సు.. ష్‌ష్‌ష్‌ | susmitha sen connection with rithik! | Sakshi
Sakshi News home page

సు.. ష్‌ష్‌ష్‌

Published Sat, Nov 25 2017 1:33 AM | Last Updated on Sat, Nov 25 2017 1:33 AM

susmitha sen connection with rithik! - Sakshi

రితిక్‌ భాసిన్‌... ఈ మనిషికీ, సుస్మితాసేన్‌కి ఏమైనా సంబంధం ఉందా? చెప్పుకోండి చూద్దాం. సంబంధం ఉందని కొట్టుకుని చస్తోంది బాలీవుడ్‌ మీడియా. మీకూ మాకూ తెలియకుండా సుస్మితకు, రితిక్‌ భాసిన్‌కి వాటీస్‌ ద కనెక్షన్‌? మనం కనెక్షన్‌ ఉందీ అని తెలుసుకునే లోపలే, బాలీవుడ్‌లో ఏకేవాళ్లంతా కనెక్షన్‌ పీకేస్తున్నారు.

ఇద్దరూ కలిసి ఉంటున్నారని, కలిసో ఇల్లు కొనుక్కున్నారనీ, కలిసి రొమాన్స్‌ చేస్తున్నారనీ, కలిసి కలలు కన్నారనీ, కలిసి ఉండబోతున్నారనీ ఏకిందీ ఈ మహానుభావులే... ఆర్నెల్ల నుంచీ కలవట్లేదనీ, సిక్స్‌ మంత్స్‌ నుంచీ కలుసుకోవడం లేదనీ, ట్వంటీ సిక్స్‌ వీక్స్‌ నుంచీ రిలేషన్‌ చాలా వీక్‌ అయిపోయిందనీ, వీగిపోయిందనీ కూడా ఇప్పుడు పీకుతున్నారు! ‘ఆర్నెల్ల ‘అసావాసం’! వారిని వారిగా, వీరిని వీరుగా చేస్తుంది. ఎవరిని వారిగా ఉంచుతుంది’ అని వాళ్ల ఆర్గ్యుమెంట్‌.

సుస్మిత మాత్రం.. ‘పదహారేళ్ల వయసు నుంచీ నేను చాలా రొమాంటిక్‌ అనీ, పెళ్లంటే నాకు చాలా లవ్‌లీ ఫీలింగ్‌ అనీ, కానీ ఎప్పుడూ తొందరపడలేదనీ, కరెక్ట్‌ టైమ్‌లో పెళ్లి అవుతుందని నమ్ముతున్నాననీ’ అంటోంది. పెళ్లికి కండిషన్‌లు ఉండకూడదనీ, పెళ్లి చేసుకోవడం ఖాయం అనీ ఇప్పుడైతే.. లైఫ్‌ ఎగ్జయిటింగ్‌ గానే ఉందని సు...ష్‌ష్‌ష్‌ సైలెన్స్‌ బ్రేక్‌ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement