
కలసి సాగుదాం
మీలో ప్రతిభ ఉంది. దానికి తగ్గ ఆసక్తి ఉంది. ఏదైనా సాధించగలనన్న పట్టుదల ఉంది. కానీ ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది తెలియడం లేదా? చింతించాల్సిన పని లేదు. మీ ఆసక్తులను గుర్తించి, మీ నైపుణ్యాలను వెలికి తీసి, మీ కాళ్ల మీద మీరు నిలబడటానికి అవకాశం కల్పిస్తోంది సాక్షి ‘మైత్రి మహిళ. ఎలా అంటారా...
వంటలు, హస్తకళలు, బోధన, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాల నిర్వహణ వంటి అంశాలు వేటిలోనైనా మీకు ప్రతిభ, ఆసక్తి ఉంటే మాకు తెలియజేయండి. మేం ఊళ్లో నిర్వహించబోయే వర్క్‌షాపులకు మిమ్మల్ని ఆహ్వానిస్తాం. మీ ఆసక్తులను బట్టి ఆయా అంశాల్లో మీకు తర్ఫీదునిస్తాం. స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడేందుకు, చిన్నపాటి పరిశ్రమలను స్థాపించి మీరు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రోత్సాహం అందిస్తాం. మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, మిమ్మల్ని సాధికారత వైపు పయనింపజేస్తాం..
దీనికి మీరు చేయవలసిందల్లా ఒక్కటే. ఈరోజు మీ టాబ్లాయిడ్‌లో ఇచ్చిన అప్లికేషన్ ఫారంను లేదా సాక్షి బ్రాంచ్ ఆఫీసు నుంచి లేదా సాక్షి వెబ్‌సైట్ (www.sakshi.comలో మైత్రి మహిళ లింక్‌పై క్లిక్ చేయాలి) నుంచి తీసుకున్న అప్లికేషన్ ఫారంని నింపి, దానికి మీ ఫొటో ఐడీ జిరాక్స్ కాపీని జతచేసి నవంబర్ 10 లోగా మీ దగ్గరలో ఉన్న కలెక్షన్ సెంటర్‌లో అందజేయండి. లేదంటే సాక్షి మైత్రి, 6-3-248/3, రోడ్ నం. 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 అన్న అడ్రసుకు పోస్ట్‌లో పంపించండి. ఇతర వివరాలకు 040-23256138, 040-23256139 నంబర్లను సంప్రదించండి. పదహారేళ్లు దాటిన మహిళలందరూ దీనికి అర్హులే.
హైదరాబాద్ కలెక్షన్ సెంటర్లు:
సాక్షి డైలీ, ప్లాట్ నెం. డి-75, ఇ-52, ఏపి ఇండస్ట్రియల్ ఎస్టేట్, బాలానగర్; సాక్షి డైలీ, సర్వే నెం. 127, ప్లాట్ నెం.12, మల్లాపూర్ (విలేజ్), నాచారం, సికింద్రాబాద్; ఆర్.ఎస్. బ్రదర్స్, దిల్‌సుఖ్‌నగర్; ఆర్.ఎస్. బ్రదర్స్, అమీర్‌పేట్; ఆర్.ఎస్. బ్రదర్స్, కూకట్‌పల్లి; ఆర్.ఎస్. బ్రదర్స్, ప్యాట్నీ, సికింద్రాబాద్.