుగానీ పిడుక్కీ, బియ్యానికీ లాగా... ఉప్పులకూ, చక్కెరకూ నేను ఒక్కటే మంత్రం పఠిస్తే ఆనంద్ చచ్చూరుకుంటాడు. ఆ ఉప్పు శరీరంలో ఉన్న నీటిని లాగేస్తుంది. ఫలితంగా రక్తం చిక్కబడుతుంది. ఆనంద్ రక్తాన్ని పంప్ చేయడానికి అతడి గుండె ఎంతో కష్టపడుతుంది. ఆనంద్ కడుపు నిండా తింటూ, పళ్లరసాలూ అవీ తాగుతూ తగినంత పొటాషియమ్ తీసుకుంటూ ఉంటే పర్లేదు. అతడి కండరాలు సక్రమంగా పనిచేయడానికి అది కావాలి. అతడు తన ఆహారం ద్వారా తగినంత పొటాషియమ్ తీసుకోవడం లేదనుకోండి. నేనో పిసినారిలా దాన్ని వాడుతుంటా. విపరీతమైన శ్రమ... నిరంతరమైన పని ఆనంద్ శరీరంలోంచి నేను బయటకు తోడివేసే ప్రధానమైన వ్యర్థం ‘యూరియా’. మనం తీసుకునే ప్రోటీన్లు జీర్ణమయ్యే ప్రక్రియలో మిగిలిపోయే పదార్థమిది. ఇది శరీరంలో ఉండిపోవడం అత్యంత ప్రమాదకరం. ఒకవేళ మిగిలిపోయిందా... ఇక అంతే సంగతులు. మొదట నీరసం. తర్వాత నిదానంగా కోమా. చివరికి మరణం. అందుకే యూరియా పేరుకోకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తపడతాను. కిడ్నీలో రిజర్వాయర్ కనీసం రోజుకు ఒక లీటర్‌కు తగ్గకుండా మూత్రాన్ని తయారు చేస్తాం. నెఫ్రాన్ల నుంచి నిరంతర రక్తప్రవాహం కొనసాగి... అది చివర్లో ఒక అద్భుతమైన అత్యంత సూక్ష్మమైన రిజర్వాయన్లోకి తెరచుకుంటుంది. అది సరిగ్గా నా మధ్యలో (కిడ్నీ సెంటర్లో) ఉంటుంది. ఈ రిజర్వాయర్ నుంచి మూత్రసంచి (బ్లాడర్) కి మళ్లీ నీటి పారుదల దారులుంటాయి. వీటి ద్వారా ప్రతి 10-30 సెంకడ్లకు ఒకసారి వ్యర్థాలను బయటకు నెడుతుంటాను. పగటితో పోలిస్తే... రాత్రి కాస్త మందకొడిగా పనిచేస్తుంటా. లేకపోతే మూత్రశాలకు వెళ్లడానికంటూ ఆనంద్ ప్రతి గంటకూ ఒకసారి లేవాల్సి ఉంటుంది. పెరిగే వయసు... తగ్గే పనితీరు ఆనంద్‌కు 47 ఏళ్లు నిండాక... మెల్లగా నాలోనూ వయసు పెరగడం మొదలవుతుంది. నా చుట్టూ ఉండే కొవ్వు పడక మీద నేను శయనించి ఉంటాను. ఒకవేళ ఏదైనా సమస్యతో ఈ కొవ్వు పడక కరిగితే... అప్పుడు నేను పక్కకు జరుగుతాను. ఒక్కోసారి నాలో రాళ్లు కూడా పేరుకుపోతాయి. ఈ రాళ్లు క్యాల్షియమ్, యూరిక్ యాసిడ్‌తో తయారవుతాయి. రోడ్డు మీద కంకర ఉంటే ట్రాఫిక్‌కు అంతరాయం కలిగినట్లుగా ఈ రాళ్ల వల్ల మూత్రప్రవాహానికి అడ్డుకలుగుతుంది. అది చిన్న రాయి అయితే చిదిమినట్లుగా అయిపోవడం, లేదా కిందికి జారిపోవడం జరుగుతుంది. కానీ కంకరరాయి ఎంత పెద్దదయితే అడ్డంకి అంతగా పెరుగుతున్నట్లుగానే... నాలోని రాయితోనూ అలాంటి ప్రమాదమే ఉంటుంది. అది బఠాణీ గింజ అంత కావచ్చు. లేదా ఒక్కోసారి ద్రాక్షపండు అంత పెరగవచ్చు. రోడ్డు మీద పెద్ద పెద్ద రాళ్లను పారతో పక్కకు తీసేసినట్టే, నాలో అంతగా పెరిగిన రాళ్లనూ సర్జరీతో తొలగించాలి. లేదంటే రాయి సైజు మరీ పెద్దదయితే రిజర్వాయర్‌లో ఇరుక్కుపోతుంది. రాయి నాలోని రిజర్వాయర్ లోంచి బ్లాడర్‌లోకి జారి మూత్రప్రవాహాన్ని అడ్డుకోవచ్చు. రిజర్వాయర్‌కు లేదా బ్లాడర్ గోడలకు గానీ గాయం కావచ్చు. అదే జరిగితే ఇన్ఫెక్షన్ విలన్లా పొంచి ఉంటుంది. ఒకసారి ఇన్ఫెక్షన్ ఏర్పడితే అది తన సామ్రాజ్యాన్ని రిజర్వాయర్ నుంచి కిందకు విస్తరించవచ్చు. అందుకే రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే... ఆనంద్ ద్రవాహారం ఎక్కువగా కావాలి. నేను సరిగా పనిచేయడం లేదని ఎలా తెలియాలి ఒక్కోసారి రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే యాక్సిడెంట్లలోనూ నేను గాయపడవచ్చు. లేదా ఒక్కోసారి నాలోని రక్తనాళాలూ తెగవచ్చు. ఇవేమి జరిగినా నాకు కలిగే ప్రమాదం తాత్కాలికమే. ఎందుకంటే కోలుకునే శక్తి నాలో అపారం. అయితే ఒక్కటి... వయసు పెరుగుతున్న కొద్దీ నాలోకి ప్రవహించే రక్తనాళాలు గట్టిపడవచ్చు, సన్నబడవచ్చు. వాటి మృదుత్వం తగ్గవచ్చు. ఆనంద్ గుండె పంపింగ్ సామర్థ్యమూ తగ్గవచ్చు. అప్పుడు నాలోకి వచ్చే రక్తప్రవాహ వేగం తగ్గవచ్చు. నాలో వ్యర్థాలూ పోగుపడవచ్చు. అప్పుడు నేను రక్తంలోని లవణాల పాళ్లను సక్రమంగా నియంత్రించలేకపోవచ్చు. ఇది ఆనంద్‌లోని మొదలైంది. అదృష్టవశాత్తూ నాకు ఒక అన్నదమ్ముడున్నాడు. వాడు నాకు తోడు వస్తాడు. మేమిద్దరమూ కలిసి, ఆనంద్ శరీరానికి అవసరమైన పనిని చేయగలుగుతాం. ఇంతకు ముందు తగినన్ని మందులు లేవుగానీ... ఇప్పుడు మమ్మల్ని బాగు చేయగల మందులూ ఉన్నాయి. మాకు రాబోయే సమస్యను ముందే తెలుసుకోగల పరీక్షలూ ఉన్నాయి. మాకు చెరుపు చేసే ఎన్నో సమస్యల్ని నివారించే జాగ్రత్తలూ ఉన్నాయి. ఇంతెందుకు ఆనంద్ తన బరువును నియంత్రించుకుంటూ, మంచి ఆహారం తీసుకుంటూ ఉండే చాలు. బాగా వ్యాయామం చేస్తే చాలు. నాకు రాబోయే ఎన్నో అనర్థాలు నివారితమవుతాయి. నేను ఉత్పత్తి చేసే మూత్రం రంగును గుర్తించినా, అతడి ముఖం ఉబ్బుగా ఉన్నా, కళ్లు మసకబారుతున్నా, ఒళ్లు బలహీనంగా అనిపించినా గమనిస్తే... నేను అరుస్తున్న అరుపు అతడికి వినిపించినట్టే. జరగబోయే చెరుపు దూరమైనట్టే. - ఇన్పుట్స్: డాక్టర్ పి. నాగేశ్వర రెడ్డి, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్ మూత్రపిండం మరికొన్ని వాస్తవాలు... కొన్ని సందర్భాల్లో కొందరు రోగుల్లో పాలకూర మాత్రమే కాదు... పాలు కూడా కిడ్నీలో రాళ్లుగా మారవచ్చు. మనిషి బతకడానికి కేవలం 75 శాతం పనితీరుతో ఒక కిడ్నీ ఉంటే చాలు. కిడ్నీలు రక్తపోటునూ అదుపులో ఉంచుతాయి. కిడ్నీ కంప్యూటర్ మౌస్ అంత ఉంటుంది. కానీ కంప్యూటర్లోని చిప్స్ కంటే సంక్లిష్టమైన నిర్మాణంతో ఉంటుంది. విటమిన్ ‘డి’ ఉత్పాదనను స్టిమ్యులేట్ చేసేది కిడ్నీయే. కిడ్నీ పనితీరు పూర్తిగా తగ్గిపోవడం వల్ల వచ్చే జబ్బును ‘ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్’ (ఈఎస్ఆర్డీ) అంటారు. కిడ్నీలు దెబ్బతినవడం వల్ల దీర్ఘకాలం పాటు బాధపడే జబ్బును క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. రక్తపోటు సరిగా ఉన్నప్పుడు రక్తాన్ని కృత్రిమంగా శుభ్రపరిచే ప్రక్రియను ‘డయాలసిస్’ అంటారు. అదే రక్తపోటు అస్థిమితంగా ఉన్నప్పుడు కూడా రక్తాన్ని శుభ్రపరిచే ప్రక్రియను ‘కంటిన్యువస్ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ’ అంటారు. మందుబాబులూ జాగ్రత్త! మద్యం తాగినప్పుడు కిడ్నీ ఎక్కువగా పనిచేసి మూత్రాన్ని ఎక్కువగా బయటకు పంపాల్సి వస్తుంది. దాంతో ఒంట్లోని నీరంతా బయటకు పోతుంది. అది చాలా ప్రమాదం కదా. అందుకే అప్పుడు పిట్యూటరీ గ్రంథి రంగంలోకి దిగుతుంది. ‘యాంటీ-డైయూరెటిక్’ హార్మోన్‌ను వెలువరిస్తుంది. దాంతో ఒంట్లోని నీరంతా బయటకు వెళ్లకుండా ఉంటుంది. కానీ ఎంత డైయూరెటిక్ హార్మోన్ ఉత్పత్తి అవుతున్నా... ఆల్కహాల్ ఎక్కువతే యాంటీ డైయూరెటిక్ హార్మోన్ తగ్గుతుంది. ఒక్క మద్యంతోనే ఈ ప్రమాదమని అనుకుంటున్నారా? కాఫీ తాగినా అంతే. సిగరెట్‌తోనూ సేమ్ యాక్షన్. -
ముక్కు మూసుకుని 15 నిమిషాలు!
మహాభారత యుద్ధం తర్వాత దుర్యోధనుడు ఎక్కడ దాక్కున్నాడు? ఓ నీటి సరస్సు అడుగుభాగంలో ఊపిరి పీల్చకుండా కొన్ని రోజులు గడిపేశాడు. అవన్నీ కథలు. వాస్తవంగా అయ్యేవా.. పొయ్యేవా? అనుకుంటున్నారా? అయితే రోజుల తరబడి కాకున్నా కనీసం 15 నిమిషాలపాటు అయినా ముక్కుమూసుకుని నీటిలో నిక్షేపంగా బతికేయవచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు. అసలు కిటుకేమిటంటే.. ఆక్సిజన్ అణువులను రక్తంలోకి ఎక్కించడమే! మనిషి వెంట్రుకలు సగటున 80 మైక్రోమీటర్ల మందం ఉంటాయనుకుంటే.. వాటిలో 40వ వంతు సైజులో.. అంటే రెండు నుంచి నాలుగు మైక్రోమీటర్ల సైజున్న ఆక్సిజన్ అణువులను లిపిడ్ కవచాల సాయంతో రక్తంలోకి ఎక్కించడం ద్వారా దీనిని సాధించవచ్చని బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు చెందిన పరిశోధన బృందం సారథి జాన్ కెయిర్ అంటున్నారు. రక్తంలోకి చేరిన లిపిడ్ కవచాలు ఎర్ర రక్తకణాలను ఢీకొని ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయని, తద్వారా శరీరానికి అవసరమైన ప్రాణవాయువు అందుతుందని కెయిర్ తెలిపారు. ప్రమాదాల్లో, లేదా యుద్ధాల్లో గాయపడ్డ వారు గాయాలతోనే కొంచెం ఎక్కువ సేపు బతికేలా చేయవచ్చని, తద్వారా ప్రాణాలు కాపాడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
రెండు కొక్కేలతో రక్తకణాలకు అతుక్కుంటుంది!
మలేరియా పరాన్నజీవి గుట్టువిప్పిన భారత సంతతి శాస్త్రవేత్త వాషింగ్టన్: దోమకాటు వల్ల మనిషిలోకి ప్రవేశించి క్రమంగా ఎర్ర రక్తకణాలను తినేస్తూ.. ప్రాణాలు హరించే మలేరియా వ్యాధికారక ప్లాస్మోడియం వైవాక్స్ పరాన్నజీవి గుట్టును భారత సంతతి శాస్త్రవేత్త నీరజ్ తోలియా విప్పారు. భారత్‌లోని ప్లాస్మోడియం జాతుల్లో అతి ప్రమాదకరమైన వైవాక్స్ పరాన్నజీవి మనిషి ఎర్ర రక్తకణాలకు రెండు ప్రొటీన్ కొక్కేలతో అతుక్కుంటుందని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన నీరజ్ కనుగొన్నారు. ఎర్ర రక్తకణంపై ఉండే రెండు ప్రొటీన్లను, తనలోని రెండు ప్రొటీన్లను ఉపయోగించి అది రెండు దశల ప్రక్రియ ద్వారా కొక్కేలను తయారు చేసుకుంటుందని ఆయన తేల్చారు. దీంతో మనిషి ఎర్ర రక్తకణాలపై ఆ ప్రొటీన్లను తొలగించేందుకు లేదా ప్లాస్మోడియం ప్రొటీన్లను నివారించేందుకు కొత్త టీకాలు, మందులు కనుగొంటే.. ఈ పరాన్నజీవిని నిర్మూలించొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.