మితంగానా? సన్నీహితంగానా? | Sequel picks to ghayal Sunny Deol | Sakshi
Sakshi News home page

మితంగానా? సన్నీహితంగానా?

Published Sun, Aug 23 2015 12:27 AM | Last Updated on Sun, Sep 3 2017 7:56 AM

మితంగానా?  సన్నీహితంగానా?

మితంగానా? సన్నీహితంగానా?

 ఒకనాటి సూపర్‌హిట్  ఘాయల్‌కి సీక్వెల్ తీస్తున్నాడు సన్నీ డియోల్. ఘాయల్ వన్స్ అగైన్ పేరుతో రూపొందిస్తున్న ఈ సినిమా మీద మంచి అంచనాలున్నాయి. ఈ సినిమాలో సన్నీడియోల్‌తో సైఫ్ సోదరి, రంగ్ దే బసంతిలో సిద్ధార్ధతో జోడీ కట్టిన సోహా అలీఖాన్ నటిస్తోంది. ఇందులో సైకియాట్రిస్ట్ పాత్ర పోషిస్తున్న సోహాకి, సన్నీడియోల్‌కి మధ్య  కధలో సందర్భానుసారం వచ్చే కొన్ని శృంగార సన్నివేశాలు ఉన్నాయట. ఇంకా చిత్రీకరణ జరుపుకోవాల్సి ఉన్న ఆ హాట్ సీన్ల గురించి 36 ఏళ్ల సోహా అలీఖాన్ ఇప్పటి నుంచి నెర్వస్‌గా ఫీలవుతోందట.

సన్నీడియోల్ వంటి సీనియర్ నటుడితో నటించడం అనేది ఓ వైపు ఆనందంగానే  అనిపిస్తున్నా... అదే సమయంలో సదరు సన్నివేశాల్లో ఎలా నటిస్తానో అనే ఆందోళన తనకు ఉందని సన్నిహితుల వద్ద ఓపెన్ అవుతోందట సోహా. మరో విషయమేమిటంటే... సోహా భర్త కునాల్ ఖేము కూడా నటుడే. నాటి హీరో ధర్మేంద్ర దర్శకత్వంలో రూపొందుతూ, నవంబరులో విడుదల కానున్న ‘ఘాయల్ వన్స్‌మోర్’ ప్రేక్షకుల ముందుకు వస్తే కానీ... సోహా అలీఖాన్ నెర్వస్‌నెస్‌ను తగ్గించుకోగలిగిందా లేదా అనేది మనకి తెలియదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement