కరోనా వ్యాధి సంక్రమించిన వారికి కొమ్ములు నెత్తి మీదకు రావు గుర్తు పట్టేందుకు. ఆరోగ్యంగా కనిపిస్తూ కూడా వారు ఆ క్రిమికి వాహకంగా ఉంటారు. పదిమందికి తెలియకనే అంటిస్తారు. అందుకే ఇప్పుడు మనిషికి మనిషి ఎడం పాటించడం, పరిశుభ్రత పాటించడం అవసరం. శానిటైజర్స్ చాలామంది వాడుతున్నారు. కొందరు మాస్క్‌లు ధరిస్తున్నారు. మరికొందరు తమ దగ్గరకు పని కోసం వచ్చేవారిని టెంపరేచర్ చెక్ చేశాకే రానిస్తున్నారు. అన్నీ మంచి పనులే. అయితే ఇండోనేషియా ఒక అడుగు ముందుకేసింది. అక్కడ ప్రభుత్వ కార్యాలయాలకు పనుల నిమిత్తం వచ్చేవారిని రసాయనాలతో శుభ్రం చేసి మరీ లోపలికి పంపుతున్నారు. దీనివల్ల వచ్చిన వారు, లోపలి వారు ఇద్దరూ సురక్షితం అవుతున్నారు. మన దేశంలో ఇంకా ఈ విధానం వరకూ రాలేదు. రాకుండా ఉండాలంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న లాక్‌డౌన్‌ను గౌరవించాలి. ఇంటి పట్టునే ఉండిపోవాలి. మన రక్షణే దేశ రక్షణ.
Comments
Please login to add a commentAdd a comment