పొడగరి మగాళ్లకు పేగు కేన్సర్ రిస్కు!
పరిపరి శోధన
పొడగరి మగాళ్లకు పేగు కేన్సర్ రిస్కు ఎక్కువట. పొట్టిగా ఉండేవాళ్లతో పోలిస్తే పొడగరి మగాళ్లకు.. ముఖ్యంగా కాళ్ల పొడవు 90 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉండే వాళ్లకు పేగు కేన్సర్ సోకే అవకాశాలు 42 శాతం ఎక్కువగా ఉంటాయని ఒక తాజా అధ్యయనంలో తేలింది. మిన్నెసోటా వర్సిటీ శాస్త్రవేత్తలు 14,500 మందిపై జరిపిన విస్తృత అధ్యయనంలో ఈ విషయాన్ని నిగ్గుతేల్చారు.
పొడుగు పెరగాలని చాలామంది ఉబలాట పడుతుంటారు గానీ, పొడగరులతో పోలిస్తే పొట్టివారిలోనే పేగులు సురక్షితంగా ఉంటాయని మిన్నెసోటా పరిశోధకులు చెబుతున్నారు.