స్వతంత్ర భారతి: 1994/2022 సౌందర్య కిరీటాలు | Azadi Ka Amrit Mahotsav First Indian Miss Universe Sushmita Sen | Sakshi
Sakshi News home page

స్వతంత్ర భారతి: 1994/2022 సౌందర్య కిరీటాలు

Published Mon, Jul 18 2022 2:04 PM | Last Updated on Mon, Jul 18 2022 3:38 PM

Azadi Ka Amrit Mahotsav First Indian Miss Universe Sushmita Sen - Sakshi

సౌందర్య కిరీటాలు 
ప్రపంచ వేదిక మీద భారతీయ సౌందర్యం విరాజిల్లింది. సుస్మితాసేన్‌ విశ్వ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకోవడం, ఆ వెంటనే ఐశ్వర్యా రాయ్‌ ప్రపంచ సుందరిగా వన్నెకెక్కడంతో అంతర్జాతీయ అందాల పోటీలలో భారతదేశం విజయ బావుటా రెపరెపలాడటం మొదలైంది. అప్పటికి 28 ఏళ్ల కిందట రీటా ఫారియా ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా అవతరించారు.

ఆ సందర్భం దేశ ప్రజల స్మృతిపథంలో చెరిగిపోతున్న దశలో 1994 లో దేశం నుంచి సరికొత్త అందాల రాణులు ప్రపంచ వేదికల మీద రాణించడం మొదలైంది. ఆ ఏడాదితో భారతదేశంలో అందాల తయారీ పరిశ్రమ ఊపందుకుంది. భారతీయ యువతులను ఈత దుస్తుల్లో మెరిసిపోయే సుందరాంగులుగా తీర్చిదిద్దడం మొదలైంది. ఆ పరిశ్రమ ఫలితాలుగా డయానా హైడెన్, యుక్తాముఖి, ప్రియాంక చోప్రా, లాలా దత్తా, మానుషీ చిల్లర్‌ మన ప్రపంచ సుందరీమణులుగా విజేతలౌతూ వస్తున్నారు. ఆ ప్రకంపనలు దేశవ్యాప్తంగా రెండు రకాలైన ప్రతిధ్వనులుగా వినిపించాయి. ఒకటి అనుకూలం. ఇంకోటి ప్రతికూలం. 

సైన్యంలోకి పృథ్వి
పృథ్వి క్షిపణిని భారత సైన్యంలోకి ప్రవేశపెట్టారు. ‘రిపబ్లిక్‌ డే’ని అందుకు తగిన సందర్భంగా ఎంచుకుని ఢిల్లీ పరేడ్‌ గ్రౌండ్స్‌లో పృథ్విని ప్రదర్శించారు.  

(చదవండి: ఎయిర్‌పోర్ట్‌కి శంకర్‌ పేరు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement