సాఫ్ట్‌వేర్ కార్మికుడి హార్డ్‌కోర్ లైఫ్! | Software worker hardcore Life! | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్ కార్మికుడి హార్డ్‌కోర్ లైఫ్!

Published Wed, Apr 30 2014 11:19 PM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM

సాఫ్ట్‌వేర్ కార్మికుడి హార్డ్‌కోర్ లైఫ్! - Sakshi

సాఫ్ట్‌వేర్ కార్మికుడి హార్డ్‌కోర్ లైఫ్!

పొజెక్ట్ మేనేజర్‌లు, టీమ్ లీడర్‌లు మేకవన్నె పులుల్లా, గోముఖ వాఘ్రాల్లా కనిపిస్తారు!  సమస్యలకు శ్రీకారం బ్యాక్‌పెయిన్, పాతికేళ్ల వయసుకే కళ్లకింద క్యారీబ్యాగుల టెన్షన్! నైట్ డ్యూటీతోనే జుట్టూడుతోందనే విశ్లేషణలు!
 
 కాలేజీ ఉన్నన్ని రోజులూ...ఎప్పుడెప్పుడు ఉద్యోగాలు సాధిద్దామా, డబ్బులు సంపాదిద్దామా అనే ఆరాటం!
 పర్సెంటీజీల గొడవలు, ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్‌ల ఫేక్ ల అనంతరం...
 ఇంటర్వ్యూకు అదృష్టాన్ని కూడా తోడు తీసుకెళ్లి ఉద్యోగం సాధించి, అందులో జాయిన్ అవ్వడం...
 అక్కడ నుంచి
 మొదటి నెల- పనితక్కువ, ఎంజాయ్‌మెంట్ ఎక్కువ!
 రెండో నెల- పని ప్లస్ ఎంజాయ్‌మెంట్...ఓకే!
 మూడో నెల- ఆఫీస్ రాజకీయాలు, పని ఎక్కువవుతోందనే ఫీలింగ్ స్టార్ట్!
  పక్కటీమ్‌లో మేనేజర్ మంచి వాడయ్యుంటాడు!
  అదే టీమ్‌లో అమ్మాయిలు కూడా బాగుంటారు!
  జీతాలు కూడా బాగా పెరుగుతాయంట!
  పనికూడా పెద్దగా ఉండదట!
  మన టీమ్‌లో ఇలాంటి ఊసే లేదే!
 ఎప్పుడూ తోముడు కార్యక్రమమే! జాబ్ వదిలేద్దామనే ఆలోచన మొదలు! ఆన్‌సైట్ నుంచి అర్ధరాత్రి వాయింపులు!
 ప్రొజెక్ట్‌మేనేజర్‌లు, టీమ్ లీడర్‌లు మేకవన్నె పులుల్లా, గోముఖ వ్యాఘ్రాల్లా కనిపిస్తారు! సమస్యలకు శ్రీకారం బ్యాక్‌పెయిన్, పాతికేళ్ల వయసుకే కళ్లకింద క్యారీబ్యాగుల టెన్షన్! నైట్ డ్యూటీతోనే జుట్టూడుతోందనే విశ్లేషణలు!
 ఇంటికి ఒక చుట్టం అయిపోయినట్టే! ఊరెళ్లేది ఎప్పుడో!
 జీతంపడుతూ ఉంటుంది, సంపాదనను ఖర్చులకు ధారపోయగా మిగిలినదాంట్లో తెలివైన వాడు ఐతే హోమ్‌లోన్‌ల మీద, మనలాంటోడు అయితే మందు, సిగరెట్, గాలి తిరుగుడు మీద తగలేస్తాడు
 ఇలా జీవితం బీభత్సమైన ప్రశాంతతతో కొనసాగుతుండగానే ఒక రోజు... కొలీగ్ పెళ్లి సెటిలయ్యిందని పిలుస్తాడు.
 మనకూ ఒక గాల్‌ఫ్రెండ్ ఉంటే బావుండననే కోరిక మదిలో మెదులుతుంది. మన వర్కింగ్  స్పాట్‌లో 95 శాతం నార్తిండియన్స్, పెళ్లైన కేటగిరి!మిగిలిన ఐదు మందిలో నలుగురిని ఫ్రెండ్స్ లేదా అక్క అంటేనే బెటరనేలా ఉంటారు. మిగిలిన ఒక్క అమ్మాయి కోసం టీమ్ అంతా ఊరకుక్కళ్లా కొట్టేసుకుంటాం!
 ఆ అమ్మాయి మాత్రం ఎవరితోనూ కమిటవ్వకుండా, అందరితోనూ చక్కటి అనుబంధాలను గడుపుతూ ఒకరోజు తన బావతో పెళ్ళి అని పెండ్లిపత్రికలు తెచ్చిస్తుంది!
 ఇంకేముంది.. అందరూ కలిసి కూర్చుని మందు కొట్టేసి ఆ అమ్మాయి మంచిది కాదు అని తీర్మానించి, ఇంకో అమ్మాయి గురించి వేట మొదలు...!
 ఇంతలోనే... ఉద్యోగ సమీక్షలు వస్తాయి...‘నువ్వు ఎక్సలెంట్, నువ్వు లేనిదే కంపెనీ లేదు, కత్తి కమాల్... ఇలాంటి ఎగస్ట్రాలు ఎన్నో చెప్పి, ఊరించి చివర్లో ‘బట్’ అంటారు. తీరా చూస్తే నీ జీతంలో ఇంకో సెనక్కాయ పెంచాం పో... అంటారు!
 ఆ రాత్రికి రెజ్యూం అప్‌డేట్ చేయాలి అని గత ఆరు నెలలుగా తీసుకుంటున్న నిర్ణయాన్ని మరోసారి స్మరించి...అలా వచ్చిన సెనక్కాయల మీదే అలా అలా బతికేస్తుంటాము! అప్పుడప్పుడనిపిస్తూ ఉంటుంది...
 మరపురావు కాలేజీ రోజులూ అని...
 (ఫేస్‌బుక్‌లో సర్క్యులేట్ అవుతున్న ఒక పోస్ట్)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement