Biggest Hits in 2019: Box Office Collections Wise | Telugu Hit Movies List in 2019 - Sakshi
Sakshi News home page

2019లో భారీ వసూళ్లు రాబట్టిన సినిమాలివే..

Published Tue, Dec 31 2019 12:42 AM | Last Updated on Tue, Dec 31 2019 10:43 AM

ROUNDUP 2019: Special Story on Tollywood Movies - Sakshi

సినిమా పండగను బాక్సాఫీస్‌ డిసైడ్‌ చేస్తుంది. ఎంత కలెక్షన్‌ వస్తే అంత పండగ. ప్రతి సినిమా నచ్చాలని రిలీజయ్యి హిట్‌ కొట్టాలని ఇండస్ట్రీ కోరుకుంటుంది. కానీ ప్రేక్షకులు తమకు కనెక్ట్‌ అయిన వాటికే జైకొట్టి కాని వాటికి నై కొడతారు. ఈ సంవత్సరం వారికి నచ్చిన సినిమాలను నెత్తిన పెట్టుకున్నారు. నచ్చనివాటిని చూసి పెదవి విరిచారు. మరింత కష్టపడి ఇంకా బాగా తీస్తే ప్రతి శుక్రవారం పండగ చేయిస్తామని హామీ ఇచ్చారు. ఇది 2019 రిపోర్ట్‌.

2019కి అన్ని సంవత్సరాల్లాగే తన వంతు మంచి, తన వంతు చెడు ఉన్నాయి. అది కొందరిని సంతోషపెట్టింది. కొందరిని మరింత బాగా పని చేయమని హెచ్చరించింది. శ్రద్ధ పెట్టి తీస్తే కొత్త సబ్జెక్ట్‌లు కూడా ఆడతాయని, చిన్న సినిమాలు కూడా గెలుస్తాయని తేల్చి చెప్పింది. ఈ ఏడాది స్ట్రయిట్‌ సినిమాలు సుమారు 190కి పైనే రిలీజ్‌ అయితే దాదాపు 20 చిత్రాలు మాత్రమే సక్సెస్‌ని టేస్ట్‌ చేశాయి. ఇది తక్కువ శాతమే. మరిన్ని సినిమాలు ఆడాల్సింది. హిట్‌ రేట్‌ ఎక్కువ ఉంటే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది.

చిత్రం    :    మహర్షి
నటీనటులు    :    మహేశ్‌బాబు, పూజా హెగ్డే, ‘అల్లరి’ నరేశ్, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు
నిర్మాతలు    :    అశ్వనీ దత్,  ‘దిల్‌’ రాజు, పీవీపీ
దర్శకుడు    :    వంశీ పైడిపల్లి
విడుదల తేది    :    మే 9
కథ    :    డబ్బు సాధించడమే నిజమైన సక్సెస్‌ అనుకునే మనస్తత్వం ఉన్నవాడు రిషి. దానికోసం పరిగెడుతూ ఉంటాడు. ఈ ప్రయాణంలో తనకు దగ్గరైన ఇద్దరు వ్యక్తులకు దూరం అవుతాడు. ఫైనాన్షియల్‌ సక్సెస్‌ ముఖ్యమా? ఎమోషనల్‌ సక్సెస్‌ గొప్పా? అనే సందిగ్ధంలో రిషి ఎటు వైపు నడిచాడు? ఇంతకీ జీవితంలో నిజమైన సక్సెస్‌ ఏంటో తెలుసుకున్నాడా? అనేది  కథ.
బడ్జెట్‌: 130 కోట్లు ; వసూళ్లు: 145 కోట్లు

‘మహర్షి’లో మహేశ్‌బాబు

చిత్రం    :    ఎఫ్‌ 2
నటీనటులు    :    వెంకటేశ్, వరుణ్‌ తేజ్, తమన్నా, మెహరీన్‌
డైరెక్టర్‌    :    అనిల్‌ రావిపూడి
నిర్మాత    :    ‘దిల్‌’ రాజు
విడుదల తేది    :    జనవరి 12
కథ     :    భార్య పెట్టే బాధలను భరించలేక వెంకటేశ్, పెళ్లయితే జీవితం ఇలా ఉంటుందేమోనని భయంతో వరుణ్‌ తేజ్, ఆల్రెడీ పెళ్లయిన రాజేంద్రప్రసాద్‌ బ్యాంకాక్‌ పారిపోతారు. ఆ తర్వాత తమ భార్యలకు వేరే వాళ్లతో పెళ్లి సెట్‌ అవుతుందని తెలుసుకొని పెళ్లి చెడగొట్టే ప్రయత్నాలు చేస్తారు తోడుఅల్లుళ్లు వెంకీ, వరుణ్‌. ఈ ప్రయత్నాల్లో ఫ్రస్ట్రేట్‌ అవుతూ ఫన్‌ ఎలా క్రియేట్‌ చేశారన్నది కథ.
బడ్జెట్‌: 40 కోట్లు ; వసూళ్లు: 94 కోట్లు

‘ఎఫ్‌2’లో వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌

చిత్రం    :    యాత్ర
నటీనటులు    : మమ్ముట్టి,
        జగపతిబాబు, సుహాసిని
డైరెక్టర్‌    :    మహీ వి రాఘవ్‌
నిర్మాత    :    విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి
విడుదల తేదీ    :    ఫిబ్రవరి 8
కథ    :    మాజీ ముఖ్యమంత్రి, దివంగత జన నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాజకీయ ప్రస్థానంలో పాదయాత్ర ప్రముఖమైనది. ఈ యాత్ర చేపట్టడానికి కారణాలు, ఇందులో భాగంగా ఆయన కలుసుకున్న మనుషులు, తెలుసుకున్న విషయాలు ఏంటి? తద్వారా చేపట్టిన ప«థకాలేంటి అనేది కథాంశం.
బడ్జెట్‌: 18 కోట్లు ; వసూళ్లు : 22 కోట్లు

‘యాత్ర’లో మమ్ముట్టి 

చిత్రం    :    ఇస్మార్ట్‌ శంకర్‌
నటీనటులు    :    రామ్, నభా నటేశ్, నిధీ అగర్వాల్‌
నిర్మాత    :    పూరి జగన్నాథ్, చార్మి
దర్శకుడు    :    పూరి జగన్నాథ్‌
విడుదల తేదీ    :    జూలై 18
కథ    :    శంకర్‌ హైదరాబాద్‌లో చిన్న రౌడీ. ఓ సెటిల్‌మెంట్‌లో భాగంగా ఓ ఎం.ఎల్‌.ఏని చంపేస్తాడు. ఆ కేస్‌ని ఇన్వేస్టిగేట్‌ చేస్తూ ఓ పోలీసాఫీసర్‌ చనిపోతాడు. అతని మెదడులోని సమాచారాన్ని శంకర్‌ మెదడులోకి చిప్‌ ద్వారా పొందుపరుస్తారు. శంకర్‌ పోలీసులకు సహాయం చేస్తాడా? లేదా అనేది కథ.
బడ్జెట్‌: 27 కోట్లు ; వసూళ్లు: 78 కోట్లు

‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో రామ్‌

చిత్రం    :    జెర్సీ
నటీనటులు    :    నాని, శ్రద్ధాశ్రీనాథ్‌
దర్శకుడు    :    గౌతమ్‌ తిన్ననూరి
నిర్మాతలు    :    సూర్యదేవర నాగవంశీ
విడుదల తేది    :    ఏప్రిల్‌ 19
కథ    :    25 ఏళ్ల వయసులో అనుకోకుండా క్రికెట్‌కు దూరం కావాలనుకుంటాడు అర్జున్‌. కానీ
36 ఏళ్ల వయసులో మళ్లీ ఇండియన్‌ టీమ్‌కు ఆడాలని నిశ్చయించుకుంటాడు. మళ్లీ క్రికెట్‌ ఆడాలని ఎందుకు అనుకున్నాడు? అనుకున్నది సాధించాడా లేదా? అనేది  కథాంశం.
బడ్జెట్‌: 25 కోట్లు ; వసూళ్లు: 36 కోట్లు

‘జెర్సీ’లో నాని

చిత్రం    :    ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ
నటీనటులు     :    నవీన్‌ పొలిశెట్టి, శృతీ శర్మ, సుహాస్‌
నిర్మాత    :    రాహుల్‌ యాదవ్‌ నక్కా
దర్శకుడు    :    స్వరూప్‌ ఆర్‌ఎస్‌ జె
విడుదల తేది    :    జూలై 21
కథ    :    డిటెక్టివ్‌ సినిమాల్లో ట్విస్ట్‌ రివీల్‌ అవ్వకముందే పసిగడితే చాలు కేసులు స్వాల్‌ చేయొచ్చు అనుకునే అమాయకపు జీనియస్‌ ఆత్రేయ. గుళ్లో హుండీలో డబ్బులు పోవడం, కుక్క పిల్లలు తప్పిపోవడం వంటి చిన్న చిన్న కేసులు డీల్‌ చేస్తుంటాడు. ఆ సమయంలోనే ఓ అనాథ శవాలతో క్రైమ్‌ను నడిపించే
ఓ పెద్ద మాఫియా కేసుని టేకప్‌ చేస్తాడు ఆత్రేయ.
ఆ మిస్టరీని ఎలా చేధించాడు? అనేది చిత్రకథ.
బడ్జెట్‌: 4 కోట్లు
వసూళ్లు: 20 కోట్లు

‘ఏజెంట్‌ సాయిశ్రీనివాస...’లో నవీన్‌

చిత్రం    :    మజిలీ
నటీనటులు    :    నాగచైతన్య, సమంత, దివ్యాంశ కౌశిక్‌
దర్శకుడు    :    శివ నిర్వాణ
నిర్మాతలు    :    సాహు గారపాటి, హరిష్‌ పెద్ది
విడుదల తేది    :    ఏప్రిల్‌ 5
కథ    :    క్రికెటర్‌ అవ్వాలనుకుంటాడు వైజాగ్‌ కుర్రాడు పూర్ణ (నాగచైతన్య). అది పూర్ణ తండ్రికి ఇష్టం ఉండదు. క్రికెట్‌పై ఫోకస్‌ పెడుతున్న సమయంలో అతని జీవితంలోకి అన్షూ (దివ్యాంశ) ప్రవేశిస్తుంది.  కానీ శ్రావణి (సమంత)ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. పూర్ణ ఎందుకు క్రికెటర్‌ కాలేకపోయాడు. అసలు అన్షు–పూర్ణ ఎలా విడిపోయారు? పూర్ణ లైఫ్‌లోకి శ్రావణి వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలు ఏంటి? అనేది కథ.
బడ్జెట్‌: 30 కోట్లు ; వసూళ్లు: 47 కోట్లు

‘మజిలీ’లో నాగచైతన్య

చిత్రం: డియర్‌ కామ్రేడ్‌
నటీనటులు    :    విజయ్‌ దేవరకొండ, ర ష్మికా మందన్నా
నిర్మాత    :    మైత్రీ మూవీ మేకర్స్‌
దర్శకుడు    :    భరత్‌ కమ్మ
విడుదల తేదీ    :    జూలై 26
కథ    :    లిల్లీ (రష్మిక) పెద్ద క్రికెటర్‌ కావాలనుకుంటుంది. తన అక్క పెళ్లికోసం కాకినాడ వెళ్లినప్పుడు బాబీతో (విజయ్‌) ప్రేమలో పడుతుంది. అనివార్య కారణాలతో తనకి ఇష్టమైన క్రికెట్‌ను వదిలేయాల్సి వస్తుంది. దానికి కారణమేంటి? లిల్లీ తన లక్ష్యాన్ని చేరుకునేలా బాబీ ఎలా సహాయం చేశాడు అన్నదే కథ.
బడ్జెట్‌: 30 కోట్లు
వసూళ్లు: 45 కోట్లు

‘డియర్‌ కామ్రేడ్‌’లో రష్మిక, విజయ్‌

చిత్రం: గద్దలకొండ గణేశ్‌
నటీనటులు    :    వరుణ్‌ తేజ్, పూజా హెగ్డే, అథర్వ మురళి
నిర్మాత    :    14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లస్‌
దర్శకుడు    :    హరీశ్‌ శంకర్‌
విడుదల తేది    :    సెప్టెంబర్‌ 20
కథ    :    అథర్వ దర్శకుడు కావాలనుకుంటాడు. దానికోసం ఓ నిజమైన విలన్‌ మీద సినిమా తీయాలనుకుంటాడు. అలా గద్దల కొండ గణేశ్‌ (వరుణ్‌ తేజ్‌)æ ఊరికి ప్రయాణం అవుతాడు. మరి తను అనుకున్నది సాధించాడా లేదా అనేది కథాంశం.
బడ్జెట్‌ :  35 కోట్లు ; వసూళ్లు : 45 కోట్లు

‘గద్దలకొండ గణేష్‌’లో పూజ, వరుణ్‌

చిత్రం    :    రాక్షసుడు
నటీనటులు    :    బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్‌
నిర్మాత    :    కోనేరు సత్యనారాయణ
దర్శకుడు    :    రమేష్‌ వర్మ
విడుదల తేది    :    ఆగస్ట్‌ 2
కథ    :    నగరంలో వరుసగా ఆడపిల్లలు కిరాతకంగా హత్యకు గురవుతుంటారు. దీని వెనక ఓ సైకో కిల్లర్‌ ఉంటాడు. ఆ సైకో కిల్లర్‌ ఎందుకిలా చేస్తున్నాడు? ఈ హత్యలు చేయడానికి గల కారణాలేంటి? పోలీస్‌ ఆఫీసర్‌ అరుణ్‌ (బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌) అతన్ని ఎలా పట్టుకున్నాడన్నదే చిత్రకథ. తమిళ చిత్రం ‘రాక్షసన్‌’కి ఇది తెలుగు రీమేక్‌.
బడ్జెట్‌: 28 కోట్లు ; వసూళ్లు: 35 కోట్లు

‘రాక్షసుడు’లో సాయిశ్రీనివాస్‌....

చిత్రం: ఎవరు
నటీనటులు    :    అడివి శేష్, రెజీనా, నవీన్‌ చంద్ర
నిర్మాత    :     పీవీపీ
దర్శకుడు    :    వెంకట్‌ రామ్‌జీ
విడుదల తేది    :    ఆగస్ట్‌ 15
కథ    :    అత్యాచారానికి గురయ్యానని చెప్పుకుంటుంది రెజీనా. తనని తాను కాపాడుకునే ప్రయత్నంలో తన మీద దాడి చేసిన పోలీస్‌ ఆఫీసర్‌ను కాల్చి చంపానని చెబుతుంది. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి ఓ లంచగొండి పోలీస్‌ ఆఫీసర్‌ సహాయం తీసుకుంటుంది. అసలు నిజంగానే రెజీనా అత్యాచారానికి గురైందా? ఒకవేళ జరగకపోతే ఎందుకలా చెప్పింది? ఆమె టార్గెట్‌ ‘ఎవరు’ అనేది చిత్రకథ.
బడ్జెట్‌: 8 కోట్లు
వసూళ్లు: 15.5 కోట్లు

‘ఎవరు’లో రెజీనా, అడివి శేష్‌

చిత్రం    :    118
నటీనటులు    :    కల్యాణ్‌రామ్, నివేదా థామస్, షాలినీ పాండే
డైరెక్టర్‌ : కేవీ గుహన్‌ ; నిర్మాత : మహేష్‌ కోనేరు ;  విడుదల : మార్చి 1
కథ    :    ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్టు గౌతమ్‌ (కల్యాణ్‌ రామ్‌) వర్క్‌ విషయమై ఓ రిసార్ట్‌లోని 118 అనే రూమ్‌లో ఉండాల్సి వస్తుంది. సరిగ్గా 1 గంట 18 నిమిషాలకు ఎవరో ఓ అమ్మాయిని హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కలగంటాడు. మరో సందర్భంలోనూ అదే కల. ఆ గదికి, అతని కలకు ఉన్న లింక్‌ ఏంటి? గౌతమ్‌కి వచ్చిన కల నిజంగా జరిగిందా? ఈ ప్రాసెస్‌లో గౌతమ్‌కి ఎదురైన సంఘటనలు ఏంటి? అన్నదే కథ.
బడ్జెట్‌ : 12 కోట్లు ; వసూళ్లు: 17 కోట్లు

చిత్రం: ఓ బేబీ
నటీనటులు    :    సమంత, లక్ష్మీ, రాజేంద్ర ప్రసాద్,
నిర్మాత    :    సునీతా తాటి , వివేక్‌ కూచిభొట్ల
దర్శకుడు    :    నందినీ రెడ్డి
విడుదల తేది    :    జూలై 5
కథ    :    70 ఏళ్లు పైబడిన లక్ష్మికి తన జీవితాన్ని 20 ఏళ్ల వయసున్న అమ్మాయిలా జీవించే అవకాశం వస్తే ఏం చేసింది? ఎలా అల్లరి చేసింది? తన కుటుంబంతో ఏర్పడ్డ మనస్పర్థలు ఎలా తొలగించింది? అనే కథాంశంతో ‘ఓ బేబీ’ తెరకెక్కింది. కొరియన్‌ చిత్రం ‘మిస్‌ గ్రానీ’కి ఇది తెలుగు రీమేక్‌.
బడ్జెట్‌: 16 కోట్లు ; వసూళ్లు: 40 కోట్లు

‘ఓ బేబీ’లో సమంత

చిత్రం: గ్యాంగ్‌లీడర్‌
నటీనటులు    :    నాని, లక్ష్మీ, కార్తికేయ, ప్రియాంక మోహనన్‌
నిర్మాత    :    మైత్రీ మూవీ మేకర్స్‌
దర్శకుడు    :    విక్రమ్‌ కె కుమార్‌
విడుదల తేది    :    సెప్టెంబర్‌ 13
కథ    :    ఇంగ్లీష్‌ సినిమాల్లో కథల్ని కాపీ కొట్టి ప్రతీకార నవలలు రాస్తుంటాడు పార్థసారధి. తమకు జరిగిన అన్యాయం ఎదుర్కోవడానికి ఓ రివెంజ్‌ ప్లాన్‌ కావాలంటూ ఐదురుగురు మహిళలు అతని దగ్గరకు వస్తారు. వాళ్ల ప్రతీకారం ప్లాన్‌ను పార్థసారథి ఎలా రాశాడన్నది కథ.
బడ్జెట్‌: 40 కోట్లు ; వసూళ్లు: 45 కోట్లు

‘గ్యాంగ్‌లీడర్‌’లో నాని, ప్రియాంక

చిత్రం    :    లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌
నటీనటులు    :    విజయ్‌కుమార్, యజ్ఞాశెట్టి, శ్రీతేజ్‌
దర్శకులు    :    రామ్‌గోపాల్‌ వర్మ, అగస్త్య మంజు
నిర్మాతలు    :    రాకేష్‌ రెడ్డి, దీప్తి
విడుదల తేది    :    మార్చి 29
కథ    :    ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, నటుడు ఎన్టీఆర్‌ జీవితంలో రాజకీయ వెన్నుపోటు పర్వంగా ప్రజలు చెప్పుకునే సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చినప్పటి నుంచి ఆయన జీవితం ఎలా సాగిందనే అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
బడ్జెట్‌: రెండున్నర కోట్లు ; వసూళ్లు: 7 కోట్లు

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’లో విజయ్‌కుమార్‌

చిత్రం    :    చిత్రలహరి
నటీనటులు    :    సాయిధరమ్‌ తేజ్, నివేదా పేతురాజ్, కల్యాణీ ప్రియదర్శన్‌
దర్శకుడు    :    కిశోర్‌ తిరుమల
నిర్మాతలు    :    నవీన్‌ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్‌
విడుదల తేది    :    ఏప్రిల్‌ 12
కథ: లైఫ్‌లోని ప్రతీ స్టేజ్‌లో విజయ్‌ కృష్ణను (సాయి తేజ్‌) ఫెయిల్యూరే పలకరిస్తుంది. అందరూ అతన్ని ఫెయిల్యూర్‌ అంటున్నప్పటికీ అతని తండ్రి మాత్రం విజయ్‌ను ప్రోత్సహిస్తుంటాడు. ఈ క్రమంలో అతను డెవలప్‌ చేస్తున్న యాప్‌ ప్రజెంటేషన్, తన లవ్‌ లైఫ్‌ రెండూ అనుకున్నట్టు జరగవు. ఆ టైమ్‌లో విజయ్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? అతనికి
సాయంగా నిలబడింది ఎవరు?  విజయ్‌ ఎలా
గెలిచాడు అన్నదే కథ.
బడ్జెట్‌: 16 కోట్లు ; వసూళ్లు : 25 కోట్లు

‘చిత్రలహరి...’లో సాయితేజ్, కల్యాణి

చిత్రం    :    మత్తు వదలరా
నటీనటులు    :    శ్రీ సింహా, సత్య
డైరెక్టర్‌    :    రితేష్‌ రానా
నిర్మాతలు    :    చెర్రీ (చిరంజీవి), హేమలత)
కథ    :    చాలీ చాలని జీతంతో కష్టపడే డెలివరీ బాయ్‌ హీరో శ్రీసింహా. తన మిత్రుడు ఇచ్చిన ఐడియా మేరకు ఓ పని చేస్తాడు. ఆ ఐడియా అతన్ని ఎలాంటి ఇబ్బందుల్లో పడేసింది? అందులోనుంచి ఎలా బయటకు వస్తాడు? అనేది కథ.
బడ్జెట్‌: 2 కోట్లు ; వసూళ్లు:
(మంచి టాక్‌తో ఇంకా థియేటర్స్‌లో ప్రదర్శితం అవుతోంది )

‘మత్తు వదలరా..’లో శ్రీసింహా...

చిత్రం    :    అర్జున్‌ సురవరం
నటీనటులు    :    నిఖిల్, లావణ్యా త్రిపాఠి
నిర్మాత    :    రాజ్‌కుమార్‌ ఆకెళ్ల, ఠాగూర్‌ మధు
దర్శకుడు    :    టి. సంతోష్‌
విడుదల తేది    :    నవంబర్‌ 29
కథ     :    అర్జున్‌ ఓ టీవీ ఛానెల్‌ రిపోర్టర్‌. అనుకోకుండా నకిలీ సర్టిఫికెట్ల స్కామ్‌లో ఇరుక్కుంటాడు. ఈ స్కామ్‌ వెనక ఉన్నది ఎవరు? ఇందులో నుంచి తను ఎలా తప్పించుకున్నాడన్నది కథాంశం.
బడ్జెట్‌ : 10 కోట్లు ; వసూళ్లు : 20 కోట్లు

‘అర్జున్‌ సురవరం’లో నిఖిల్‌

చిత్రం    :    ప్రతిరోజూ పండగే
నటీనటులు    :    సాయి తేజ్, సత్యరాజ్, రాశీ ఖన్నా, రావు రమేశ్‌
నిర్మాత    :    బన్నీ వాస్‌
దర్శకుడు    :    మారుతి
విడుదల తేది: డిసెంబర్‌ 20
కథ:  పుట్టినరోజు, పెళ్లిలానే చావు కూడా మన జీవితంలో ఓ విశేషమే. దాన్ని కూడా ఆనందంగా సెలబ్రేట్‌ చేసుకోవాలి అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ఇది.
బడ్జెట్‌: 25 కోట్లు ; వసూళ్లు : 40 కోట్లు
(ఇంకా థియేటర్స్‌లో ప్రదర్శిస్తున్నారు)

‘ప్రతిరోజూ పండగే’లో సత్యరాజ్, సాయితేజ్‌

చిత్రం    :    వెంకీ మామ
నటీనటులు    :    వెంకటేశ్, నాగచైతన్య
డైరెక్టర్‌    :    కేయస్‌ రవీంద్ర (బాబి)
నిర్మాతలు    :    సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌
విడుదల తేది    : డిసెంబర్‌ 13
కథ    :    వెంకటేశ్, నాగచైతన్య మామాఅల్లుళ్లు. అల్లుడి కోసం అసలు పెళ్లే వద్దు అనుకున్న మామ, మామను విడిచి ఉండటం ఇష్టం లేక వచ్చిన మంచి ఉద్యోగాన్ని కూడా వదులుకున్న అల్లుడు... మరి ఇలాంటి మామాఅల్లుళ్లు మూడేళ్లు కలుసుకోకుండా ఉండాల్సి వస్తుంది. దానికి కారణం ఏంటి? మామాఅల్లుళ్లు మళ్లీ ఎలా కలుసుకున్నారు అనేది కథ.
బడ్జెట్‌: 45 కోట్లు ; వసూళ్లు:  60 కోట్లు
(ఇంకా థియేటర్స్‌లో రన్‌ అవుతోంది)

‘వెంకీమామ’లో నాగచైతన్య, వెంకటేశ్‌

చిత్రం    :    మల్లేశం
నటీనటులు     :    ప్రియదర్శి, అనన్య, ఝాన్సీ
దర్శక–నిర్మాత:    రాజ్‌ ఆర్‌
విడుదల తేది    :    జూలై 21
కథ    :    పద్మశ్రీ అవార్డుగ్రహీత చింతకింది మల్లేశం బయోపిక్‌ ఇది. ఆసు పోయడం కోసం అమ్మ పడుతున్న అవస్థను చూడలేక ఆసు యంత్రం తయారు చేయాలనుకుంటాడు మల్లేశం.  6వ తరగతి కూడా పాస్‌ కాని మల్లేశం ఆసు యంత్రం ఎలా  కనుక్కొన్నాడు? ఈ మెషీన్‌ తయారీలో తనకు ఎదురైన అడ్డంకులేంటి? అన్నది కథాంశం.
బడ్జెట్‌ : రెండున్నర కోట్లు ; వసూళ్లు: 5 కోట్లు

‘మల్లేశం’లో ప్రియదర్శి

చిత్రం    :    బ్రోచేవారెవరురా
నటీనటులు    :    శ్రీవిష్ణు, నివేదా థామస్, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ
నిర్మాత    :    మన్యం విజయ్‌ కుమార్‌
దర్శకుడు    :    వివేక్‌ ఆత్రేయ
విడుదల తేది    :    జూలై 21
కథ    :    దర్శకుడు అవ్వాలని కలలు కంటుంటాడు సత్యదేవ్‌. ఓ టాప్‌ హీరోయిన్‌కి కథ చెప్పే అవకాశం వస్తుంది. ఇంటర్‌ ఐదేళ్లుగా పాస్‌ అయ్యే ప్రయత్నం చేస్తుంటారు శ్రీవిష్ణు, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి. వీళ్ల గ్యాంగ్‌లో ప్రిన్సిపల్‌ కూతురు నివేదా థామస్‌ కూడా తోడవుతుంది. సరదాగా సాగిపోతున్న సమయంలో నివేదా కిడ్నాప్‌ అవుతుంది. సత్యదేవ్, నివేదా పేతురాజ్‌ వెళ్తున్న కార్‌కి యాక్సిడెంట్‌ అవుతుంది. సత్యదేవ్‌ సినిమా మొదలెట్టాడా? నివేదా థామస్‌ కిడ్నాపర్స్‌ నుంచి ఎలా బయటపడింది? అన్నది కథాంశం .
బడ్జెట్‌: 7 కోట్లు ; వసూళ్లు: 20 కోట్లు

‘బ్రోచేవారెవరురా..’లో శ్రీవిష్ణు..

డబ్బింగ్‌ సినిమాలు
ఈ ఏడాది డబ్బింగ్‌ సినిమాలు ప్రభావం చూపించలేదనే చెప్పాలి. దాదాపు 70 డబ్బింగ్‌ సినిమాలు విడుదలైతే కార్తీ ‘ఖైదీ’ స్థాయిలో వేరే ఏ అనువాద చిత్రం వసూళ్లు రాబట్టలేదు. రజనీకాంత్‌ ‘పేటా’ తమిళంలో మంచి సక్సెస్‌ అయినా తెలుగులో అనుకున్నంతగా ఆడలేదు. రాఘవ లారెన్స్‌ ‘కాంచన 3’ మంచి వసూళ్లను రాబట్టింది. సూర్య ‘ఎన్‌జీకే’ పెద్ద ఫ్లాప్‌గా నిలిచింది. కార్తీ ‘దొంగ’ ఫర్వాలేదనిపించుకుంది. ఎన్నో అంచనాలతో విడుదలైన మలయాళ చిత్రం ‘లవర్స్‌ డే’ ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయింది. సల్మాన్‌ ఖాన్‌ ‘దబంగ్‌ 3’ దబంగ్‌ సిరీస్‌లోనే వీక్‌ అనిపించుకుంది.

‘ఖైదీ’లో కార్తీ

2019లో భారీ అంచనాల నడుమ విడుదలై, ఆ అంచనాలను అందుకోలేకపోయిన సినిమాలు కొన్ని ఉన్నాయి. రామ్‌చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘వినయ విధేయ రామ’ పెద్ద నిరాశనే మిగిల్చింది. ఎన్టీఆర్‌ బయోపిక్‌గా తెరకెక్కిన ‘యన్‌.టి.ఆర్‌: కథానాయకుడు’, ‘యన్‌.టి.ఆర్‌: మహానాయకుడు’ సినిమాలు ఆకట్టుకోలేకపోయాయి. అఖిల్‌ ‘మిస్టర్‌ మజ్ను’ తన కలెక్షన్ల ప్రేమలో విఫలమయ్యాడు. నాగార్జున ‘మన్మథుడు 2’  మిశ్రమ స్పందనకు గురైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ప్రభాస్‌ ‘సాహో’ మేకింగ్‌లో మార్కులు పొందినా కలెక్షన్లను ఊహించిన స్థాయిలో రాబట్టలేకపోయింది. ‘సైరా: నరసింహా రెడ్డి’ భారీ ఓపెనింగ్స్‌ తెచ్చుకుంది. దేశభక్తి కథాంశం, చిరంజీవి కష్టపడి పని చేయడం సినిమా మీద అంచనాలను పెంచాయి. ఆ అంచనాలను అందుకోవడంలో అది అంతిమంగా వెనకబడింది. కాంట్రవర్శియల్‌ చిత్రంగా విడుదలైన ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ రిలీజ్‌కు ముందు ఉన్న ఆసక్తిని రిలీజ్‌ తర్వాత థియేటర్ల దాకా తీసుకురాలేకపోయింది.. బాలకృష్ణ ‘రూలర్‌’ అంతకుముందు సేమ్‌ కాంబినేషన్‌ (బాలకృష్ణ–కె.ఎస్‌. రవికుమార్‌)లో వచ్చిన ‘జై సింహా’ను మరపించలేకపోయింది.


  ∙‘సైరా’లో చిరంజీవి


  ‘వినయ విధేయ...’లో రామ్‌చరణ్‌

 
‘సాహో’లో ప్రభాస్‌


  ‘యన్‌.టి.ఆర్‌’ బయోపిక్‌లో బాలకృష్ణ

గమనిక : సినిమా బడ్జెట్, వసూళ్లకు చెందిన లెక్కలన్నీ సుమారుగా చెప్పినవే. అన్ని హక్కులు, థియేట్రికల్‌ రన్‌ను పరిగణించి వసూళ్లు ప్రచురించాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement