
చిట్టి.. ఫ్రమ్ చైనా!
ఇటీవల చైనా రాజధాని బీజింగ్‌లో ముగిసిన వరల్డ్ రోబో ఎగ్జిబిషన్ దృశ్యాలివి. దీంట్లో అచ్చం మనిషిని పోలిన ఆండ్రాయిడ్ రోబో జెనినాయిడ్ ఎఫ్ అత్యంత అందమైన రోబోగా పేరు కొట్టేసింది. ఈమధ్యే సయోనారా అనే సినిమాతో జెమినాయిడ్ ఎఫ్ తొలి నటిగా రికార్డు సృష్టించింది కూడా. దీంతోపాటు కోరిన ఆహారాన్ని అందించే వెయిటర్, అద్దాలను శుభ్రం చేసే రోబో, చైనీస్‌లోనూ రాయగల రోబో చేయి వంటి వాటిని ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు.