Star homeopathy
-
మైగ్రేన్ (పార్శ్వపు తలనొప్పి)
తరచుగా తలనొప్పి వస్తే అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే తలనొప్పికి చాలా కారణాలున్నాయి. రక్తపోటు, మెదడులో కణతులు, రక్తనాళాలలో రక్తప్రసరణలో మార్పులు, మానసిక ఒత్తిడి, నిద్రలేమి వల్ల, మగవారిలో రక్తపోటు, మానసిక ఒత్తిడి, మెదడులోని కణుతుల వల్ల తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. మైగ్రేన్ తలనొప్పి స్త్రీలలో అధికంగా చూస్తుంటాం. ఈ నొప్పి చాలావరకు తలకు ఒక పక్క వస్తుంది. వాంతులూ ఉండవచ్చు. తలలోని రక్తనాళాలు ఒత్తిడికి లోనయి వాచడం వల్ల ఈ నొప్పి వస్తుంది. పార్శ్వపు తలనొప్పికి కారణాలు పార్శ్వపునొప్పికి మానసిక ఆందోళన, ఒత్తిడి ముఖ్య కారణాలు. అనవసరపు ఆలోచనలు, జరిగిపోయిన విషయాలను తరచుగా ఆలోచించడం వల్ల వస్తుంది. డిప్రెషన్, నిద్రలేమి కొందరిలో బయటకు వెళ్లినప్పుడు, సూర్యరశ్మి వల్ల అధికంగా ప్రయాణాలు చేయడం వల్ల వస్తుంది. స్త్రీలలో హార్మోన్ల సమస్యలు ఏర్పడినప్పుడు, ఋతుచక్రం ముందుగా గాని, తర్వాత గాని వచ్చే అవకాశం ఉంటుంది. గర్భధారణ సమయంలో, స్త్రీలలో ఋతుచక్రం ఆగిపోయినపుడు. ఈ సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ లాంటి కొన్ని రకాల మందులు వాడటం వల్ల వాడినప్పుడు కూడా రావచ్చు. మైగ్రేన్ దశలు - లక్షణాలు సాధారణంగా 24 - 72 గంటల్లో దానంతట అదే తగ్గవచ్చు. ఒకవేళ నొప్పి 72 గంటలు ఉంటే స్టేటస్ మైగ్రేన్ అంటారు మైగ్రేన్‌నొప్పి 4 దశలలో సాగుతుంది. ప్రొడ్రోమ్ ఫేజ్: ఇది నొప్పికి ముందు 2 గంటల నుంచి 2 రోజుల ముందు వరకు జరిగే ప్రక్రియల సమూహం. ఈ దశలో చిరాకు, మానసిక ఆందోళన, డిప్రెషన్, ఆలోచనలో మార్పులు రావడం, వాసన, వెలుతురు పడకపోవడం, మెడనొప్పి ఉంటాయి. ఆరా ఫేజ్: ఈ దశ నొప్పి ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందు ఉంటుంది. చూపు మందగించడం, జిగ్ జాగ్ లైన్స్ కనిపించడం, తలలో సూదులు గుచ్చిన ఫీలింగ్, మాటల తడబాటు, కాళ్ళలో నీరసం ఉంటాయి. నొప్పిదశ: ఈ నొప్పి దశ 2 గంటల నుంచి 3 రోజుల వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఈ దశలో వాంతులు ఉంటాయి. చాలా వరకు ఒకవైపునే ఉంటుంది. కాంతికి, ధ్వనికి చాలా సెన్సిటివ్‌గా అంటే చికాగ్గా అనిపిస్తుంది. పోస్ట్‌డ్రోమ్ ఫేజ్: నొప్పి తగ్గిన తర్వాత కొద్దిరోజుల వరకు తల భారంగా అనిపిస్తుంది. ఒళ్లంతా నీరసంగా, నిరాసక్తంగా అనిపిస్తుంది. వ్యాధి నిర్ధారణ : రక్త పరీక్షలు-సీబీపీ, ఈఎస్ఆర్ రక్తపోటును గమనించడం ఈఈజీ పరీక్ష సిటీ స్కాన్ (మెదడు) ఎంఆర్ఐ మెదడు పరీక్షలు ఉపకరిస్తాయి. మైగ్రేన్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మానసిక ఆందోళనలు తగ్గించాలి. అతిగా ఆలోచనలు చేయకూడదు. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. దీనికోసం యోగా, ప్రాణాయామం చేయాలి.ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత లక్షిస్తుంది. తలకు నూనెతో మసాజ్ చేసుకుంటే తలలోని నరాలు రిలాక్సవుతాయి. తలనొప్పి వచ్చినప్పుడు ప్రశాంత వాతావరణంలో, లైటు తీసేసి నిశ్శబ్దంగా ఉన్నచోట పడుకోబెట్టాలి. డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో), స్టార్ హోమియోపతి, సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, హన్మకొండ-వరంగల్, కర్ణాటక ph: 7416107107 / 7416 102 102 www.starhomeo.com Email : info@starhomeopathy.com హోమియో వైద్యం మైగ్రేన్ తలనొప్పికి హోమియోలో మంచి మందులున్నాయి. ఘాటైన వాసనలు పీల్చినప్పుడు వస్తే, బెల్లడోనా, లైకోపోడియం, ఇగ్నిషియా ఇవ్వాలి. తరచు ఎక్కువగా వస్తుంటే - నాట్రంమూర్, సాంగ్యునేరియా, చైనా, సెపియా ఇవ్వాలి. గర్భవతుల్లో వస్తే బెల్లడోనా, నక్స్‌వామికా, సెపియా ఇవ్వాలి. ఎక్కువగా చదవడం వల్ల వస్తే కాల్కేరియా కార్బ్, నాట్రంమూర్, ట్యూబర్కిలినమ్. ప్రయాణాల వల్ల వస్తే - ఇగ్నిషియా, సెపియా, కాక్యులస్, కాలికార్బ్ ఇవ్వాలి. స్కూల్‌కి వెళ్లే ఆడపిల్లలలో వస్తే - కాల్కేరియాఫాస్, నాట్రంమూర్, పల్సటిల్లా ఇవ్వాలి. పైన తెలిపిన మందులు కేవలం అవగాహనకు మాత్రమే. వాటిని నిష్ణాతులైన హోమియో డాక్టర్ని సంప్రదించి మాత్రమే తీసుకోవాలి. -
సయాటిక - సంపూర్ణ హోమియో చికిత్స
సయాటిక అనే పదం ఈ ఆధునిక యుగంలో వినని వారు ఉండరు. ఈ నొప్పి భరింపరానిదిగా ఉండటమే కాకుండా దైనందిన చర్యలకు ఆటంకం కలిగిస్తుంది. త్వరగా గుర్తించి సరైన సమయంలో సరైన చికిత్స; ఫిజియోథెరపీ, హోమియో మందులు, యోగా ద్వారా పూర్తిగా నివారించవచ్చు. ఆపరేషన్ అవసరం లేకుండా ఏవిధమైన దుష్ర్పభావం లేని చికిత్స అందుబాటులో ఉంది. శరీరంలో అన్నింటి కంటె పెద్దది, పొడవాటి నరం సయాటికా నరం. ఇది వీపు భాగం నుండి పిరుదుల గుండా కాలు వెనుక భాగంలో ప్రయాణిస్తుంది. ఇది ఐదు ఇతర నరాల సమూహంతో ఏర్పడి ఉంటుంది (ఔ4, ఔ5, 1, 2, 3). వెన్నుపూస లోపల నుండి ప్రయాణించే నరాలపై వత్తిడి వలన కాలు వెనుక భాగం నొప్పికి గురవుతుంది. దానినే సయాటిక నొప్పి అంటారు. ఈ నొప్పి వీపు కింది భాగంలో మొదలై పిరుదుల నుండి తొడ, కాలు వెనుక భాగం, మడిమల వరకు పాకుతుంది. ఫలితంగా తిమ్మిరులు, స్పర్శ తగ్గిపోవడం, మంటలు, నడకలో మార్పులాంటి లక్షణాలు కనిపిస్తాయి. కారణాలు:- 1. నర్వ్ కంప్రెషన్: నర్వ్ రూట్స్ ప్రెస్ అవ్వటం వల్ల 2. స్పైనల్ డిస్క్ హెర్నియేషన్: L4, L5 (నరాల మూలాలు ఒత్తిడికి గురై, సరైన పొజిషన్స్‌లో వంగక పక్కకు జరగడం 3.స్పైనల్ స్టీనోసిస్: ఎముకల్లో ఏర్పడే స్పర్శవల్ల వెన్నెముక కంప్రెస్ అవడం. 4.పైరిఫార్మస్ సిండ్రోమ్: దెబ్బలు, గాయాలు తగిలినప్పుడు పిరిఫార్సిస్ కండరం నర్వ్ రూట్స్‌ను ప్రెస్ చేయడం వల్ల 5.సాక్రోఇలియక్ జాయింట్ డిస్క్ ఫంక్షన్: శారీరక శ్రమ, వ్యాయామం లేక కీలు సరిగా పనిచేయక పోవడం వల్ల, 6.ప్రెగ్నెన్సి: ప్రెగ్నెన్సి చివరి నెలలో పిండం బరువు పెరిగి నర్వ్ రూట్స్ ప్రెస్ అవటం వలన సయాటిక నొప్పి వస్తుంది. పరీక్షలు: 1. డాక్టర్ సమక్షంలో నిర్వహించే కొన్ని వ్యాయామాలద్వారా 2.డిస్క్ హెర్నియేషన్, డిస్క్ ప్రోలాప్స్, నిర్థారణ. హోమియో వైద్య విధానం: సయాటిక నొప్పికి, వెన్నుపూస సమస్యలకు కారణాన్ని బట్టి ఆపరేషన్ లేకుండా సంపూర్ణమైన చికిత్సావిధానం అందుబాటులో ఉంది. హోమియో మందులు... వాటి లక్షణాలు 1. రస్టాక్స్: కండరాల నొప్పికి , ఎడమవైపు సయాటిక నొప్పికి ఇది మంచి మందు. తిమ్మిరులు, స్టిఫ్నెస్ ఉండి కూర్చొని లేస్తే వచ్చే తీవ్రమైన నొప్పి, సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్‌కు కూడా ఇది మంచి ఔషధం. 2. కిలోసింథ్: నరాలు లాగినట్టుగా ఉండి భరింపరాని నొప్పి పిరుదుల నుండి మోకాలు, పాదం వరకు పాకుతుంది. కదిలినా, ముట్టుకున్నా, చల్లటి వాతావరణంలో ఎక్కువయ్యే నొప్పికి... ముఖ్యంగా కుడివైపు కాలికి వచ్చే సయాటికాకు మంచి మందు. 3. రోడోడెన్డ్రన్: సర్వైకల్ స్పాండిలోసిస్‌కు ఇది మంచి ఔషధం. ఇది ఎక్కువగా వేసవి లో వస్తుంది. మెడభాగంలో స్టిఫ్నెస్ ఉండి, నొప్పి భుజాల వరకు పాకుతుంది. విశ్రాంతి తీసుకుంటే నొప్పి ఎక్కువ అవుతుంది. 4. కాస్టికమ్: ఇది ముఖ్యంగా నరాల మీద పనిచేస్తుంది. కండరాల శక్తి కోల్పోయి మంట, భరింపరాని నొప్పి, మెడభాగంలో నొప్పి ఉండి భుజాల మధ్య స్టిఫ్నెస్ ఉంటుంది. ఎడమవైపు వచ్చే సయాటిక నొప్పికి మంచి ఔషధం. డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో), స్టార్ హోమియోపతి, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, రాజమండ్రి, హనుమకొండ-వరంగల్, కర్ణాటక ఫోన్: 7416 107 107 / 7416 102 102 www.starhomeo.com E-mail: info@starhomeopathy.com -
బాధించే నడుమునొప్పి
నడుమునొప్పి గురించి విననివారు, దీనిబారిన పడనివారు ఉండరు. ముఖ్యంగా 2/3 మంది 20 సంవత్సరాలు దాటినవారిలో చూస్తాం. ముఖ్యంగా మహిళలలో ఈ నొప్పితో ఎక్కువగా బాధపడతారు. వారి జీవన విధానం, ప్రెగ్నెన్సీ, డెలివరీ, ఇంటి పనులు తీవ్రతను పెంచుతారు. డాక్టరు దగ్గరికి వెళ్ళేవారిలో ప్రతి ఇద్దరు ముగ్గురిలో ఈ బాధ బారిన పడేవారు ఒకరు తప్ప ఉంటారు. పనిచేయలేకపోవటం, విశ్రాంతి దీనికి అవసరం అవటంవలన వారు సెలవు దీనివలన తీసుకుంటారు. అధికంగా పని దినాలు దీనివలనే వృధా అవుతుంటాయి. నడుమునొప్పి వ్యాధి కాదు. వ్యాధి యొక్క లక్షణములు మాత్రమే. ఇది చాలా వ్యాధులలో సర్వ సాధారణంగా కనబడుతుంది. చిన్న జ్వరం నుండి బాధించే ప్యాసెట్ సైనొవ్యయల్ సిస్ట్ (Facet Synovial Cyst) నడుమునొప్పికి కారణాలు అనేకం. శరీరశ్రమ, పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు కూడా కారణం అవుతాయి. మనం దీనిని మూడు విధాలుగా విభజించవచ్చును. సిస్టమ్ డిసీస్ Systemic Disease, స్ట్రెస్, టెన్షన్ వలన లేదా Nurological problem న్యూరోలాజికల్ ప్రాబ్లమ్ వలన. సామాన్యంగా పది మంది నొప్పులతో బాధపడేవారిలో, ఆరుగురు నడుమునొప్పి బాధ ఉన్నవారే. సన్నని నొప్పి, ఆగకుండా కలిగే నొప్పి, ఉప్పెన మాదిరిగా వచ్చే నొప్పి, కూర్చుంటే కలిగే నొప్పి, టూ వీలర్ నడిపితే కలిగే నొప్పి, గృహిణిలకు పనివలన కలిగే నొప్పి, పెద్దవారికి టీవీ చూస్తే నొప్పి, స్కూలు పిల్లలకు బ్యాగులు మోసి (బుక్స్) నొప్పి, కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కూర్చునే నొప్పి, వ్యాపారులకు, ఉద్యోగులకు, రాజకీయనాయకులకు, రైతులకు పొలాలో నొప్పి, నాట్యకళాకారులకు నాట్యంలో నొప్పి, వృద్ధులకు పడుకుంటే నొప్పి, అందరినీ బాధించే నొప్పి నడుమునొప్పి. వివిధ కారణాలు: స్వల్పకాలిక నొిప్పి: కొన్ని రోజులు, కొన్ని వారాలు ఉండే నొప్పి ముఖ్యంగా గాయాలు, వెన్నుపూసవాపు, కండరాల శ్రమ, ఆటలలో గాయాలు, అలసటతో పనిచేయడం, బరువులు ఎత్తుట... ఇటువంటి సమయాలలో నొప్పి ఆకస్మాత్తుగా తీవ్రం గా పొడిచినట్లుగా ఉంటుంది. కదలికలలో నిర్బంధం, ఫ్రీగా తిరగలేరు, కండరాలు పట్టివేసినట్లుండటం, నిటారుగా నిలబడలేరు, చక్కగాపడుకోలేరు. దీర్ఘకాలిక నొప్పి : మూడు నెలల కంటే ఎక్కువైనచో కారణాలు వేరుగా ఉంటాయి. వివిధ రకాలుగా ఈ నొప్పి వివిధ భాగాలలో ఉంటుంది. వెన్నుపూసలో మార్పుల వలన వచ్చే నొప్పులు. డిస్క్ (వెన్నుపూస) సమస్యలు డిస్క్ హెర్వియేషన్ డిస్క్‌బల్జ్ (వాపు) డిస్క్ ప్రొలాప్స్ (ప్రక్కకు జరుగుట) నర్వ్ కంప్రెషన్ కెనాల్ నారోయింగ్ డిస్క్ లైసిస్ డిస్క్ ట్రోమ డిస్క్ ఫ్యాక్టర్స్ డిస్క్ సిండ్రోమ్స్ స్పైనల్ టీబీ ఆస్టియో పొరోసిస్ డిస్క్ వాపు, ఆర్ట్రైటిస్ డిస్క్ (వెన్నుపూస) వాపు, పక్కకు జరుగుట వంటివాటికి కలిగే బాధలు: వెన్నుపూసల మధ్యన ఉండే జిగురుపదార్థం తగ్గి పక్కకు జరుగుతుంది. అపుడు నడుమునొప్పి పిరుదుల నుండి కాళ్ళ వరకు, మెడనొప్పి, భుజములు, చేతులు, తిమ్మిరి, మొద్దు బారిపోవుట, కండరాల పట్టు తగ్గుట, వణుకుట చూస్తాం. రోగ నిర్ధారణ: ఎక్స్-రే ఎమ్ఆర్ఐ సీటీ స్కాన్ వాడదగిన హోమియో మందులు రస్టాక్స్: కండరాల, కీళ్ళ నొప్పులు, కదలికలలో నిర్బంధం (స్టిఫ్నెస్) చల్ల గాలి, తేమ వలన వచ్చేనొప్పి, నడుమునొప్పి, కీళ్ళ నొప్పులు. తార్నికం: గాయాలు, బెణుకుట వలన కలిగే నొప్పి,జ్వరం, కీళ్ళ నొప్పులు, వాపు, నడకతో పెరిగే నొప్పులు. సిమిసిపూగ: స్త్రీల సంబంధ నొప్పులు, మెన్సెస్ టైమ్‌లో పెరిగే నొప్పులు, వాతావరణ మార్పుల వలన కలిగే నొప్పులు కాస్టకమ్: కండరాల పటుత్వం, నిర్బంధం, కీళ్ళవాపు, కండరాల క్షీణత, ఎక్కువ చలి వేడి పడదు, నడకతో పెరిగే నొప్పి. అకొటైట్: ఉప్పెనలాంటి నొప్పులు, భయం, ఆందోళన విపరీతమైన నొప్పి, ప్రాణభయం, నరాలసంబంధ నొప్పులు. బెల్లడొనా: కీళ్ళ వాపు, కండరాల నొప్పి, తీవ్రంగా, సడెన్‌గా వచ్చే నొప్పి, జ్వరం, కండరాలు పట్టి వేయుట, స్పాజెర్స్. హోమియో చికిత్స హోమియో వైద్యం ద్వారా కండరాల, కీళ్ళ, నరముల సంబంధ వ్యాధులకు స్టార్ హోమియోపతిలో నవీన చికిత్స కనుగొనబడినది. నూతన పరిశోధన ఫలితాలను అనుసరించి శారీరక, మానసిక విశ్లేషణ కారణం రోగ లక్షణములను, మూలకారణములు వీటిని బట్టి హోమియో మందులు సూచింపబడును. డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో), స్టార్ హోమియోపతి, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక www.starhomeo.com ph: 7416107107 / 7416109109 -
హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్, థైరాయిడ్ గ్రంథి...లోపాలు - లక్షణాలు
థైరాయిడ్ గ్రంథి సీతాకోకచిలుక ఆకారంలో గొంతు భాగంలో ఉంటుంది. ఈ గ్రంథి పిట్యుటరీగ్రంథి అధీనంలో ఉంటుంది. ఇది గొంతు భాగంలో గాలిగొట్టం (trachea) ఇరువైపులా అమరి ఉన్నట్లుగా ఉంటుంది. థైరాయిడ్ గ్రంథిలో ముఖ్యంగా రెండు తేడాలను చూస్తాం. అవి T3, T4 తగ్గడం వలన హైపోథైరాయిడిజమ్, T3, T4 పెరగటం వలన హైపర్ థైరాయిడిజమ్ కనిపిస్తాయి. థైరాయిడ్ గ్రంథి యొక్క లోపాలు మన శారీరక, మానసిక వ్యవస్థ మీద పనిచేస్తాయి. అమెరికాలో 59 మిలియన్ల జనాభాకి థైరాయిడ్ సమస్య ఉన్నట్లు అంచనా. కానీ చాలామందికి ఆ విషయం ఇప్పటివరకు తెలియదు. థైరాయిడ్ గ్రంథి జీవక్రియలకు అవసరమైన చాలా ముఖ్యమైన గ్రంథి. ఎప్పుడైతే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయదో, అది మీ ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా బరువు, మానసిక ఆందోళనలు, శక్తి స్థాయులపై దుష్ర్పభావం చూపుతాయి. థైరాయిడ్ సమస్యలు అకస్మాత్తుగా స్థూలకాయం, గుండె సంబంధిత వ్యాధులు, మానసిక ఆందోళనలు, ఆత్రుత, వెంట్రుకలు ఊడటం, సెక్సువల్ డిస్ఫంక్షన్, సంతానలేమి, ఇతర లక్షణాలు, ఆరోగ్యసమస్యలు వచ్చే అవకాశాల్ని పెంచుతాయి. అందుకే థైరాయిడ్ సమస్యని గుర్తించడం అతి ముఖ్యం. ప్రపంచ జనాభాలో సుమారు 75 శాతం స్త్రీలు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. మగవారిలో కేవలం 1.5 శాతం మాత్రమే. దీనికి కారణం మారిన జీవనశైలి కారణంగా మనపై పడే ఒత్తిడులే అని చెప్పవచ్చు. థైరాయిడ్ తయారుచేసే హార్మోన్స్ జీవన యంత్రాంగాన్ని, రసాయన పదార్థాలను నియంత్రిస్తాయి. థైరాయిడ్ ముఖ్యంగా T3, T4 అనే రెండు హార్మోన్స్‌ను తయారుచేస్తుంది. T3, ట్రై ఐడో ధైరోనిన్, T4 థైరాక్సిన్ (thyroxine) ఈ హార్మోన్స్ శరీరంలో... =BMR based metabolic Rate ను పెంచుతాయి =ఫాట్స్, కార్బోహైడ్రేట్ మెటబాలిజమ్‌ను పెంచుతాయి =ప్రొటీన్ల తయారీ =గుండెకు, ఇతర అవయవాలకు రక్తసరఫరా హెచ్చిస్తాయి పిల్లలలో థైరాయిడ్ హార్మోన్స్ వలన గుండె, మెదడు పెరుగుదల మామూలుగా ఉంటుంది. ఎముకల ఎదుగుదల, క్యాల్షియం మెటబాలిజమ్ కు కూడా థైరాయిడ్ హార్మోన్స్ ఆవశ్యకత ఉంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు థైరాయిడ్ పాత్ర సమతుల్యత, పోషణ, శరీర పెరుగుదలకు... థైరాయిడ్ గ్రంథి అవసరం చాలా ఉంది. హైపోథాలమిక్ పిట్యుటరీ థైరాయిడ్ ఆక్లిన్స్ ద్వారా థైరాయిడ్ హార్మోన్స్ తయారీ, నియంత్రణ ఆధారపడి ఉంటుంది. కొన్ని కారణాల వలన కలిగే మార్పులు ఎ) థైరాయిడ్ గ్రంథిలో వాపు, ఇన్ఫ్లమేషన్ బి) థైరాయిడ్ గ్రంథిలో హార్మోన్స్ ఎక్కువ కావడం సి) థైరాయిడ్ గ్రంథిలో హార్మోన్స్ తక్కువ కావడం థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువైనప్పుడు దానిని హైపర్ థైరాయిడిజమ్ అంటారు. లక్షణాలు =ఆకలి బాగా ఉంటుంది. కానీ బరువు తగ్గుతారు =కోపం, చిరాకు నీరసం =అలసట, ఉద్రేకం = నాడి వేగం హెచ్చటం =కాళ్ళు, చేతులు వణకటం =ఎక్కువ వేడిని భరింపలేకపోవటం =చెమట పట్టడం =నీటి విరేచనాలు థైరాయిడ్ గ్రంథి భాగం వాచి, ఇన్ఫ్లమేషన్ ఉంటే ఆ కండిషన్‌ను థైరోటాక్సికోసిన్ లేదా Graves disease అంటారు. దీనిని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు. ఇది ముఖ్యంగా 30 సం.ల వయస్సు పైబడ్డ వారిలో, ఎక్కువ శాతం స్త్రీలలో వస్తుంది. కనుగుడ్లు బయటికి వచ్చినట్లు ఉండటం: కంటి లోపలి కండరాలు, కొవ్వు లోపలిభాగం వాటి కనుగుడ్లను బయటికి తోస్తాయి. ఇది థైరాయిడ్ కంతుల రూపంలో ఒకటి లేదా రెండు, మూడు ఉండవచ్చు. ూౌఛీఠ్చట జౌజ్టీట్ఛ అని కూడా అంటారు. హైపోథైరాయిడిజమ్ T3, T4 హార్మోన్స్ ఉత్పత్తి కొన్ని కారణాల వలన తగ్గిపోతుంది. లక్షణాలు =నీరసం, బద్దకం =వేడి ఉష్ణోగ్రతలో కూడా చలిగా ఉంటుంది =వయస్సు నిలకడలేకపోవటం =శరీర బరువు పెరగటం =మానసికంగా కుంగిపోవటం (డిప్రెషన్) =ముఖం వాచినట్లుండటం =జుట్టు రాలటం =చర్మం పొడిబారినట్లుండటం =మలబద్దకం =గొంతు బొంగురుపోవటం రోగ నిర్థారణ =రక్తపరీక్ష : T3, T4, TSH Levels =గ్రేవ్స్ డిసీజ్: T3, T4, లెవల్స్ ఎక్కువలో TSH లెవల్ తక్కువలో ఉంటుంది =రక్తపరీక్ష: థైరాయిడ్ యాంటీ బాడీస్, థైరాయిడ్ స్కానింగ్, అల్ట్రాసౌండ్ చికిత్స హైపర్ థైరాయిడ్: Anti Thyrox, Neo ఈ డ్రగ్ థైరాయిడ్ హార్మోన్ తయారీని తగ్గిస్తుంది. హైపోథైరాయిడ్ : థైరో నార్మ్: థైరాక్సిన్ సోడియం, 25, 50 100Cg లో లభిస్తుంది. Eltroxin, Roxin, Protid, Callosl (Iodine) Liquid 8mg Iodine/5mc హైపర్ థైరాయిడిజమ్‌లో వాడవచ్చును. ఇది Thyroid hormone ను ఆపుతుంది. హోమియో వైద్యం హోమియోపతి వైద్య విధానంలో థైరాయిడ్ వచ్చేందుకు గల మూలకారణాలను విశ్లేషించి, శారీరక, మానసిక లక్షణాలను విచారించి సరియైన హోమియో మందుల ద్వారా, తత్వ విచారణ ద్వారా చికిత్స చేయవచ్చును. హోమియోతో మంచి ఫలితాలు వస్తాయి. హైపోథైరాయిడ్‌కు కారణాలు థైరాయిడ్ గ్రంథిలోనే లోపం కలగడం. దీనినే hashimoto's thyroid వాపు అంటారు. శరీరంలో యాంటీబాడీస్ తయారై గ్రంథిని పనిచేయకుండా చేస్తుంది. ఇది కూడా ఆటోఇమ్యూన్ డిజార్డరే. ముఖ్యంగా స్త్రీలలో ఎక్కువగా వస్తుంది. 30 -50 సం.ల వయస్సు వారిలో రావచ్చు. నియంత్రణ లేని హైపర్ థైరాయిడ్ ట్రీట్మెంట్ వలన హైపోథైరాయిడ్‌గా మారవచ్చును. చిన్నపిల్లల్లో హైపోథైరాయిడ్ వలన పెరుగుదల లోపాలుంటాయి. మెదడు పెరుగుదల ఆగిపోవచ్చును. కాబట్టి అశ్రద్ధ చేయకూడదు. పుట్టుకతో థైరాయిడ్ లోపాలుండవచ్చును. వారిలో పెరుగదల ఆగిపోతుంది. డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో), స్టార్ హోమియోపతి, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక www.starhomeo.com ph: 7416109109 / 7416107107 -
మానసిక ఒత్తిడి, ఆందోళనలో న్యూరోట్రాన్స్మిటర్స్ పాత్ర!
మానవ మెదడులో 10 బిలియన్ల న్యూరాన్లు (మెదడు కణాలు) ఉంటాయి. ప్రతి ఒక్క కణం, తక్కిన కణాలతో రసాయనికంగా అనుసంధానించబడి ఒకదానితో ఒకటి సందేశాలను మార్చుకొంటూ ఉంటాయి. ఈ అనుసంధానకాలను న్యూరోట్రాన్స్మిటర్లు లేదా రసాయనిక ప్రసారకాలు (Neurotransmeter or Chemical messengers) అంటారు. మన ఆవేశ అనుభూతులను న్యూరోట్రాన్స్మిటర్లు అదుపుచేస్తాయి. మెదడులోని ఆవేశకేంద్రం (Emotion Center) లో ఐదు రకాల రసాయనిక పదార్థాలు లేదా న్యూరోట్రాన్స్మిటర్లు ఉంటాయి. అధికమైన స్ట్రెస్‌ను ఎదుర్కోవడానికి ఎండార్ఫిన్ల శాతం అధికంగా కావలసి ఉంటుంది. ఈ విధంగా అధికమైన న్యూరోట్రాన్స్మిటర్లకు, ఇతర న్యూరో ట్రాన్స్మిటర్ల మధ్యన ఉండవలసిన నిష్పత్తిలో తేడా వచ్చి రసాయనిక సమతుల్యత చెడుతుంది. ఈ దశలోనే మనకు ఎక్కువగా స్ట్రెస్ అనుభవంలోకి వస్తుంది. దీని ఫలితంగా శరీరంలో విడుదలైన హానికరమైన రసాయనిక పదార్థాలు, శరీర కణాలకు హాని చేసి మరింత స్ట్రెస్ పెరుగుదలకు కారణమవుతుంది. ఈ విధంగా వరుసగా వచ్చే క్లిష్ట రసాయనిక మార్పులను ‘స్ట్రెస్ చక్రం’ (Stress Cycle) అంటారు. దీని ఫలితంగా ఆవేశపరమైన నిస్త్రాణ (Emotional Fatigue), డిప్రెషన్ అనుభవంలోకి వస్తాయి. ఆవేశ అనుభూతులను అదుపు చేసే న్యూరోట్రాన్స్మిటర్లు మెదడులోని కణాల మధ్య ఆవేశ-అనుభూతులను ఒక దానికొకటి సందేశాలను మార్చుకొనడంలో ప్రధానపాత్ర వహించే రసాయనిక సంధానకాలను న్యూరోట్రాన్స్మిటర్ లేదా నాడీరసాయనిక ప్రసారకాలు అంటారని ఇప్పటికే తెలుసుకున్నాం కదా! ప్రధానంగా న్యూరోట్రాన్స్మిటర్ వ్యవస్థలను క్రింది విధంగా విభజించవచ్చు. న్యూరోట్రాన్స్మిటర్పై స్ట్రెస్ ప్రభావం ఎలా ఉంటుంది? రోజువారీ స్ట్రెస్‌ను ఎండార్ఫిన్లు నిభాయిస్తాయి. వీటిని సద్భావ నాడీ రసాయనిక ప్రసారకాలు Feel good transmiter (సద్భావ న్యూరో ట్రాన్స్మిటర్లు) అని కూడా అంటారు. అధికమైన లేదా పరిమితికి మించిన స్ట్రెస్‌ను తట్టుకోవడానికి ఎక్కువ మొత్తంలో ఎండార్ఫిన్లను మెదడు కణాలు ఉత్పత్తి చేయవలసి ఉంటుంది. దీనితో ఇతర న్యూరోట్రాన్స్ మిటర్లతో ఎండార్ఫిన్ల మధ్యన ఉన్న నిష్పత్తిలో తేడాలు అధికమై రసాయనిక అసమతుల్యత ఏర్పడుతుంది. ఆకస్మికంగా ఎదుర్కొనే స్ట్రెస్ (acute stress) దానిని ఎదుర్కొనే సందర్భంలో వచ్చే ఆతురత, అత్యవసర ప్రేరణలు స్ట్రెస్ పాళ్లను మరింత పెంచుతాయి. ఈ ప్రక్రియలో అనవసర లేదా హానికర రసాయనిక పదార్థాలు విడుదలై శరీరానికి మరింత నష్టం జరుగుతుంది. వరుసక్రమంలో వచ్చే ఈ క్లిష్ట రసాయనిక మార్పులను స్ట్రెస్ చక్రం- Stress Cycle అంటారు. శరీర అవయవాలపై స్ట్రెస్ ప్రభావం ఎలా ఉంటుంది? శరీరంలోని అన్ని అవయవాలు, వాటి పనితీరుపై స్ట్రెస్ ప్రభావం ఉంటుంది. శరీరంపై స్ట్రెస్ ప్రభావం పెరిగినకొద్దీ ఒక వరుస క్రమంలో శరీర సాధారణ క్రియలలో మార్పులు వస్తాయి. ప్రధానంగా ఎడ్రినాలిన్ ఉత్పత్తి పెరుగుతుంది. రక్తప్రసరణల లేదా రక్తపోటు పెరుగుదల, గుండెచలన రేటుతో పాటు కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. జీర్ణ ప్రక్రియ తగ్గుదల లేదా ఆగిపోవటం జరుగుతుంది. అడ్రినాలిన్ ఉత్పత్తి అధికమైనకొద్దీ శరీరానికి కావలసిన అధికశక్తిని అందించ టానికి ప్రొటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్ల మెటబాలిజమ్ అధికమవుతుంది. శరీరం లోని పిట్యుటరీగ్రంథి ఎడ్రినా కార్బికో ట్రోఫిక్ హార్మోను-ACTH ఉత్పత్తిని అధికం చేస్తుంది. ఈ హార్మోను కార్టిజోన్, కార్టిజోన్ హార్మోన్ల విడుదలకు ప్రేరణ కలిగిస్తుంది. ఈ హార్మోన్లు రోగక్రిములతో పోరాడే రక్తంలోని తెల్లకణాల ఉత్పత్తిని నిరోధిస్తాయి. రోగరక్షక వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థ తాలూకు విధులను నిర్వహించకుండా నిరోధిస్తాయి. ఇటీవల చూస్తున్న అనేక ప్రధాన రోగాలలో 80 శాతం స్ట్రెస్ కారణంగానే వస్తున్నాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలోని ఆరోగ్య వైద్య సంస్థ ప్రస్తుతం చూస్తున్న అన్నిరకాల రుగ్మతలకు 75 శాతం రోగకారణం స్ట్రెస్ అనే గుర్తించారు. వైద్యులు రోజువారి చూసే రోగులలో 75-90 శాతం మందికి స్ట్రెస్ కారణంగా వచ్చే రోగాలకు చికిత్సను అందిస్తున్నట్లు ఒక అంచనా. ఆకస్మిక స్ట్రెస్ శరీర రసాయనికస్థితిని విచ్ఛిన్నం చేస్తుంది. స్ట్రెస్ కారకం దీర్ఘకాలం కొనసాగుతుంటే శారీరక, మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంది. శరీరరోగ రక్షణ వ్యవస్థ బలహీనపడి క్యాన్సర్, డయాబెటిస్, రుమాటిజమ్, జీర్ణకోశవ్యాధుల తీవ్రత పెరుగుతుంది. స్ట్రెస్... రోగముల తీవ్రతను పెంచటానికే కాక, రోగం తగ్గడాన్ని, రోగం తగ్గిన తరువాత కోలుకోవడాన్ని కూడా నిరోధిస్తుంది. ఏ విధంగా చూసినా శారీరక ఆరోగ్య సంక్షేమంలో స్ట్రెస్ కీలకపాత్ర పోషిస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. అందుచే తప్పనిసరిగా అదనపు, అధికస్ట్రెస్ బాధలను ఎప్పటికప్పుడు తగ్గించుకోవాల్సి ఉంటుంది. హోమియో చికిత్స న్యూరోట్రాన్స్మిటర్ల రసాయనిక చర్య, ప్రతిచర్యలను పరిగణనలోకి తీసుకొని దానికి ఏమైనా లక్షణాలు ఉన్నాయా, ఆ మనిషి ఏ విధంగా దీన్ని తట్టుకోగలుగుతున్నాడు, ఈ న్యూరోట్రాన్స్మిటర్స్ ప్రభావం శారీరకంగా, మానసికంగా ఎంతవరకు రోగలక్షణాలకు కారణం అవుతున్నాయి, జబ్బుకు ఎంజైమ్ కారణం అవుతుందో నిర్ణయించుకొని రోగి సొరా, సైకోసిస్, సిఫిలిస్లలో మియజంలో ఉన్నాడని దానికి తగ్గ మందులు ఎంత పొటెన్సీలతో ఇవ్వాలన్నది హోమియో డాక్టర్ క్షుణ్ణంగా పరిశీలించి ఇవ్వవలసి ఉంటుంది. డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో), స్టార్ హోమియోపతి, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక www.starhomeo.com ph: 7416107107 / 7416109109 -
మానసిక ఒత్తిడి, ఆందోళనలో న్యూరోట్రాన్స్మీటర్స్ పాత్ర!
మానవ మెదడులో 10 బిలియన్ల న్యూరాన్లు (మెదడు కణాలు) ఉంటాయి. ప్రతి ఒక్క కణం, తక్కిన కణాలతో రసాయనికంగా అనుసంధానించబడి ఒకదానితో ఒకటి సందేశాలను మార్చుకొంటూ ఉంటాయి. ఈ అనుసంధానకాలను న్యూరో ట్రాన్స్మిటర్లు లేదా రసాయనిక ప్రసారకాలు (Neurotransmeter or Chemical messengers) అంటారు. మన ఆవేశ అనుభూతులను న్యూరోట్రాన్స్మిటర్లు అదుపుచేస్తాయి. మెదడులోని ఆవేశ కేంద్రం (Emotion Center) లో ఐదు రకాల రసాయనిక పదార్థాలు లేదా న్యూరోట్రాన్స్మిటర్లు ఉంటాయి. అధికమైన న్యూరోట్రాన్స్మిటర్లకు, ఇతర న్యూరో ట్రాన్స్మిటర్ల మధ్యన ఉండవలసిన నిష్పత్తిలో తేడా వచ్చి రసాయనిక సమతుల్యత చెడుతుంది. ఈ దశలోనే మనకు ఎక్కువగా స్ట్రెస్ అనుభవంలోనికి వస్తుంది. దీని ఫలితంగా శరీరంలో విడుదలైన హానికరమైన రసాయనిక పదార్థాలు, శరీర కణాలకు హాని చేసి మరింత స్ట్రెస్ పెరుగుదలకు కారణమవుతంది. ఈ విధంగా వరుసగా వచ్చే క్లిష్ట రసాయనిక మార్పులను స్ట్రెస్ చక్రం (Stress Cycle) అంటారు. దీని ఫలితంగా ఆవేశపరమైన నిస్త్రాణ (Emotional Fatigue), డిప్రెషన్ అనుభవంలోకి వస్తాయి. మన ఆవేశ అనుభూతులకు అదుపు చేసే న్యూరోట్రాన్స్మిటర్లు మెదడులోని కణాల మధ్య ఆవేశ-అనుభూతులను ఒక దానికొకటి సందేశాలను మార్చుకొనడంలో ప్రధానపాత్ర వహించే రసాయనిక సంధానకాలను న్యూరోట్రాన్స్మిటర్ లేదా నాడీరసాయనిక ప్రసారకాలు అంటారన్న విషయం తెలిసిందే. ప్రధానంగా న్యూరోట్రాన్స్మిటర్ వ్యవస్థలను క్రింది విధంగా విభజించవచ్చు. న్యూరోట్రాన్స్మిటర్పై స్ట్రెస్ ప్రభావం ఎలా ఉంటుంది? రోజువారి స్ట్రెస్‌ను ఎండార్ఫిన్లు నిభాయిస్తాయి. వీటిని సద్భావ నాడీ రసాయనిక ప్రసారకాలు Feel good transmiter (సద్భావ న్యూరో ట్రాన్స్మిటర్లు) అని కూడా అంటారు. అధికమైన లేదా పరిమితికి మించిన స్ట్రెస్‌ను తట్టుకోడానికి ఎక్కువ మొత్తంలో ఎండార్ఫిన్లను మెదడు కణాలు ఉత్పత్తి చేయవలసి ఉంటుంది. దీనిలో ఇతర న్యూరోట్రాన్స్‌మిటర్‌లతో ఎండార్ఫిన్ల మధ్యన ఉన్న నిష్పత్తిలో తేడాలు అధికమై రసాయనిక అసమతుల్యత ఏర్పడుతుంది. ఆకస్మికంగా ఎదుర్కొనే స్ట్రెస్ (acute stress) దానిని ఎదుర్కొనే సందర్భంలో వచ్చే ఆతురత, అత్యవసర ప్రేరణలు స్ట్రెస్ పాళ్లను మరింత పెంచుతాయి. ఈ ప్రక్రియలో అనవసర లేదా హానికర రసాయనిక పదార్థాలు విడుదలై శరీరానికి మరింత నష్టం జరుగుతుంది. వరుసక్రమంలో వచ్చే ఈ క్లిష్ట రసాయనిక మార్పులను స్ట్రెస్ చక్రం-Stress Cycle అంటారు. శరీర అవయవాలపై స్ట్రెస్ ప్రభావం ఎలా ఉంటుంది? శరీరంలోని అన్ని అవయవాలు, వాటి పని తీరుపై స్ట్రెస్ ప్రభావం ఉంటుంది. శరీరంపై స్ట్రెస్ ప్రభావం పెరిగినకొద్దీ ఒక వరుస క్రమంలో శరీర సాధారణ క్రియలలో మార్పులు వస్తాయి. ప్రధానంగా ఎడ్రినాలిన్ ఉత్పత్తి పెరుగుతుంది. రక్తప్రసరణల లేదా రక్తపోటు పెరుగుదల, గుండె చలన రేటుతో పాటు కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. జీర్ణ ప్రక్రియ తగ్గుదల లేదా ఆగిపోవటం జరుగుతుంది. ఆడ్రినాలిన్ ఉత్పత్తి అధికమైనకొద్దీ శరీరానికి కావలసిన అధికశక్తిని అందించటానికి ప్రొటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్ల మెటబాలిజమ్ అధికమవుతుంది. శరీరంలోని పిట్యుటరీగ్రంథి ఎడ్రినా కార్బికో ట్రోఫిక్ హార్మోను-ACTH ఉత్పత్తిని అధికం చేస్తుంది. ఈ హార్మోను కార్టిజోన్, కార్టిజోన్ హార్మోన్ల విడుదలకు ప్రేరణ కలిగిస్తుంది. ఈ హార్మోన్లు రోగక్రిములతో పోరాడే రక్తంలోని తెల్లకణాల ఉత్పత్తిని నిరోధిస్తాయి. రోగరక్షక వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థ తాలూకు విధులను నిర్వహించకుండా నిరోధిస్తాయి. ఇటీవల చూస్తున్న అనేక ప్రధాన రోగాలలో 80 శాతం స్ట్రెస్ కారణంగానే వస్తున్నాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలోని ఆరోగ్య వైద్య సంస్థ ప్రస్తుతం చూస్తున్న అన్నిరకాల రుగ్మతలకు 75 శాతం రోగ కారణం స్ట్రెస్ అనే గుర్తించారు. వైద్యులు రోజువారి చూసే రోగులలో 75-90 శాతం మందికి స్ట్రెస్ కారణంగా వచ్చే రోగాలకు చికిత్సను అందిస్తున్నట్లు ఒక అంచనా. ఆకస్మిక స్ట్రెస్ శరీర రసాయనిక స్థితిని విచ్ఛిన్నం చేస్తుంది. స్ట్రెస్ కారకం దీర్ఘకాలం కొనసాగుతుంటే శారీరక, మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంది. శరీరరోగ రక్షణ వ్యవస్థ బలహీనపడి క్యాన్సర్, డయాబెటిస్, రుమాటిజమ్, జీర్ణకోశవ్యాధుల తీవ్రత పెరుగుతుంది. స్ట్రెస్ అన్నది రోగాల తీవ్రతను పెంచటానికే కాక, రోగం తగ్గడాన్ని, రోగం తగ్గిన తరువాత కోలుకోవడాన్ని కూడా నిరోధిస్తుంది. ఏ విధంగా చూసినా శారీరక ఆరోగ్య సంక్షేమంలో స్ట్రెస్ లేకపోవడం అన్నది చాలా కీలకపాత్ర పోషిస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. అందువలన తప్పనిసరిగా అదనపు అధిక స్ట్రెస్ బాధలను ఎప్పటికప్పుడు తగ్గించుకోవాల్సి ఉంటుంది. హోమియో చికిత్స ఈ న్యూరోట్రాన్స్మిటర్ల రసాయనిక చర్య, ప్రతిచర్యలను పరిగణనలోకి తీసుకొని, లక్షణాలను బట్టి, ఆ మనిషి ఏ విధంగా దీన్ని తట్టుకోగలుగుతున్నాడు, ఈ న్యూరోట్రాన్స్మిటర్స్ ప్రభావం ఎంతవరకు రోగలక్షణాలకు కారణం అవుతున్నాయి, జబ్బుకు ఏ మియజమ్ కారణం అవుతుంది, మూడు మియాజమ్లైన సొరా, సైకోసిస్, సిఫిలిస్లలో ఏది ప్రభావితమవుతోంది, దానికి తగ్గ మందులు ఎంత పొటెన్సీలతో ఇవ్వాలన్నది హోమియో డాక్టర్ క్షుణ్ణంగా పరిశీలించి ఇవ్వవలసి ఉంటుంది. డాక్టర్ మురళి అంకిరెడ్డి, ఎం.డి (హోమియో), స్టార్ హోమియోపతి, సికింద్రాబాద్, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక www.starhomeo.com ph: 7416107107 / 7416109109