మీ గుప్పెట బలమెంతో...మీ గుండె బలమూ అంత! | strenth of heart is the strenth of the hand | Sakshi
Sakshi News home page

మీ గుప్పెట బలమెంతో...మీ గుండె బలమూ అంత!

Published Sun, Jun 14 2015 11:16 PM | Last Updated on Sun, Sep 3 2017 3:45 AM

మీ గుప్పెట బలమెంతో...మీ గుండె బలమూ అంత!

మీ గుప్పెట బలమెంతో...మీ గుండె బలమూ అంత!

ఎవరి గుండె సైజు దాదాపు వారి గుప్పెడంత పరిణామంలో అని అందరూ అంటుంటారు. ఇప్పుడు పిడికిలి బిగించే సామర్థ్యానికీ, గుండె సామర్థ్యానికీ కూడా సంబంధం ఉంటుందంటున్నారు అంతర్జాతీయ పరిశోధకులు. మీకు పిడికిలి బిగించే శక్తి ఎక్కువగా ఉంటే మీ గుండెబలమూ అంతే ఎక్కువట. పిడికిలి బిగింపు సామర్థ్యం తగ్గుతున్న కొద్దీ గుండెజబ్బులు పెరగడం, గుండెపోటు వచ్చేందుకు అవకాశాలు పెరగడం జరుగుతుందట. ప్రపంచవ్యాప్తంగా 35 నుంచి 70 ఏళ్ల వయసున్న  1,39,601 మందిపై నిర్వహించిన ఒక అధ్యయనంలో ఈ విషయం తెలిసింది.

వారందరి చేత హ్యాండ్‌గ్రిప్ డైనమోమీటర్ ద్వారా పిడికిలి బిగింపు సామర్థ్యాన్ని పరీక్షించి చూశారు. పిడికిలి బిగించే సామర్థ్యం తగ్గుతున్న క్రమంలో ప్రతి ఐదు కిలోల తగ్గుదలతో గుండెజబ్బులు పెరిగే అవకాశం 16 శాతం పెరుగుతుంది. అలాగే గుప్పిట బిగింపు శక్తి సన్నగిల్లే క్రమంలో పక్షవాతం (స్ట్రోక్) వచ్చే అవకాశాలు 9 శాతం పెరుగుతాయి. ఇక గుండెపోటు వచ్చే అవకాశాలు 7 శాతం పెరుగుతాయి. ఈ అధ్యయన ఫలితాలన్నీ ‘ద ల్యాన్సెట్’ అనే ప్రముఖ మెడికల్ జర్నల్‌లో చోటు చేసుకున్నాయి.

Advertisement

పోల్

Advertisement