సయాటిక అనే పదం ఈ ఆధునిక యుగంలో వినని వారు ఉండరు. ఈ నొప్పి భరింపరానిదిగా ఉండటమే కాకుండా దైనందిన చర్యలకు ఆటంకం కలిగిస్తుంది. త్వరగా గుర్తించి సరైన సమయంలో సరైన చికిత్స; ఫిజియోథెరపీ, హోమియో మందులు, యోగా ద్వారా పూర్తిగా నివారించవచ్చు. ఆపరేషన్ అవసరం లేకుండా ఏవిధమైన దుష్ర్పభావం లేని చికిత్స అందుబాటులో ఉంది.
శరీరంలో అన్నింటి కంటె పెద్దది, పొడవాటి నరం సయాటికా నరం. ఇది వీపు భాగం నుండి పిరుదుల గుండా కాలు వెనుక భాగంలో ప్రయాణిస్తుంది. ఇది ఐదు ఇతర నరాల సమూహంతో ఏర్పడి ఉంటుంది (ఔ4, ఔ5, 1, 2, 3). వెన్నుపూస లోపల నుండి ప్రయాణించే నరాలపై వత్తిడి వలన కాలు వెనుక భాగం నొప్పికి గురవుతుంది. దానినే సయాటిక నొప్పి అంటారు. ఈ నొప్పి వీపు కింది భాగంలో మొదలై పిరుదుల నుండి తొడ, కాలు వెనుక భాగం, మడిమల వరకు పాకుతుంది. ఫలితంగా తిమ్మిరులు, స్పర్శ తగ్గిపోవడం, మంటలు, నడకలో మార్పులాంటి లక్షణాలు కనిపిస్తాయి.
కారణాలు:- 1. నర్వ్ కంప్రెషన్: నర్వ్ రూట్స్ ప్రెస్ అవ్వటం వల్ల 2. స్పైనల్ డిస్క్
హెర్నియేషన్: L4, L5 (నరాల మూలాలు ఒత్తిడికి గురై, సరైన పొజిషన్స్‌లో వంగక పక్కకు జరగడం
3.స్పైనల్ స్టీనోసిస్: ఎముకల్లో ఏర్పడే స్పర్శవల్ల వెన్నెముక కంప్రెస్ అవడం.
4.పైరిఫార్మస్ సిండ్రోమ్: దెబ్బలు, గాయాలు తగిలినప్పుడు పిరిఫార్సిస్ కండరం నర్వ్ రూట్స్‌ను ప్రెస్ చేయడం వల్ల
5.సాక్రోఇలియక్ జాయింట్ డిస్క్ ఫంక్షన్: శారీరక శ్రమ, వ్యాయామం లేక కీలు సరిగా పనిచేయక పోవడం వల్ల,
6.ప్రెగ్నెన్సి: ప్రెగ్నెన్సి చివరి నెలలో పిండం బరువు పెరిగి నర్వ్ రూట్స్ ప్రెస్ అవటం వలన సయాటిక నొప్పి వస్తుంది.
పరీక్షలు:
1. డాక్టర్ సమక్షంలో నిర్వహించే కొన్ని వ్యాయామాలద్వారా
2.డిస్క్ హెర్నియేషన్, డిస్క్ ప్రోలాప్స్, నిర్థారణ.
హోమియో వైద్య విధానం: సయాటిక నొప్పికి, వెన్నుపూస సమస్యలకు కారణాన్ని బట్టి ఆపరేషన్ లేకుండా సంపూర్ణమైన చికిత్సావిధానం అందుబాటులో ఉంది.
హోమియో మందులు... వాటి లక్షణాలు
1. రస్‌టాక్స్: కండరాల నొప్పికి , ఎడమవైపు సయాటిక నొప్పికి ఇది మంచి మందు. తిమ్మిరులు, స్టిఫ్‌నెస్ ఉండి కూర్చొని లేస్తే వచ్చే తీవ్రమైన నొప్పి, సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్‌కు కూడా ఇది మంచి ఔషధం.
2. కిలోసింథ్: నరాలు లాగినట్టుగా ఉండి భరింపరాని నొప్పి పిరుదుల నుండి మోకాలు, పాదం వరకు పాకుతుంది. కదిలినా, ముట్టుకున్నా, చల్లటి వాతావరణంలో ఎక్కువయ్యే నొప్పికి... ముఖ్యంగా కుడివైపు కాలికి వచ్చే సయాటికాకు మంచి మందు.
3. రోడోడెన్‌డ్రన్: సర్వైకల్ స్పాండిలోసిస్‌కు ఇది మంచి ఔషధం. ఇది ఎక్కువగా వేసవి లో వస్తుంది. మెడభాగంలో స్టిఫ్‌నెస్ ఉండి, నొప్పి భుజాల వరకు పాకుతుంది. విశ్రాంతి తీసుకుంటే నొప్పి ఎక్కువ అవుతుంది.
4. కాస్టికమ్: ఇది ముఖ్యంగా నరాల మీద పనిచేస్తుంది. కండరాల శక్తి కోల్పోయి మంట, భరింపరాని నొప్పి, మెడభాగంలో నొప్పి ఉండి భుజాల మధ్య స్టిఫ్‌నెస్ ఉంటుంది. ఎడమవైపు వచ్చే సయాటిక నొప్పికి మంచి ఔషధం.
డాక్టర్ మురళి అంకిరెడ్డి,
ఎం.డి (హోమియో),
స్టార్ హోమియోపతి,
సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్, కూకట్‌పల్లి,
విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ,
రాజమండ్రి, హనుమకొండ-వరంగల్, కర్ణాటక
ఫోన్: 7416 107 107 / 7416 102 102
www.starhomeo.com
E-mail: info@starhomeopathy.com