సోలోగా... యాత్రలు చేయాలోయ్! | Should be done as a solo tours | Sakshi
Sakshi News home page

సోలోగా... యాత్రలు చేయాలోయ్!

Published Thu, Dec 25 2014 11:00 PM | Last Updated on Sat, Sep 2 2017 6:44 PM

సోలోగా...  యాత్రలు చేయాలోయ్!

సోలోగా... యాత్రలు చేయాలోయ్!

సంచారం
 
పరిచయం
పేరు: అన్షూ గుప్తా
చదువు: ఎంబీఏ ప్రస్తుతం : ఐరానా డిజిటల్ మార్కెటింగ్
కంపెనీలో పదేళ్లుగా పనిచేస్తున్నారు.
గతంలో: నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్, హిస్టరీ చానెల్‌కి బ్రాండ్ మేనేజర్‌గా పదేళ్లు పనిచేశారు దాదాపు 50 దేశాలు సోలోగా పర్యటించారు

 
ప్రయాణం అంటే భౌగోళిక ప్రదేశాలు చూడడం మాత్రమే కాదు. మనలోకి మనం ప్రయాణించడం. సరికొత్త అన్వేషణకు దారి కనుక్కోవడం.  ఆత్మవిశ్వాసాన్ని బలోపేతం చేసుకోవడం. సాధారణంగా సోలోగా ప్రయాణించడం  చాలా కష్టం అంటుంటారు. అయితే ఆ కష్టాన్నే ఇష్టంగా ఎంచుకొని ప్రపంచంలో  ఎన్నో ప్రాంతాలను సోలోగా పర్యటించారు కాన్పూర్‌కు చెందిన అన్షూ గుప్తా. తన సోలో ట్రావెల్ గురించి ఆమె చెప్పిన విషయాలు...
 
 
మాధవీకళ
ఫస్ట్ ట్రిప్ - మెక్‌లాడ్ గంజ్... 20 ఏళ్ల క్రితం దీని గురించి ఎవరికీ తెలియదు.  ఇదే  నా మొదటి సోలో ట్రిప్.  ఢిల్లీకి  దగ్గరలో వున్న అంత మంచి ప్లేస్ మన వాళ్లకి తెలియక పోవటం  షాకింగ్‌గా అనిపించింది. అక్కడికి ఇజ్రాయిల్, జర్మనీ, బ్రిటన్ నుంచి వచ్చిన వాళ్లున్నారు.  బయట ప్రపంచంలో మనం నేర్చుకునేందుకు చాలా వుందని అప్పుడే అర్థమయింది. అలా సోలోగా నేను ఆస్ట్రేలియాకు వెళ్లాను. వేరే దేశాల నుంచి ఇండిపెండెంట్‌గా ట్రావెల్ చేస్తున్న వాళ్లు వచ్చారు. వాళ్లలో చాలా మంది నాకన్నా చిన్నవాళ్లు. తర్వాత 2004లో  నాలుగు నెలలపాటు యూరప్ ట్రిప్‌కి వెళ్లాను. నా లైఫ్‌లో అది చాలా పెద్ద టర్నింగ్ పాయింట్.  సోలో ట్రిప్ గురించి మొదట్లో చెప్పినప్పుడు ఇంట్లో వాళ్లు భయపడ్డారు. అప్పుడు సోలోగా ట్రావెల్ చేస్తున్న వాళ్ల గురించిన వివరాలు వాళ్లకు చెప్పడంతో అంగీకరించారు.

స్కాట్‌లాండ్‌లో...

పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు. ప్రపంచంలో మంచి వాళ్లున్నట్లే, చెడ్డ వాళ్లు కూడా వుంటారు. సహాయం చేసే వాళ్లున్నట్లే, అస్సలు చెయ్యని వాళ్లు కూడా ఎదురవుతుంటారు. యూరప్‌కి వెళ్లినప్పుడు స్కాట్‌లాండ్‌లో ఆరు రోజుల పాటు ఒకరి ఇంట్లో గెస్ట్‌గా వున్నాను. వెళ్లినప్పుడు వాళ్లెవరో నాకు తెలియదు, అక్కడి నుంచి వచ్చేటప్పటికి, ఇప్పుడు వాళ్లు మా కుటుంబసభ్యులుగా మారారు.
 
ఇండియా, అవుట్‌సైడ్ ఇండియా ట్రావెల్ తేడాలు...

 ఇండియాలో ట్రావెల్ చేస్తున్నప్పుడు కొంత ఫెమిలియారిటీ ఫిలింగ్ వుంటుంది. ఇక్కడి ఫుడ్, లాంగ్వేజ్ వేరైనా కొంత పరిచయం వుంటుంది. కరెన్సీ కూడా ఒకటే. అలా ఇండియాలో సోలోగా ట్రావెల్ చెయ్యటం కొంత ఈజీ. అదే వేరే దేశంలో ట్రావెల్ చేస్తున్నప్పడు ఎక్కువ అలర్ట్‌గా వుండాల్సి వుంటుంది. అక్కడ చాలా కొత్త విషయాలు నేర్చుకోవాల్సి వుంటుంది, కరెన్సీతో సహా... లాంగ్వేజ్  వేరే వుంటుంది. అంతర్జాతీయంగా ట్రావెల్ చెయ్యటం  భిన్నమైన అనుభవం. అలాగా కొత్త ప్రపంచాన్ని చూసిన అనుభూతి కలుగుతుంది.
 
అసలు ఎందుకు ట్రావెల్ చెయ్యాలి?

 
మనుష్యుల స్వభావంలోనే ట్రావెల్ పట్ల ఆసక్తి వుంది. మనిషి అన్వేషణ జీవి. కొత్త  ప్రాంతాలు, కొత్త విషయాల పట్ల ఆసక్తి అనేది మన జన్యువులలో ఆ ప్రోగ్రామ్ చేసి వుంది. ప్రపంచంలో 250 దేశాలున్నాయి. ఎన్నో చూడవలసినవి వున్నాయి. ట్రావెల్ ద్వారా మాత్రమే ప్రపంచాన్ని, మనుష్యులను, అనేక సంప్రదాయాలను దగ్గరగా, ఎక్కువగా అర్థం చేసుకునే అవకాశం వుంటుంది. వాతావరణం, గ్లోబల్ వార్మింగ్ ఇలా భౌతిక పరిస్థితుల గురించి కూడా తెలుసుకోగలుగుతాం. ఓపిక, కరుణ, సాటి మనుషుల పట్ల అవగాహన ఏర్పడతాయి. జ్ఞానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. మీకేమయినా డ్రీమ్ ప్లేస్ వుంటే, అక్కడికి వెళ్లడానికి ఎదురుచూస్తూ కూర్చోకండి. ఇప్పుడే రీసెర్చ్ మొదలు పెట్టండి. ఎలా వెళ్లాలి? ఎక్కడికి వెళ్లాలి? ఇలా తెలుసుకుంటేనే వుండండి. అవకాశం రాగానే, వెళ్లడానికి సిద్ధ్దమయిపోవచ్చు.
 
ఇప్పుడు జపాన్ వెళ్లాలనిపిస్తే, 10 ఏళ్లకు అవకాశం వస్తుందని అనుకోవద్దు. ఇక డబ్బుల గురించి అయితే ట్రావెల్‌ని ఒక గోల్‌లా పెట్టుకోండి. ఎంత డబ్బు కావాలో నెట్ ద్వారా తెలుసుకోండి. అలా భవిష్యత్తు కోసం ఎలా సేవ్ చేస్తామో అలా ట్రావెల్ కోసం సేవ్ చేసుకోండి.
 
మరిచిపోలేని ప్లేసెస్
 
థాయిలాండ్‌లో జరిగే ఈపెంగ్ ఫెస్టివల్ వన్ ఆఫ్ బెస్ట్ మెమరబుల్ ఎక్సిపీరియెన్‌స్. అది ఒక లాంతర్ ఫెస్టివల్. నార్త్న్ ్రలైట్స్ కూడా అలా మరచిపోలేని అనుభవమే. అలాగే ఒక పెద్ద ఎడారి, బ్యూటిఫుల్ బీచ్ ఇలా నాచురల్ బ్యూటిఫుల్ ప్లేసెస్ చూసినప్పుడు ఆ దేవుడి సృష్టికి అబ్బురపడిపోతాను. నేను చెప్పదలుచుకున్నదల్లా ఒక్కటే, మనం వెళ్లాలని అనుకుంటే, తప్పకుండా ఎక్కడికైనా వెళ్లగలం. ఆలోచన మొదలు పెట్టటమే తరువాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement