మానసిక ఒత్తిడి, ఆందోళనలో న్యూరోట్రాన్స్‌మీటర్స్ పాత్ర! | Neurotransmeter role in Mental stain, anxiety | Sakshi
Sakshi News home page

మానసిక ఒత్తిడి, ఆందోళనలో న్యూరోట్రాన్స్‌మీటర్స్ పాత్ర!

Published Thu, Aug 15 2013 12:34 AM | Last Updated on Sat, Oct 20 2018 7:38 PM

మానసిక ఒత్తిడి, ఆందోళనలో న్యూరోట్రాన్స్‌మీటర్స్ పాత్ర! - Sakshi

మానసిక ఒత్తిడి, ఆందోళనలో న్యూరోట్రాన్స్‌మీటర్స్ పాత్ర!

మానవ మెదడులో 10 బిలియన్ల న్యూరాన్లు (మెదడు కణాలు) ఉంటాయి. ప్రతి ఒక్క కణం, తక్కిన కణాలతో రసాయనికంగా అనుసంధానించబడి ఒకదానితో ఒకటి సందేశాలను మార్చుకొంటూ ఉంటాయి. ఈ అనుసంధానకాలను న్యూరో ట్రాన్స్‌మిటర్‌లు లేదా రసాయనిక ప్రసారకాలు (Neurotransmeter or Chemical messengers) అంటారు. మన ఆవేశ అనుభూతులను న్యూరోట్రాన్స్‌మిటర్‌లు అదుపుచేస్తాయి. మెదడులోని ఆవేశ కేంద్రం (Emotion Center) లో ఐదు రకాల రసాయనిక పదార్థాలు లేదా న్యూరోట్రాన్స్‌మిటర్‌లు ఉంటాయి. అధికమైన న్యూరోట్రాన్స్‌మిటర్‌లకు, ఇతర న్యూరో ట్రాన్స్‌మిటర్‌ల మధ్యన ఉండవలసిన నిష్పత్తిలో తేడా వచ్చి రసాయనిక సమతుల్యత చెడుతుంది. ఈ దశలోనే మనకు ఎక్కువగా స్ట్రెస్ అనుభవంలోనికి వస్తుంది. దీని ఫలితంగా శరీరంలో విడుదలైన హానికరమైన రసాయనిక పదార్థాలు, శరీర కణాలకు హాని చేసి మరింత స్ట్రెస్ పెరుగుదలకు కారణమవుతంది. ఈ విధంగా వరుసగా వచ్చే క్లిష్ట రసాయనిక మార్పులను స్ట్రెస్ చక్రం (Stress Cycle) అంటారు. దీని ఫలితంగా ఆవేశపరమైన నిస్త్రాణ (Emotional Fatigue), డిప్రెషన్ అనుభవంలోకి వస్తాయి.
 
 మన ఆవేశ అనుభూతులకు అదుపు చేసే న్యూరోట్రాన్స్‌మిటర్‌లు
 మెదడులోని కణాల మధ్య ఆవేశ-అనుభూతులను ఒక దానికొకటి సందేశాలను మార్చుకొనడంలో ప్రధానపాత్ర వహించే రసాయనిక సంధానకాలను న్యూరోట్రాన్స్‌మిటర్ లేదా నాడీరసాయనిక ప్రసారకాలు అంటారన్న విషయం తెలిసిందే. ప్రధానంగా న్యూరోట్రాన్స్‌మిటర్ వ్యవస్థలను క్రింది విధంగా విభజించవచ్చు.
 
 న్యూరోట్రాన్స్‌మిటర్‌పై స్ట్రెస్ ప్రభావం ఎలా ఉంటుంది?
 రోజువారి స్ట్రెస్‌ను ఎండార్ఫిన్‌లు నిభాయిస్తాయి. వీటిని సద్భావ నాడీ రసాయనిక ప్రసారకాలు Feel good transmiter  (సద్భావ న్యూరో ట్రాన్స్‌మిటర్‌లు) అని కూడా అంటారు. అధికమైన లేదా పరిమితికి మించిన స్ట్రెస్‌ను తట్టుకోడానికి ఎక్కువ మొత్తంలో ఎండార్ఫిన్‌లను మెదడు కణాలు ఉత్పత్తి చేయవలసి ఉంటుంది. దీనిలో ఇతర న్యూరోట్రాన్స్‌మిటర్‌లతో ఎండార్ఫిన్‌ల మధ్యన ఉన్న నిష్పత్తిలో తేడాలు అధికమై రసాయనిక అసమతుల్యత ఏర్పడుతుంది. ఆకస్మికంగా ఎదుర్కొనే స్ట్రెస్ (acute stress) దానిని ఎదుర్కొనే సందర్భంలో వచ్చే ఆతురత, అత్యవసర ప్రేరణలు స్ట్రెస్ పాళ్లను మరింత పెంచుతాయి. ఈ ప్రక్రియలో అనవసర లేదా హానికర రసాయనిక పదార్థాలు విడుదలై శరీరానికి మరింత నష్టం జరుగుతుంది. వరుసక్రమంలో వచ్చే ఈ క్లిష్ట రసాయనిక మార్పులను స్ట్రెస్ చక్రం-Stress Cycle అంటారు.
 
 శరీర అవయవాలపై స్ట్రెస్ ప్రభావం ఎలా ఉంటుంది?

 శరీరంలోని అన్ని అవయవాలు, వాటి పని తీరుపై స్ట్రెస్ ప్రభావం ఉంటుంది. శరీరంపై స్ట్రెస్ ప్రభావం పెరిగినకొద్దీ ఒక వరుస క్రమంలో శరీర సాధారణ క్రియలలో మార్పులు వస్తాయి. ప్రధానంగా ఎడ్రినాలిన్ ఉత్పత్తి పెరుగుతుంది. రక్తప్రసరణల లేదా రక్తపోటు పెరుగుదల, గుండె చలన రేటుతో పాటు కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. జీర్ణ ప్రక్రియ తగ్గుదల లేదా ఆగిపోవటం జరుగుతుంది.
 
ఆడ్రినాలిన్ ఉత్పత్తి అధికమైనకొద్దీ శరీరానికి కావలసిన అధికశక్తిని అందించటానికి ప్రొటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్ల మెటబాలిజమ్ అధికమవుతుంది. శరీరంలోని పిట్యుటరీగ్రంథి ఎడ్రినా కార్బికో ట్రోఫిక్ హార్మోను-ACTH ఉత్పత్తిని అధికం చేస్తుంది. ఈ హార్మోను కార్టిజోన్, కార్టిజోన్ హార్మోన్ల విడుదలకు ప్రేరణ కలిగిస్తుంది. ఈ హార్మోన్లు రోగక్రిములతో పోరాడే రక్తంలోని తెల్లకణాల ఉత్పత్తిని నిరోధిస్తాయి. రోగరక్షక వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థ తాలూకు విధులను నిర్వహించకుండా నిరోధిస్తాయి.
 
ఇటీవల చూస్తున్న అనేక ప్రధాన రోగాలలో 80 శాతం స్ట్రెస్ కారణంగానే వస్తున్నాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలోని ఆరోగ్య వైద్య సంస్థ ప్రస్తుతం చూస్తున్న అన్నిరకాల రుగ్మతలకు 75 శాతం రోగ కారణం స్ట్రెస్ అనే గుర్తించారు. వైద్యులు రోజువారి చూసే రోగులలో 75-90 శాతం మందికి స్ట్రెస్ కారణంగా వచ్చే రోగాలకు చికిత్సను అందిస్తున్నట్లు ఒక అంచనా. ఆకస్మిక స్ట్రెస్ శరీర రసాయనిక స్థితిని విచ్ఛిన్నం చేస్తుంది. స్ట్రెస్ కారకం దీర్ఘకాలం కొనసాగుతుంటే శారీరక, మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంది. శరీరరోగ రక్షణ వ్యవస్థ బలహీనపడి క్యాన్సర్, డయాబెటిస్, రుమాటిజమ్, జీర్ణకోశవ్యాధుల తీవ్రత పెరుగుతుంది. స్ట్రెస్ అన్నది రోగాల తీవ్రతను పెంచటానికే కాక, రోగం తగ్గడాన్ని, రోగం తగ్గిన తరువాత కోలుకోవడాన్ని కూడా నిరోధిస్తుంది.
 
ఏ విధంగా చూసినా శారీరక ఆరోగ్య సంక్షేమంలో స్ట్రెస్ లేకపోవడం అన్నది చాలా కీలకపాత్ర పోషిస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. అందువలన తప్పనిసరిగా అదనపు అధిక స్ట్రెస్ బాధలను ఎప్పటికప్పుడు తగ్గించుకోవాల్సి ఉంటుంది.
 
హోమియో చికిత్స
ఈ న్యూరోట్రాన్స్‌మిటర్‌ల రసాయనిక చర్య, ప్రతిచర్యలను పరిగణనలోకి తీసుకొని, లక్షణాలను బట్టి, ఆ మనిషి ఏ విధంగా దీన్ని తట్టుకోగలుగుతున్నాడు, ఈ న్యూరోట్రాన్స్‌మిటర్స్ ప్రభావం  ఎంతవరకు రోగలక్షణాలకు కారణం అవుతున్నాయి, జబ్బుకు ఏ మియజమ్ కారణం అవుతుంది, మూడు మియాజమ్‌లైన సొరా, సైకోసిస్, సిఫిలిస్‌లలో ఏది ప్రభావితమవుతోంది,  దానికి తగ్గ మందులు ఎంత పొటెన్సీలతో ఇవ్వాలన్నది హోమియో డాక్టర్ క్షుణ్ణంగా పరిశీలించి ఇవ్వవలసి ఉంటుంది.

డాక్టర్ మురళి అంకిరెడ్డి,
 ఎం.డి (హోమియో),
 స్టార్ హోమియోపతి,
 సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్,  కూకట్‌పల్లి,
 విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి,
 రాజమండ్రి, కర్ణాటక
 www.starhomeo.com
 ph: 7416107107 / 7416109109

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement