susmita sen
-
తల్లిగా ఉండటమే గొప్ప- సుస్మితా సేన్
ఈ రోజుల్లో పిల్లల పెంపకం పెద్దలకు ఓ సమస్యగా ఉంటే తమ కెరియర్ను వృద్ధి చేసుకుంటూనే పిల్లలను పెంచడం ఒంటరి తల్లులకు అతిపెద్ద సవాల్‌తో కూడుకున్నదని దాదాపు 70 శాతం ఒంటరి తల్లిదండ్రులు తమ ఉద్యోగావకాశాలను వదులుకోవడానికి కారణం ఇదే అని స్పష్టం చేసింది న్యూయార్క్ కెరీర్ మైండ్స్ అధ్యయనం. గ్లోబల్వైజ్గా టెక్ కంపెనీలలో ఉద్యోగావకాశాలను కల్పించే ఈ సంస్థ తమ ఇంటర్వ్యూలలో పాల్గొనే సింగిల్ పేరెంట్స్ పిల్లల కోసం ఉద్యోగాలను వదులుకుంటున్నారనే విషయాన్ని స్పష్టం చేసింది. ఒంటరి తల్లిదండ్రులు తమ కెరియర్ను కాపాడుకుంటూనే పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిపుణులు సూచనలు ఇస్తున్నారు.ఒంటరిగా పిల్లలను పెంచడం చాలా కష్టమైన టాస్క్. ముఖ్యంగా ఒంటరి తల్లుల్లో భావోద్వేగ సమతుల్యత తప్పనిసరి. క్రమశిక్షణలో ఉంచాలా? లేక ప్రేమ, ఆప్యాయతలను చూపాలా.. అనే కన్ఫ్యూజన్లో ఉంటారు. ఒంటరి తల్లులు అప్పటికే జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని ఉంటారు కాబట్టి క్రమశిక్షణతో పెంచాలనుకుంటారు.కఠినమైన శిక్షణ కూడదునేను కరెక్ట్‌గా ఉంటేనే నా పిల్లలను బాగా పెంచగలను అనుకునే దోరణిలో పేరెంటింగ్ కూడా సవాల్‌గా తీసుకుంటున్నారు. అయితే, ఈ విధానం వల్ల తరచూ భయాందోళనకు లోనవుతుంటారు. ఫలితంగా ప్రతి చిన్న విషయంలోనూ ఉద్వేగానికి లోనవుతుంటారు. వీళ్లు తమని తాము ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలుసుకోవాలి. ఎవరి సపోర్ట్ లేకుండా ‘సూపర్ ఉమన్’లాగా ఉండాలనుకోవడం అన్ని సందర్భాలలో కుదరదు. శారీరకంగానూ, మానసికపరమైన సమస్యలతోనూ ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అందుకని, తమ పెద్దవారి మద్దతు తీసుకోవడం అవసరం. కఠినమైన క్రమశిక్షణ వల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరిగే అవకాశం ఉంది.సమతుల్యత తప్పనిసరిఇంట్లో ఉన్నప్పుడు ఆఫీస్ వర్క్‌ని పిల్లల ముందుకు తీసుకురాకూడదు. సింగిల్‌గా ఉండటం వల్ల పెద్దలు ఫోన్లోనే ఎక్కువ సమయం గడుపుతుంటారు. దీనివల్ల పిల్లలు ‘తామేదో కోల్పోతున్నాం’ అనే భావనలో ఉంటారు. పిల్లలు పెద్దలను గమనిస్తుంటారు అని గుర్తుంచుకోవాలి. ‘అమ్మకు నాకన్నా ఫోన్ లేదా వర్క్ అంటేనే ఎక్కువ ఇష్టం’ అనే ఆలోచన పిల్లల్లో రానీయకూడదు.అభిప్రాయాలను తీసుకోవాలిపిల్లలు చిన్నవాళ్లు కదా అనుకోకుండా వాళ్ల అభిప్రాయాలు కూడా తీసుకోవాలి. ఇంటి నిర్ణయాల్లో వారిని పాలుపంచుకోనివ్వాలి. దీనివల్ల తమను నిర్లక్ష్యం చేయడం లేదు అనే ఆలోచన పిల్లల్లో కలుగుతుంది. ఇంట్లో ఏ మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నట్లు అనిపించినా బయట వెతుక్కుంటారు.తమ మాటే వినాలనుకోవద్దుఒంటరి తల్లుల పెంపకంలో పిల్లలు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు ఎక్కువ. పిల్లలు నా మాట వినాలనే ఆలోచనతో పూర్తిగా పిల్లలు చెప్పినట్టు వినడం...లేదంటే తాము ఒక రూలర్‌గా ఉండాలను కుంటారు. టీనేజ్ దశలో ఈ గ్రాఫ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఈ విధానం వల్ల పిల్లలను ఎలా హ్యాండిల్ చేయాలో పెద్దవాళ్లకు తెలియడం లేదు. కానీ, పెద్దలను ఎలా హ్యాండిల్ చేయాలో పిల్లలకు బాగా తెలుసు. పిల్లలు ఇద్దరుంటే వారిద్దరినీ సమానంగా చూడాలి. వీలున్నప్పుడల్లా వారిద్దరికీ టైమ్ కేటాయించి వారి ప్రతి అవసరాన్నీ తీర్చాలి. నమ్మకం ముఖ్యంపిల్లల అవసరాలు తెలుసుకొని సాధ్యమైనంతవరకు వాటిని పూర్తి చేయాలి. పిల్లల ఆలోచనా విధానాన్ని పంచుకునే విధానం ఇంట్లో ఉండాలి. స్నేహపూర్వకమైన వాతావరనంలో రోజులో కనీసం పది నిమిషాలైనా పిల్లల కోసం సమయం కేటాయించాలి. తమ పని గురించి చెబుతూనే పిల్లల విషయాలనూ పట్టించుకోవాలి. అప్పుడే ఏదో కోల్పోతున్నామనే భావన పిల్లల్లో కలగకుండా పెరుగుతారు. -ప్రొఫెసర్ జ్యోతిరాజ,సైకాలజిస్ట్, లైఫ్‌స్కిల్ ట్రెయినర్ తల్లిగా ఉండటమే గొప్పఇద్దరు అమ్మాయిలను ఒంటరితల్లిగా పిల్లలను పెంచుతూనే, తన కెరియర్‌నూ బిల్డ్ చేసుకుంటున్న బాలీవుడ్ నటి సుస్మితాసేన్ స్ఫూర్తిదాయకమైన విషయాలనూ సోషల్‌మీడియా ద్వారా తెలియజేసింది. ‘ప్రతిరోజూ ఒక తల్లిగా నన్ను నేను భుజం తట్టుకునే పని ఏం చే యాలనేది ముందే నిర్ణయించుకుని, అది పూర్తి చేస్తాను. నా పిల్లలకన్నా నాకు ఎక్కువ తెలుసు అనుకోను. వారి ద్వారా కూడా ప్రతిరోజూ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాను. ఇలా ఉండటం వల్ల నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేనొక కళాకారిణిగా కన్నా తల్లిగా ఉండటమే గొప్పగా భావిస్తాను. ఆ రోజంతా ఎన్ని పనులు చేసినా పిల్లల వద్దకు వస్తూనే అన్నీ దులిపేసుకొని వారి ముందు ప్రేమగా ఉంటాను.’– సుస్మితాసేన్ -
స్వతంత్ర భారతి: 1994/2022 సౌందర్య కిరీటాలు
సౌందర్య కిరీటాలు ప్రపంచ వేదిక మీద భారతీయ సౌందర్యం విరాజిల్లింది. సుస్మితాసేన్ విశ్వ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకోవడం, ఆ వెంటనే ఐశ్వర్యా రాయ్ ప్రపంచ సుందరిగా వన్నెకెక్కడంతో అంతర్జాతీయ అందాల పోటీలలో భారతదేశం విజయ బావుటా రెపరెపలాడటం మొదలైంది. అప్పటికి 28 ఏళ్ల కిందట రీటా ఫారియా ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా అవతరించారు. ఆ సందర్భం దేశ ప్రజల స్మృతిపథంలో చెరిగిపోతున్న దశలో 1994 లో దేశం నుంచి సరికొత్త అందాల రాణులు ప్రపంచ వేదికల మీద రాణించడం మొదలైంది. ఆ ఏడాదితో భారతదేశంలో అందాల తయారీ పరిశ్రమ ఊపందుకుంది. భారతీయ యువతులను ఈత దుస్తుల్లో మెరిసిపోయే సుందరాంగులుగా తీర్చిదిద్దడం మొదలైంది. ఆ పరిశ్రమ ఫలితాలుగా డయానా హైడెన్, యుక్తాముఖి, ప్రియాంక చోప్రా, లాలా దత్తా, మానుషీ చిల్లర్ మన ప్రపంచ సుందరీమణులుగా విజేతలౌతూ వస్తున్నారు. ఆ ప్రకంపనలు దేశవ్యాప్తంగా రెండు రకాలైన ప్రతిధ్వనులుగా వినిపించాయి. ఒకటి అనుకూలం. ఇంకోటి ప్రతికూలం. సైన్యంలోకి పృథ్వి పృథ్వి క్షిపణిని భారత సైన్యంలోకి ప్రవేశపెట్టారు. ‘రిపబ్లిక్ డే’ని అందుకు తగిన సందర్భంగా ఎంచుకుని ఢిల్లీ పరేడ్ గ్రౌండ్స్‌లో పృథ్విని ప్రదర్శించారు. (చదవండి: ఎయిర్‌పోర్ట్‌కి శంకర్ పేరు) -
21 ఏళ్ల చిన్నవాడితో ప్రేమ.. అయితే ఏంటి?!
(వెబ్ స్పెషల్): ‘‘ప్రేమకు అర్థం ఏదంటే నిన్నూ నన్నే చూపిస్తా.. అడ్డొస్తే ఆ ప్రేమైనా నా చేతుల్తో నరికేస్తా’’ అంటూ ప్రణయ బంధంలో మునిగిపోయిన జంట భావావేశాన్ని చక్కగా వర్ణించాడో సినీకవి. ఒక లైలా- మజ్నూ, ఒక రోమియో- జూలియట్, ఒక సలీం- అనార్కలి.. ఇలా అనాదికాలం నుంచి నేటి స్మార్ట్ యుగం వరకు దాదాపుగా ప్రతీ లవ్‌స్టోరీలోనూ ప్రేమికులు అచ్చంగా ఇవే పదాలు కాకపోయినా.. ఇదే అర్థంతో కూడిన పాటలు పాడుకుని ఉంటారు. అవును మరి.. ప్రేమలో ఉన్న మాధుర్యం అలాంటిది. కుల, మత, జాతి, వర్గాలకు ఆఖరికి వయస్సుకు అతీతంగా ఎవరిపై ఎప్పుడు ప్రేమ పుడుతుందో చెప్పడం కాస్త కష్టమే. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఇలాంటి ప్రేమకథలు ఎక్కువగానే ఉన్నాయి. అంతేకాదు తమకంటే తక్కువ వయస్సున్న పురుషులను పెళ్లాడిన, ప్రేమిస్తున్న సెలబ్రిటీలు కూడా చాలా మందే ఉన్నారు. వారిలో కొందరు.. పిగ్గీచాప్స్ మెచ్చిన వరుడు! ప్రియాంక చోప్రా(38).. ఇరవై ఏళ్ల క్రితమే ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా పతాక శీర్షికల్లోకెక్కింది. 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్న ఈ అందాల భామ ఆ తర్వాత సినిమాల్లో అడుగుపెట్టింది. ఎన్నో ఆటుపోట్లు చవిచూసి స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. హీరోయిన్గా సిల్వర్ స్క్రీన్‌పై తన అందం, అభినయంతో కుర్రకారుకు ఆరాధ్య దేవతగా మారిపోయిన పిగ్గీచాప్స్.. తనకంటే పదేళ్లు చిన్నవాడైన హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్‌పై మనసు పారేసుకుంది. హాలీవుడ్‌లోనూ సత్తా చాటి గ్లోబల్‌స్టార్‌గా ఎదిగిన ఆమె ఓ అవార్డు ఫంక్షన్‌కు నిక్‌తో కలిసి హాజరై అందరినీ ఆశ్చర్యపరిచింది. (చదవండి: ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ వీరే) ఈ జంటను చూసినవాళ్లంతా ఇదంతా డేటింగ్లో భాగమేనని, నిక్ అప్పటికే మాజీ మిస్ యూనివర్స్ ఒలీవియా కల్పోతో పాటు ప్రముఖ సింగర్ సెలీనా గోమెజ్‌తోనూ ప్రేమాయణం నడిపి ఉండటంతో.. ప్రియానిక్ పెళ్లిదాకా వస్తారా అంటూ అనేక సందేహాలు వ్యక్తం చేశారు. అయితే వాటన్నింటిని పటాపంచలు చేస్తూ 2018 డిసెంబరులో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వయసు వ్యత్యాసం కారణంగా ఎన్నోసార్లు విపరీతమైన ట్రోలింగ్ బారినపడినప్పటికీ అవేమీ పట్టించుకోకుండా రోజురోజుకీ తమ బంధాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారీ స్టార్ కపుల్. సుస్మితా సేన్ వలచిన ఘనుడు! ఇండియాకు తొలి మిస్ యూనివర్స్ కిరీటాన్ని తెచ్చిపెట్టిన సుస్మితా సేన్(44) ప్రస్తుతం రోహమన్ షాల్ అనే యువ మోడల్‌తో ప్రేమలో ఉన్నారు. దాదాపుగా రెండేళ్లుగా వీరి బంధం కొనసాగుతోంది. అంతకుముందు చాలా మందితో డేటింగ్ చేసినప్పటికీ సుస్మిత ఎవరితోనూ తన బంధాన్ని పెళ్లిపీటల వరకు తీసురాలేదు. అయితే రోహమన్ విషయంలో మాత్రం ఆమె సీరియస్‌గానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే అందంతో పాటు మంచి మనసున్న ‘తల్లి’అయినటువంటి సుస్మిత ఇద్దరు కూతుళ్లు(దత్తత) రీనీ, అలీషాలకు అతడు తండ్రి ప్రేమను పంచుతుండటమే ఇందుకు కారణమట. అందుకే తనకంటే దాదాపు పదిహేనేళ్లు చిన్నవాడైనప్పటికీ రోహమన్‌ను పెళ్లాడేందుకు సుస్మిత సుముఖంగానే ఉందంటూ బీ-టౌన్ టాక్. అయితే అది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఎదురు చూడాల్సిందే. మలైకా మనసు దోచిన అర్జున్! చయ్య.. చయ్య పాటతో కుర్రకారును ఉర్రూతలూగించిన మలైకా అరోరా(46).. ‘కెవ్వు కేక’ పాటతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైపోయింది. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకుందీ భామ. వీరిద్దరికి అర్హాన్ ఖాన్ అనే పేరు గల టీనేజ్ కొడుకు కూడా ఉన్నాడు. అయితే అర్బాజ్‌తో వైవాహిక బంధం కొనసాగిస్తున్న తరుణంలోనే నటుడు అర్జున్ కపూర్‌తో ఆమె పరిచయం.. అంతలోనే భర్త సైతం వేరే మహిళకు దగ్గరకావడంతో వీరిరువురి మధ్య దూరం పెరిగింది. దీంతో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుందీ జంట. ఇక అప్పటి వరకు గుట్టుగా తిరిగిన ప్రేమపక్షులు మలైకా- అర్జున్‌కు పూర్తి స్వేచ్ఛ వచ్చినట్లయింది. అయితే తమ ప్రణయ బంధం ఎక్కడా నేరుగా ప్రస్తావించకుండానే.. కలిసి డిన్నర్లు చేస్తూ, టూర్లతో వెళ్తూ ఫొటోగ్రాఫర్లకు బాగా పనిచెప్పారు. అయితే మలైకా పెళ్లి- విడాకుల కంటే కూడా.. అర్జున్ కన్నా ఆమె వయసులో పన్నెండేళ్లు పెద్దది కావడం మూలాన్నే ఎక్కువసార్లు ట్రోలింగ్ బారిన పడింది. ఇక ఇటీవల అర్జున్- మలైకా ఇద్దరికీ కరోనా పాజిటివ్‌గా తేలడంతో రావడంతో ట్రోల్స్ శృతిమించాయి. అయినా వీటిని ఏమాత్రం లెక్కచేయకుండా ఈ లవ్‌బర్డ్స్ ముందుకు సాగుతున్నారు. అన్నట్లు అర్జున్ ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కుమారుడన్న సంగతి తెలిసిందే. కలల రాకుమారుడిని భర్తగా పొందిన నమ్రత మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్(48) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వెండితెరపై నటిగా ప్రస్థానం ప్రారంభించిన నమ్రత పలు దక్షిణాది సినిమాల్లోనూ కనిపించారు. అయితే అనతికాలంలోనే నటనకు గుడ్‌బై చెప్పి.. టాలీవుడ్ సూపర్‌స్టార్, అమ్మాయిల కలల రాజకుమారుడైన మహేష్ బాబును ప్రేమపెళ్లి చేసుకున్నారు. ఆమె తన భర్త కంటే మూడేళ్లు పెద్దవారు. ఇక వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు గౌతం కృష్ణ, సితార. కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే నమ్రత తన ఫ్యామిలీకి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూ చాలా యాక్టివ్‌గా ఉంటారు. అందాల రాశి ఐశ్వర్య అభీకే సొంతం! అందానికే అసూయ పుట్టించే అందం ఐశ్వర్యా రాయ్(46) సొంతమనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి అందగత్తెను పెళ్లి చేసుకోవాలని చాలా మంది ఉవ్విళ్లూరారు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ అయితే ఆమె ప్రేమ కోసం పిచ్చివాడైపోయాడట. కానీ ఈ మాజీ మిస్ వరల్డ్‌ను వివాహమాడే అదృష్టం మాత్రం బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్‌నే వరించింది. వీరిద్దరు కలిసి నటించిన‘గురు’సినిమా సెట్లో తన దగ్గర ఉన్న ఓ ఉంగరాన్ని బహూకరించి.. ఐష్‌కు ప్రపోజ్ చేసిన అభిషేక్.. ఆమె అంగీకారం లభించగానే పెద్దల్ని ఒప్పించి పెళ్లిచేసుకున్నాడు. వీరిరద్దరికి ఆరాధ్య అనే ముద్దుల కూతురు ఉంది. అన్నట్లు అభిషేక్.. ఐశ్వర్య కంటే రెండేళ్లు చిన్నవాడు. ఇక వీళ్లతో పాటు పలువురు హాలీవుడ్ నటీమణులు కూడా వయస్సులో తమకంటే చిన్నవాళ్లైన పురుషులతో బంధం కొనసాగిస్తున్నారు. గేబ్రియెల్ యూనియన్- డ్వేన్ వాడే దంపతులు(9 ఏళ్ల వ్యత్యాసం), షకీరా- గెరాడ్ పిక్(10 ఏళ్లు), కోర్ట్నీ కర్దాషియాన్- యూనస్ బెడ్జిమా(14 ఏళ్లు), జడా పింకెట్ స్మిత్- ఆగస్ట్ అల్సీనా(21 ఏళ్లు), లీసా బానెట్- జాసన్ మొమోవా దంపతులు(12 ఏళ్లు) తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. -
పదేళ్ల తర్వాత సుస్మితా వెబ్ సిరీస్‌లో..
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ పదేళ్ల తర్వాత తన సెకండ్ ఇన్సింగ్స్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. డిస్నీ, హాట్‌స్టార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ఆర్య’ అనే వెబ్ సిరీస్‌తో సుష్మిత డిజిటల్ రంగంలోకి అరంగేట్రం చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా సుస్మితా తాను నటించిన ‘ఆర్య’ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్‌ను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా లో పొస్ట్ చేశారు. ‘మీ (అభిమానుల) వల్లనే నేను ఉన్నాను. అతి త్వరలో హాట్ స్టార్‌లో నేను నటించిన ‘ఆర్య’ వెబ్ సిరీస్ రాబోతుంది’ అని కామెంట్ జత చేశారు. (YOLO అంటోన్న సోనూసూద్) ఇక రామ్ మాధ్వనీ దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్య’ వెబ్ సిరీస్‌లో సుస్మితా టైటిల్ రోల్ చేస్తున్నారు. గత డిసెంబర్లో ఈ వెబ్ సిరీస్ షూటింగ్ జరిగింది. రాజస్థాన్ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ఉంటుంది. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ సుస్మితా కెమెరా ముందుకు వచ్చారు. 2010లో వచ్చిన ‘నో ప్రాబ్లమ్’ సినిమా తర్వాత లీడ్ రోల్‌కి నటిగా మేకప్ వేసుకోలేదామె. View this post on Instagram “To turn her world upside down” #badidea 👊 New home, New ropes!!! #aarya ❤️ Hotstar Specials @disneyplushotstarvip @officialrmfilms #hotstarspecialsaarya #comingsoon I love you guys!!! 😍 AARYA 🎵#firstlook #yourstruly A post shared by Sushmita Sen (@sushmitasen47) on Jun 2, 2020 at 8:01am PDT -
‘బతకాలంటే స్టెరాయిడ్స్ తప్పవన్నారు’
2014 నుంచి రెండేళ్ల పాటు తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డానని అంటున్నారు మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్. స్టెరాయిడ్స్‌తోనే జీవితాంతం బతకాలని వైద్యులు చెప్పారని, ఆ సమయంలో ఎంతో నరకం అనుభవించానని ఆమె పేర్కొన్నారు. ఓ ఆంగ్ల మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు సుస్మిత. ‘‘నిర్బాక్’ అనే బెంగాలీ చిత్రంలో నటించిన తర్వాత అస్వస్థతకు గురయ్యాను. ఏం జరిగిందో తెలీలేదు. ఆ తర్వాత పలు వైద్య పరీక్షలు చేయించుకున్నాను. అడ్రినల్ గ్రంథుల పనితీరు ఆగిపోయిందని అన్నారు. ఆ ప్రభావం నా అవయవాలపై చూపింది. మాటిమాటికీ కళ్లు తిరిగి పడిపోతుండేదాన్ని. దాంతో ఇక బతికినంత కాలం హైడ్రోకోర్టిసోన్ అనే స్టెరాయిడ్ తీసుకోవాలని సూచించారు వైద్యులు. ఎనిమిది గంటలకోసారి స్టెరాయిడ్ తీసుకోవాలి. లేకపోతే బతకనని వైద్యులు చెప్పారు’ అని పేర్కొన్నారు సుస్మిత. ‘కానీ ఆ స్టెరాయిడ్ వల్ల చాలా బరువు పెరిగాను, జుట్టు రాలిపోయేది. నేను సాధరణ మహిళనయితే అంతగా బాధపడేదాన్ని కాదు. కానీ నేను మాజీ విశ్వసుందరిని. నా ఆకారం చూసి ఏదో అయిపోయిందనుకుంటారని బయటికి రాలేకపోయాను. ఎలాగైనా కోలుకోవాలనుకున్నాను. చికిత్స నిమిత్తం జర్మనీ, లండన్ వెళ్లాను. ఆరోగ్యం కోసం ఏరియల్ సిల్క్ అనే యోగా సాధన చేశాను. వైద్యులు అవి చేయొద్దని సూచించినా నేను వినలేదు. 2016 చివర్లో తీవ్ర అనారోగ్యానికి గురై కళ్లు తిరిగి పడిపోయాను. ఆ సమయంలో నేను అబుదాబిలో ఉన్నాను. నన్ను వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. కొన్ని చికిత్సల తర్వాత నన్ను డిశ్చార్జి చేశారు. ఓసారి నేను తిరిగి భారత్‌కు వస్తుంటే నాకు చికిత్స చేసిన డాక్టర్ ఫోన్ చేసి చాలా సంతోషకరమైన వార్త చెప్పార’న్నారు. ‘ఆ డాక్టర్ ఫోన్లో ‘సుస్మిత.. ఇక నువ్వు ఆ స్టెరాయిడ్ మందులు వాడటం ఆపెయ్. ఎందుకంటే నీ ఒంట్లో అడ్రినల్ గ్రంథుల పనితీరు మెరుగుపడింది. కంగ్రాట్స్’ అని చెప్పారు. అది విన్నాక నా ఆనందానికి అవధుల్లేకుండాపోయింది. సాధారణంగా ఇలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కోలుకోవడం చాలా కష్టం. కానీ నేను కోలుకున్నాను’ అని వెల్లడించారు సుస్మిత. -
మీటూ: మాజీ ప్రపంచ సుందరికి భారీ ఊరట
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి, మాజీ ప్రపంచ సుందరి సుస్మితా సేన్‌కు భారీ ఊరట లభించింది. కోకా కోలా కంపెనీ నుంచి పరిహారంగా లభించిన మొత్తంపై పన్ను చెల్లింపుపై ఇన్‌కం టాక్స్ అప్పెల్లా ట్రిబ్యునల్ (ఐటీఏటి) ఉపశమనం కల్పించింది. నష్టపరిహారంగా వచ్చిన ఆదాయంగా చూడలేమని దీనిపై పన్నుచెల్లించాల్సిన అవసరంలేదని ట్రిబ్యునల్ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో సుస్మితా సేన్‌కు లైంగిక వేధింపుల కేసులో నష్టపరిహారంగా వచ్చిన రూ.95లక్షలు ఆదాయం కిందికి రాదని వెల్లడించింది. కాబట్టి పన్నుకట్టనక్కలేదంటూ ఆమెపై విధించిన రూ. 35 లక్షల జరిమానాను కొట్టి వేసింది. ఆదాయపు పన్ను చట్టం, 1961 సెక్షన్ 28ప్రకారం , 2(24) పరిహారాన్ని ఆదాయంగా పేర్కొనలేమని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. కోకా కోలా ఇండియా ఉద్యోగిపై లైంగిక ఆరోపణ కేసులో 2003-04లో, సుస్మితా సేన్‌క కంపెనీ రూ. 1.45 కోట్లు చెల్లించింది. ఇందులో 50లక్షల రూపాయల ఆదాయపన్ను కింద మినహాయించి రూ. 95 లక్షల నష్టపరిహారాన్ని సుస్మితా అందుకున్నారు. అయితే దీన్ని సుస్మితా సేన్ ఐటీ ఫైలింగ్‌లో ప్రకటించలేదంటూ ఆదాయన పన్నుశాఖ పెనాల్టీ విధించింది. -
స్త్రీగా పుట్టడమే ఓ అవార్డ్..
స్త్రీగా పుట్టడమే ఓ అవార్డ్ అంటున్నారు మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్. ఓ అవార్డ్ ఫంక్షన్లో ఈ మాట చెప్పారామె. అలాగే ప్రస్తుతం స్త్రీలపై జరుగుతున్న ఆకృత్యాలపై ఆమె స్పందిస్తూ – ‘‘ప్రతీరోజు ఎన్నో రేప్‌లు జరగడం చూస్తున్నాం. ఈ విషయం గురించి నా ఒపీనియన్ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే మన ఒపీనియన్స్, నిరసన తెలియజేస్తూ ఉంటే ఏ పనీ జరగదు. దానికి బదులు ఇవి ఆగడానికి సరైన పరిష్కారం వెతికితే బాగుంటుంది. ప్రపంచం మొత్తం మీద, మన దేశంతో సహా కొన్ని కొన్ని జీర్ణించుకోలేని సంఘటనలు జరుగుతున్నాయి. ఇలా జరుగుతున్నప్పుడు మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. అయ్యో.. ఇలా జరిగిందే? అని బాధపడి మర్చిపోవటం. మరొకటి ఇలాంటి క్రైమ్స్‌కి పాల్పడే వాళ్ల గురించి పదే పదే చర్చించడం మానేసి, సొసైటీలో స్త్రీలకు సహాయంగా ఉంటూ, గౌర వించే మగవాళ్లను హైలైట్ చేస్తూ మాట్లాడటం. అప్పుడు తప్పుడు దోవలో వెళుతున్న మగవాళ్లలో ఆలోచన రేకెత్తించగలుగుతాం. మంచి దోవలో వెళితే మన గురించి కూడా ఇలా నాలుగు మంచి మాటలు మాట్లాడతారు కదా అనే భావనని కలిగించగలుగుతాం అని నా ఫీలింగ్. ఈ విధంగా ఎంతో కొంత మంచి మార్పుని ఎక్స్పెక్ట్ చేయొచ్చు’’ అని అన్నారు సుస్మితా సేన్. -
సు.. ష్ష్ష్
రితిక్ భాసిన్... ఈ మనిషికీ, సుస్మితాసేన్‌కి ఏమైనా సంబంధం ఉందా? చెప్పుకోండి చూద్దాం. సంబంధం ఉందని కొట్టుకుని చస్తోంది బాలీవుడ్ మీడియా. మీకూ మాకూ తెలియకుండా సుస్మితకు, రితిక్ భాసిన్‌కి వాటీస్ ద కనెక్షన్? మనం కనెక్షన్ ఉందీ అని తెలుసుకునే లోపలే, బాలీవుడ్లో ఏకేవాళ్లంతా కనెక్షన్ పీకేస్తున్నారు. ఇద్దరూ కలిసి ఉంటున్నారని, కలిసో ఇల్లు కొనుక్కున్నారనీ, కలిసి రొమాన్స్ చేస్తున్నారనీ, కలిసి కలలు కన్నారనీ, కలిసి ఉండబోతున్నారనీ ఏకిందీ ఈ మహానుభావులే... ఆర్నెల్ల నుంచీ కలవట్లేదనీ, సిక్స్ మంత్స్ నుంచీ కలుసుకోవడం లేదనీ, ట్వంటీ సిక్స్ వీక్స్ నుంచీ రిలేషన్ చాలా వీక్ అయిపోయిందనీ, వీగిపోయిందనీ కూడా ఇప్పుడు పీకుతున్నారు! ‘ఆర్నెల్ల ‘అసావాసం’! వారిని వారిగా, వీరిని వీరుగా చేస్తుంది. ఎవరిని వారిగా ఉంచుతుంది’ అని వాళ్ల ఆర్గ్యుమెంట్. సుస్మిత మాత్రం.. ‘పదహారేళ్ల వయసు నుంచీ నేను చాలా రొమాంటిక్ అనీ, పెళ్లంటే నాకు చాలా లవ్లీ ఫీలింగ్ అనీ, కానీ ఎప్పుడూ తొందరపడలేదనీ, కరెక్ట్ టైమ్‌లో పెళ్లి అవుతుందని నమ్ముతున్నాననీ’ అంటోంది. పెళ్లికి కండిషన్లు ఉండకూడదనీ, పెళ్లి చేసుకోవడం ఖాయం అనీ ఇప్పుడైతే.. లైఫ్ ఎగ్జయిటింగ్ గానే ఉందని సు...ష్ష్ష్ సైలెన్స్ బ్రేక్ చేసింది. -
వివరం: తెలుగు తెలుగే కనెక్షన్
పదేళ్ల తర్వాత, ‘మనం’ అంటే ఎవరిని ప్రతిబింబిస్తుందో ఇప్పుడు చెప్పడం కష్టం. ఇప్పటికైతే మనం అంటే మనమే! భాషగా తెలుగువాళ్లమే!! ప్రాంతంగా భారతీయులమే!!! ఇలాంటి ‘మనవాళ్లు’ వీరందరూ! వీళ్లంతా తెలుగువాళ్లు; లేదా, తెలుగు నేలతో ముడిపడినవాళ్లు; వీళ్లకు తెలుగుతో సంబంధముందని చెబితే, ‘అవునా’ అని ఆశ్యర్యం పుట్టించేవాళ్లు. అందులో కొందరి గురించైనా కొంతమేరకు ఈ ప్రత్యేక కథనం. బెంగాలీ అమ్మాయి సుస్మితాసేన్‌కు 1994లో ‘విశ్వ సుందరి’ కిరీట ధారణ జరిగినప్పుడు, హైదరాబాద్‌లో కూడా ఆనందం వెల్లివిరిసింది; ఆమెను పల్లకీలో కూడా ఎక్కించి తిప్పారు. కారణం? సుస్మిత కళ్లు తెరిచింది హైదరాబాద్ నగరంలో. వాళ్ల నాన్న శువేర్ సేన్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగంలో భాగంగా ఇక్కడ పనిచేస్తున్నప్పుడు సుష్ పుట్టింది. అదీ విషయం! కోపం ప్రదర్శించడానికి కారణాలు కావాలిగానీ, సంతోషం పంచుకోవడానికి ఏమీ అక్కర్లేదు; అది సంతోషం కలిగించే విషయమైతే చాలు. హర్షా మనవాడే! క్రికెట్ వ్యామోహం ఉన్నవాళ్లకు హర్షా భోగ్లే ఇట్టే తెలుసు. ఏ క్రికెట్ సీజన్లోనైనా ఈఎస్పీఎన్లోనో, స్టార్ స్పోర్ట్స్లోనో తెరమీదకు వచ్చేది హర్షానే. ఇరవై ఏళ్లలో ఆటగాళ్లు ఎందరో రిటైర్ అయివుండవచ్చుగానీ, కామెంటేటర్‌గా హర్షా ఇప్పటికీ ‘క్రీజు’లోనే ఉన్నారు. ఈ మరాఠీ ప్రొఫెసర్(ఎ.డి.భోగ్లే) కొడుకు హైదరాబాద్‌లోనే పుట్టారు; ఇక్కడి గల్లీల్లోనే క్రికెట్ నేర్చుకున్నారు; హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివారు; ఉస్మానియా యూనివర్సిటీలో కెమికల్ ఇంజినీరింగ్ చదువుతూ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు; 19 ఏళ్లప్పుడు హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియోలో కామెంటేటర్‌గా తొలి అడుగులు వేశారు; కాబట్టి, హర్షా తెలుగు మాట్లాడగలుగుతారని చెప్పడం చాలా చిన్న విషయం. ‘‘ఇది మన తెలుగువాళ్ల కోసం...’’ అని ఓసారి ట్వీట్ కూడా పెట్టారు. స్పందనలన్నీ తెలుగులోనే వస్తుంటే, ‘‘ఇదేంటి! రెండు ట్వీట్స్ తెలుగులో చేస్తే మీరు అందరూ తెలుగులోనే జవాబులు ఇస్తున్నారు. అంత బాగా తెలుగు రాదు,’’ అని రాదంటూనే వచ్చని నిరూపించుకున్నారు. నా మాతృభాష తెలుగు హర్షా రాదన్నారుగానీ, క్రికెటర్ రోహిత్ శర్మ అయితే, ‘అవును, నా మాతృభాష తెలుగు. మా అమ్మది వైజాగ్,’ అని చెప్పేశారు. ఐపీఎల్లో ఎవరున్నా లేకున్నా పదేళ్ల పాటు రోహిత్ కచ్చితంగా ఉంటాడన్నంతగా తన ప్రతిభను చాటుకున్న ఈ తెలుగు బిడ్డ నాగ్‌పూర్‌లోనే పుట్టి పెరిగినప్పటికీ, ఇక్కడి వైజాగ్ సముద్రంతో సంబంధం ఉంది. వాళ్ల అమ్మ పూర్ణిమ, అమ్మమ్మ విశాలాక్షి ఇక్కడివాళ్లే. వాళ్లమ్మ తెలుగు, మరాఠీల్లో ఇంటర్వ్యూలు ఇచ్చేస్తూ తన కొడుకు గురించి మురిసిపోతూ ఉంటారు. ఉండరా మరి! మరాఠీ ప్రాంతంలో ఉంటూ కూడా రోహిత్ తెలుగులో చక్కగా మాట్లాడేస్తుంటే! తెలుగు రేఖ! బాలీవుడ్ నటీమణి రేఖకు తెలుగుతో ఏమైనా సంబంధం ఉందా? రేఖ తల్లి పుష్పవల్లి తెలుగు వనిత. వరవిక్రయం, చెంచులక్ష్మి లాంటి సినిమాల్లో నటించారు. తమిళంలోనూ నటించినప్పుడు జెమినీ గణేశన్‌తో జీవితాన్ని ముడేసుకున్నారు. రేఖ అక్కడే జన్మించొచ్చుగాక, కానీ తన 180 చిత్రాల సుదీర్ఘ కెరీర్‌ను ‘రంగుల రాట్నం’లో బాలనటిగా ప్రారంభించారు. అంతకంటే సంబరపడే విషయం, తనదైన గొంతుతో తెలుగును పలికించగలగడం! జానీ జానీ తెలుగు పప్పా! హిందీ సినిమాలు చూసేవాళ్లకు చెప్పే పనిలేదుగానీ, చూడనివాళ్లకు జానీ లీవర్ను పరిచయం చేయాలంటే ఈ పోలిక తప్పదు. టాలీవుడ్లో బ్రహ్మానందం ఎంతో, బాలీవుడ్లో జానీ లీవర్ అంత. కామెడీలో ఇద్దరూ కింగులే అనేది పక్కనపెడితే, బ్రహ్మానందంలాగే జానీ లీవర్ కూడా అచ్చమైన తెలుగువాడు. ప్రకాశం జిల్లాలో జాన్ ప్రకాశ్ రావుగా పుట్టి, బతుకుతెరువుకోసం ముంబై వెళ్లి, తనకు సహజంగా అబ్బిన మిమిక్రీలు ప్రదర్శిస్తూ, హిందుస్తాన్ లీవర్ కంపెనీలో చేరి, అక్కడివాళ్లను తెగనవ్వించి, ఆ పేరులోని లీవర్ను తనకు తగిలించుకుని, హిందీ సినిమాల్లో జానీ లీవర్‌గా తెలుగు కేతనం ఎగరవేశారు. 300 సినిమాల్లో నటించిన జానీ ఏకైక తెలుగు చిత్రం ‘క్రిమినల్’ ఇది బాధే అయినా, సంతోషపెట్టే విషయం ఏమిటంటే ఆయన ఇక్కడి అమ్మాయి సుజాతనే పెళ్లి చేసుకున్నారు. వాళ్ల పిల్లలిద్దరూ(కూతురు జేమీ, కొడుకు జెస్సీ) బ్రహ్మాండంగా తెలుగు మాట్లాడతారు. గొప్ప దర్శకుడి ఇష్టురాలు భారతీయ సినిమాను సుసంపన్నం చేసిన నట దర్శకుడు గురుదత్ మెచ్చిన వహీదా రెహమాన్ రాజమండ్రి అమ్మాయి. ‘రోజులు మారాయి’లో ‘ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా’ పాటలో నృత్యం చేసిన అందగత్తె వహీదాను హైదరాబాద్‌లో చూసి, ఈ కొత్తముఖమే తన సినిమాలకు కావాలనుకున్నాడు గురుదత్. వహీదాకు ఉర్దూ కూడా రావడం ఇద్దరికీ లాభించింది. లేదంటే, ప్యాసా, కాగజ్ కే ఫూల్ లాంటి సినిమాల్లో వహీదాను ఎవరు భర్తీ చేయగలరు! అలాగే, గైడ్, నీల్ కమల్ లాంటి చిత్రాలను ఎవరు పూరించగలరు! అందాల ఝరి! 1970ల్లో ‘చిత్ చోర్’, ‘గోపాల్ కృష్ణ’ లాంటి హిందీ సినిమాల్లో నటించిన జరీనా వాహబ్ ఇక్కడివారంటే కొంచెం ఆశ్చర్యమే! కడపలో పుట్టిన జరీనా పుణె ఫిలిం ఇన్స్టిట్టూట్లో శిక్షణ పొందారు. ‘గాజుల కిష్టయ్య’ ‘అమర ప్రేమ’ ‘హేమాహేమీలు’ లాంటి తెలుగు సినిమాల్లో నటించినా, ఈ నాచురల్ బ్యూటీ బాలీవుడ్ వైపు వెళ్లిపోయారు. ‘రక్త చరిత్ర’లో ప్రతాప్ వాళ్లమ్మ పాత్ర వేసింది కూడా జరీనానే! ఇంకో విషయం ఏమిటంటే, తను ప్రేమించి పెళ్లాడిన నటుడు ఆదిత్య పంచోలి ‘షాడో’ చిత్రంలో నటించడానికి కారణం కూడా ఈ తెలుగు సంబంధమే. శంకరయ్య వస్తావయ్యా! నట లెజెండ్ రాజ్‌కపూర్ నటించి దర్శకత్వం వహించిన ‘శ్రీ 420’ చిత్రంలో ఒక హిందీ పాట ‘రామయ్యా వస్తావయ్యా’ లాంటి తెలుగు మాటతో మొదలైందంటే దానిక్కారణం సంగీతద్వయం ‘శంకర్-జై కిషన్’లోని శంకర్! అసలు పేరు శంకర్ సింగ్ రఘువంశీ. గుజరాత్ వాడైనా తండ్రి ఇక్కడ హోటల్ వ్యాపారంలో ఉండటంతో హైదరాబాద్‌లో పెరిగారు. సంగీతంలో ఆసక్తికొద్దీ తబలా పట్టుకుని ముంబై పయనమయ్యారు. జై కిషన్ జోడీగా ‘చోరీ చోరీ’ ‘బ్రహ్మచారి’ ‘మేరా నామ్ జోకర్’ ‘జిస్ దేశ్ మే గంగా బెహ్తీ హై’ ‘సంగం’ లాంటి చిత్రాలకు స్వరకల్పన చేశారు. హిందీలో ఉటంకించిన ఆ తెలుగు మాటతోనే ఇటీవల ఒక హిందీ చిత్రం వచ్చింది, ఇంకో తెలుగు సినిమా రాబోతోంది. ఎంత శక్తిమంతమైన పాట! ఎంత శక్తిమంతమైన సంగీత దర్శకుడు! తొలి సూపర్‌స్టార్! బాలీవుడ్ ఇంకా ఏర్పడకముందు, (ఇంగ్లీషు) మూకీల్లో నటించి, హిందీ టాకీలు వచ్చాక అందులో సూపర్‌స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న నటుడు పైడి జయరాజ్. ఆయనది కరీంనగర్ జిల్లా. నిజాం కాలేజీలో చదువుతూ నటన మీది ఆసక్తితో 1929లో బొంబాయి వెళ్లారు. షాజహాన్, పృథ్వీరాజ్, రాణా ప్రతాప్, టిప్పు సుల్తాన్ లాంటి చారిత్రక పాత్రలకు పెట్టింది పేరైన జయరాజ్ మొహర్, సాగర్ లాంటి సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. 1980లో జయరాజ్‌ను దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారంతో ప్రభుత్వం గౌరవించింది. వాహ్ అజీజ్! గజల్ గాయకుడు తలత్ అజీజ్ హైదరాబాదీ! ఎన్నో ఆల్బమ్స్ విడుదల చేశారు. ఉమ్రావ్ జాన్, బజార్ లాంటి సినిమాల్లో పాడారు. దీవార్, నూర్జహాన్, ఎహ్సాస్, సురూర్ లాంటి టెలీ సీరియల్స్‌కు సంగీత దర్శకత్వం వహించారు. సానియా మీర్జా అంకుల్ కూడా! మన శ్యామ్! అంకుర్, నిషాంత్, మంథన్, భూమిక లాంటి హిందీ చిత్రాలతో 1970ల్లో న్యూ వేవ్ శకానికి తెరలేపిన శ్యామ్ బెనెగల్ సికింద్రాబాద్‌లోని తిరుమలగిరిలో పుట్టారు. నిజాం కాలేజీ, ఉస్మానియా యూనివర్సిటీల్లో చదివారు. జన జీవితాన్ని ఆకళింపు చేసుకున్నారు. స్వాతంత్య్రపు పూర్వ తెలంగాణ భూస్వామ్య వ్యవస్థను, ఉత్సవాలను తన సినిమాల్లో బొమ్మకట్టారు. ‘‘ఇది నా జన్మభూమి,’’ అంటారు బెనెగల్. యాభై ఏళ్ల క్రితం ముంబై తరలివెళ్లినా ఇక్కడిలాంటి సంస్కృతిని మరెక్కడా చూడలేదంటారు దాదాసాహెబ్ ఫాల్కే, పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్న ఈ దేశం గర్వించదగ్గ దర్శకుడు. మన రిపోర్టర్! ‘రూరల్ రిపోర్టర్’ పి.సాయినాథ్ కూడా తెలుగువాడే! రైతుల వెతల మీద ఆయన ఎన్నో విలువైన కథనాలు రాశారు. కరువు, ఆకలి మీద గొప్ప పట్టున్న నిపుణుడిగా సాయినాథ్ నోబెల్ గ్రహీత ఆమర్త్యసేన్ కితాబు పొందారు. తమిళ తెలుగులు ద్రవిడోద్యమ నేత అన్నాదురై తెలుగు మూలాలు ఉన్నవారు. ఒక ఇంటర్వ్యూలో, ‘మా అమ్మ బంగారమ్మ, కంచిగుళ్లో దేవదాసీ, స్పష్టంగా తెలుగు మాట్లాడుతుంది,’ అని చెప్పారు. అన్నాదురై వారసుడు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కూడా ఇక్కడివారే! నట ముఖ్యమంత్రి ఎమ్జీయార్ మలయాళీయుడు అని కరుణ వర్గం ‘నాన్-తమిళ్’ ఇష్యూ తెచ్చినప్పుడు, కరుణానిధి కూడా తమిళుడు కాదు; వాళ్లది కృష్ణా జిల్లా మువ్వ ప్రాంతం అని ఎమ్జీయార్ ప్రకటించారు. ఎండీఎంకే పార్టీ నేత, వై.గోపాలస్వామి(వైగో) మూలాలూ ఇక్కడివే. నటదర్శకుడు కె.భాగ్యరాజా అంతే! అలాగే, డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు, సినీ నటుడు విజయ్‌కాంత్ కూడా తెలుగు వేర్లున్నవారే! ఇంట్లో తెలుగు మాట్లాడుతారు కూడా. అంటే, తమిళ రాజకీయాల్ని మలుపు తిప్పేదంతా తెలుగువాళ్లే! ఇంకా ఎందరో... బాలీవుడ్లో భిన్నమైన సినిమాలు చేస్తున్న దర్శకుడు, నటుడు నగేశ్ కుకునూర్ జన్మించింది హైదరాబాద్‌లోనే. లిటిల్ ఫ్లవర్ కాలేజీలో చదువుకున్నారు; నారాయణగూడ టాకీసుల్లో సినిమాలు చూశారు. అందువల్లే ‘హైదరాబాద్ బ్లూస్’ లాంటి సినిమా పుట్టింది. తర్వాత నగేశ్ ‘రాక్‌ఫోర్డ్’ ‘బాలీవుడ్ కాలింగ్’ ‘ఇక్బాల్’ లాంటి భిన్నమైన సినిమాలను అందించారు. ఇక్కడి అల్లుళ్లు... తమిళ నటుడు, దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుడు లాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి టి.రాజేందర్ తెలుగు నటి ఉషను పెళ్లి చేసుకున్నారు. వీళ్లబ్బాయే ఇప్పటి సూపర్ హీరో శింబు. సంగీత దర్శకుడు అనూ మాలిక్ తమ్ముడిగా డాబూ మాలిక్‌ను పరిచయం చేయొచ్చు. కానీ, డాబూ తెలుగు సినిమా ‘సర్వర్ సుందరం గారి అబ్బాయి’లో నటించారు. దానికన్నా ముఖ్య విషయం, తెలుగమ్మాయి జ్యోతిని పెళ్లి చేసుకున్నారు. ఎంటీవీలో ప్రాక్టికల్ జోకుల షో ‘బక్రా’ యాంకర్ సైరస్ బ్రోచా కూడా హైదరాబాద్ అల్లుడే! ఆయేషాను సైరస్ వివాహం చేసుకున్నారు. ఇక్కడే పుట్టినవాళ్లు... అంతర్జాతీయ నటి, పద్మభూషణ్ గ్రహీత షబానా అజ్మీ జన్మస్థలం హైదరాబాదే! సామాజిక కార్యకర్తగా కూడా పేరుమోసిన షబానా అంకుర్, నిషాంత్, అర్థ్, మాసూమ్, మండి, ఫైర్ లాంటి ఎన్నో విమర్శకుల మెప్పు పొందిన సినిమాల్లో నటించారు. ఈ నగరంలో పుట్టిన తారకు ఏఎన్నార్ అవార్డు ఇవ్వడం మరింత సముచితంగా ఉందని అప్పటి వక్తలు అభినందించారు కూడా! తన గొంతుతో ప్రత్యేకంగా కనిపించే శతాధిక చిత్రాల హిందీ నటుడు సురేశ్ ఒబెరాయ్‌ను అక్కున చేర్చుకున్నది హైదరాబాదే! దేశ విభజన అనంతరం వాళ్ల కుటుంబం పాకిస్తాన్ నుంచి ఇక్కడికి తరలివచ్చింది. ఇక్కడే వృద్ధిలోకి వచ్చింది. సురేశ్ ఇక్కడే పెరిగారు, సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో చదివారు, ముంబై వెళ్లి నటుడిగా పేరు ప్రతిష్టలు సంపాదించారు. కొడుకు వివేక్ ఒబెరాయ్‌ను కూడా నటుడిగా తీర్చిదిద్దారు. సురేశ్ తెలుగు మాట్లాడటంలో ఆశ్చర్యం లేదు, ‘కంపెనీ’ ‘రక్త చరిత్ర’ లాంటి సినిమాల్లో నటించిన వివేక్‌కు కూడా తెలుగువచ్చు. వివేక్ పుట్టింది హైదరాబాద్‌లోనే మరి! భారత ద్వితీయ రాష్ట్రపతి, భారతరత్న గ్రహీత సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టింది తెలుగు కుటుంబంలోనే. ఓ సందర్భంలో చిత్రకారుడు బుజ్జాయి గీసిన సర్వేపల్లి చిత్రం మీద ‘సర్వేపల్లి రాధాకృష్ణయ్య’ అని తెలుగులో సంతకం కూడా చేశారు. భారతీయ జనతా పార్టీకి పాష్ లుక్ తేవడంలో కీలక పాత్ర పోషించిన ప్రమోద్ మహాజన్ మహబూబ్‌నగర్‌లో జన్మించారు. నటుడు అజిత్ సికింద్రాబాద్‌లోనే పుట్టారు. నవరంగ్, దో ఆంఖే బారా హాత్ లాంటి చిత్రాల దర్శకుడు, దాదాసాహెబ్, పద్మవిభూషణ్ గ్రహీత వి.శాంతారాం వాళ్లది తెనాలి దగ్గరేనని చెబుతారు. చెన్నైలో ఉంటున్న కన్నడిగుడిగా కనిపించే ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ తెలుగువాడు. విజయనగరానికి చెందిన వీళ్ల కుటుంబం కర్ణాటకకు తరలివెళ్లింది. జగ్గీ వాసుదేవ్ తెలుగు మాట్లాడటమే కాదు, నెమ్మదిగా చదవగలరు కూడా! ముగింపు... మనది అనిపించే ప్రతిదీ మనిషికి ఒక ఆనందాన్ని, స్వీయ గౌరవాన్ని కలిగిస్తుంది. అది సహజం కూడా! అయితే, ఈ మన అనేదాన్ని విస్తరించుకుంటూ పోవడం మరింత ఆరోగ్యకరం. రుషులు, విశ్వమానవులు, మహనీయులు చేసేది అదే! మన ఊరు, మన జిల్లా, మన ప్రాంతం, మన దేశం, చివరగా మన ప్రపంచం! ప్రేమ అనే ఒక మూలకం ఒంట్లో సజీవంగా ఉన్నంతవరకూ ఎవరూ మనవాళ్లు కాకుండాపోరు.