మానసిక ఒత్తిడి, ఆందోళనలో న్యూరోట్రాన్స్‌మిటర్స్ పాత్ర!
మానవ మెదడులో 10 బిలియన్ల న్యూరాన్లు (మెదడు కణాలు) ఉంటాయి. ప్రతి ఒక్క కణం, తక్కిన కణాలతో రసాయనికంగా అనుసంధానించబడి ఒకదానితో ఒకటి సందేశాలను మార్చుకొంటూ ఉంటాయి. ఈ అనుసంధానకాలను న్యూరోట్రాన్స్‌మిటర్‌లు లేదా రసాయనిక ప్రసారకాలు (Neurotransmeter or Chemical messengers) అంటారు. మన ఆవేశ అనుభూతులను న్యూరోట్రాన్స్‌మిటర్‌లు అదుపుచేస్తాయి.
మెదడులోని ఆవేశకేంద్రం (Emotion Center) లో ఐదు రకాల రసాయనిక పదార్థాలు లేదా న్యూరోట్రాన్స్‌మిటర్‌లు ఉంటాయి. అధికమైన స్ట్రెస్‌ను ఎదుర్కోవడానికి ఎండార్ఫిన్‌ల శాతం అధికంగా కావలసి ఉంటుంది. ఈ విధంగా అధికమైన న్యూరోట్రాన్స్‌మిటర్‌లకు, ఇతర న్యూరో ట్రాన్స్‌మిటర్‌ల మధ్యన ఉండవలసిన నిష్పత్తిలో తేడా వచ్చి రసాయనిక సమతుల్యత చెడుతుంది.
ఈ దశలోనే మనకు ఎక్కువగా స్ట్రెస్ అనుభవంలోకి వస్తుంది. దీని ఫలితంగా శరీరంలో విడుదలైన హానికరమైన రసాయనిక పదార్థాలు, శరీర కణాలకు హాని చేసి మరింత స్ట్రెస్ పెరుగుదలకు కారణమవుతుంది. ఈ విధంగా వరుసగా వచ్చే క్లిష్ట రసాయనిక మార్పులను ‘స్ట్రెస్ చక్రం’ (Stress Cycle) అంటారు. దీని ఫలితంగా ఆవేశపరమైన నిస్త్రాణ (Emotional Fatigue), డిప్రెషన్ అనుభవంలోకి వస్తాయి.
ఆవేశ అనుభూతులను అదుపు చేసే న్యూరోట్రాన్స్‌మిటర్‌లు
మెదడులోని కణాల మధ్య ఆవేశ-అనుభూతులను ఒక దానికొకటి సందేశాలను మార్చుకొనడంలో ప్రధానపాత్ర వహించే రసాయనిక సంధానకాలను న్యూరోట్రాన్స్‌మిటర్ లేదా నాడీరసాయనిక ప్రసారకాలు అంటారని ఇప్పటికే తెలుసుకున్నాం కదా! ప్రధానంగా న్యూరోట్రాన్స్‌మిటర్ వ్యవస్థలను క్రింది విధంగా విభజించవచ్చు.
న్యూరోట్రాన్స్‌మిటర్‌పై స్ట్రెస్ ప్రభావం ఎలా ఉంటుంది?
రోజువారీ స్ట్రెస్‌ను ఎండార్ఫిన్‌లు నిభాయిస్తాయి. వీటిని సద్భావ నాడీ రసాయనిక ప్రసారకాలు Feel good transmiter (సద్భావ న్యూరో ట్రాన్స్‌మిటర్‌లు) అని కూడా అంటారు. అధికమైన లేదా పరిమితికి మించిన స్ట్రెస్‌ను తట్టుకోవడానికి ఎక్కువ మొత్తంలో ఎండార్ఫిన్‌లను మెదడు కణాలు ఉత్పత్తి చేయవలసి ఉంటుంది. దీనితో ఇతర న్యూరోట్రాన్స్ మిటర్‌లతో ఎండార్ఫిన్‌ల మధ్యన ఉన్న నిష్పత్తిలో తేడాలు అధికమై రసాయనిక అసమతుల్యత ఏర్పడుతుంది. ఆకస్మికంగా ఎదుర్కొనే స్ట్రెస్ (acute stress) దానిని ఎదుర్కొనే సందర్భంలో వచ్చే ఆతురత, అత్యవసర ప్రేరణలు స్ట్రెస్ పాళ్లను మరింత పెంచుతాయి. ఈ ప్రక్రియలో అనవసర లేదా హానికర రసాయనిక పదార్థాలు విడుదలై శరీరానికి మరింత నష్టం జరుగుతుంది. వరుసక్రమంలో వచ్చే ఈ క్లిష్ట రసాయనిక మార్పులను స్ట్రెస్ చక్రం- Stress Cycle అంటారు.
శరీర అవయవాలపై స్ట్రెస్ ప్రభావం ఎలా ఉంటుంది?
శరీరంలోని అన్ని అవయవాలు, వాటి పనితీరుపై స్ట్రెస్ ప్రభావం ఉంటుంది. శరీరంపై స్ట్రెస్ ప్రభావం పెరిగినకొద్దీ ఒక వరుస క్రమంలో శరీర సాధారణ క్రియలలో మార్పులు వస్తాయి. ప్రధానంగా ఎడ్రినాలిన్ ఉత్పత్తి పెరుగుతుంది. రక్తప్రసరణల లేదా రక్తపోటు పెరుగుదల, గుండెచలన రేటుతో పాటు కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. జీర్ణ ప్రక్రియ తగ్గుదల లేదా ఆగిపోవటం జరుగుతుంది.
అడ్రినాలిన్ ఉత్పత్తి అధికమైనకొద్దీ శరీరానికి కావలసిన అధికశక్తిని అందించ టానికి ప్రొటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్ల మెటబాలిజమ్ అధికమవుతుంది. శరీరం లోని పిట్యుటరీగ్రంథి ఎడ్రినా కార్బికో ట్రోఫిక్ హార్మోను-ACTH ఉత్పత్తిని అధికం చేస్తుంది. ఈ హార్మోను కార్టిజోన్, కార్టిజోన్ హార్మోన్ల విడుదలకు ప్రేరణ కలిగిస్తుంది. ఈ హార్మోన్లు రోగక్రిములతో పోరాడే రక్తంలోని తెల్లకణాల ఉత్పత్తిని నిరోధిస్తాయి. రోగరక్షక వ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థ తాలూకు విధులను నిర్వహించకుండా నిరోధిస్తాయి.
ఇటీవల చూస్తున్న అనేక ప్రధాన రోగాలలో 80 శాతం స్ట్రెస్ కారణంగానే వస్తున్నాయని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలోని ఆరోగ్య వైద్య సంస్థ ప్రస్తుతం చూస్తున్న అన్నిరకాల రుగ్మతలకు 75 శాతం రోగకారణం స్ట్రెస్ అనే గుర్తించారు. వైద్యులు రోజువారి చూసే రోగులలో 75-90 శాతం మందికి స్ట్రెస్ కారణంగా వచ్చే రోగాలకు చికిత్సను అందిస్తున్నట్లు ఒక అంచనా. ఆకస్మిక స్ట్రెస్ శరీర రసాయనికస్థితిని విచ్ఛిన్నం చేస్తుంది. స్ట్రెస్ కారకం దీర్ఘకాలం కొనసాగుతుంటే శారీరక, మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంది. శరీరరోగ రక్షణ వ్యవస్థ బలహీనపడి క్యాన్సర్, డయాబెటిస్, రుమాటిజమ్, జీర్ణకోశవ్యాధుల తీవ్రత పెరుగుతుంది. స్ట్రెస్... రోగముల తీవ్రతను పెంచటానికే కాక, రోగం తగ్గడాన్ని, రోగం తగ్గిన తరువాత కోలుకోవడాన్ని కూడా నిరోధిస్తుంది.
ఏ విధంగా చూసినా శారీరక ఆరోగ్య సంక్షేమంలో స్ట్రెస్ కీలకపాత్ర పోషిస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. అందుచే తప్పనిసరిగా అదనపు, అధికస్ట్రెస్ బాధలను ఎప్పటికప్పుడు తగ్గించుకోవాల్సి ఉంటుంది.
హోమియో చికిత్స
న్యూరోట్రాన్స్‌మిటర్‌ల రసాయనిక చర్య, ప్రతిచర్యలను పరిగణనలోకి తీసుకొని దానికి ఏమైనా లక్షణాలు ఉన్నాయా, ఆ మనిషి ఏ విధంగా దీన్ని తట్టుకోగలుగుతున్నాడు, ఈ న్యూరోట్రాన్స్‌మిటర్స్ ప్రభావం శారీరకంగా, మానసికంగా ఎంతవరకు రోగలక్షణాలకు కారణం అవుతున్నాయి, జబ్బుకు ఎంజైమ్ కారణం అవుతుందో నిర్ణయించుకొని రోగి సొరా, సైకోసిస్, సిఫిలిస్‌లలో మియజంలో ఉన్నాడని దానికి తగ్గ మందులు ఎంత పొటెన్సీలతో ఇవ్వాలన్నది హోమియో డాక్టర్ క్షుణ్ణంగా పరిశీలించి ఇవ్వవలసి ఉంటుంది.
డాక్టర్ మురళి అంకిరెడ్డి,
ఎం.డి (హోమియో),
స్టార్ హోమియోపతి,
సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్, కూకట్‌పల్లి,
విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి,
రాజమండ్రి, కర్ణాటక
www.starhomeo.com
ph: 7416107107 / 7416109109