
ఇదొక వాట్సాప్ కథ. దీంట్లో విలన్ జుకర్‌బర్గ్. హీరో నవీన్. ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేటప్పటికల్లా హీరో నవీన్ విలన్ అయిపోతాడు. జుకర్‌బర్గ్ జక్కుమని బర్గర్ అయిపోతాడు. హీరోయిన్ స్వాతి ముత్యం. చిన్న మరక కూడా యాక్సెప్ట్ చెయ్యదు. మరి ప్రేమలో ఉన్నప్పుడు అరమరికలు ఉంటాయి కదా. అలాంటి ఒక ఇన్సిడెంట్ వల్ల క్లయిమాక్స్ వచ్చేటప్పటికల్లా హీరోయిన్ డిప్రెషన్‌లోకి వెళ్లిపోతుంది. జుకర్‌బర్గ్ చాలా ట్రై చేస్తాడు. ‘మళ్లీ కనెక్ట్ అవ్వు.. మళ్లీ కనెక్ట్ అవ్వు’ అని. హీరో చాలా ప్రాధేయపడతాడు. ‘మళ్లీ కనెక్ట్ అవ్వు.. మళ్లీ కనెక్ట్ అవ్వు’ అని. థియేటర్‌లో ఉన్న ఆడియెన్స్ అంతా వాట్సప్? వాట్సప్ అని బోరుమంటారు. ఒక్క ముక్క అర్థం కాలేదు కదా. ఇప్పుడు సింపుల్‌గా చెప్తాం. స్వాతి అనే అమ్మాయి నవీన్ అనే బాయ్‌ఫ్రెండ్‌కి వాట్సాప్ మెజేస్ పంపించింది.
వాడు మెసేజ్ చూశాడన్న విషయం బ్లూటిక్‌లు చూసి స్వాతికి అర్థమైంది. పది సెకన్లు ఆగింది. అర నిమిషం ఆగింది. వన్ మినిట్ ఆగింది. అంటే హోల్ మొత్తం అరవై సెకన్లు! అయినా రిప్లయ్ రాలేదు. అంతే.. జుకర్‌బర్గ్‌కి ఓపెన్ లెటర్ రాసింది. ‘ఎందుకయ్యా వాట్సాప్! నువ్వు ప్రేమకు విలన్. ప్రేమికులకు ప్రతినాయకుడివి. వాట్సాప్‌లో బ్లూటిక్కు ఇక్కడ పడిందంటే.. హీరో చూసీ చూడనట్లు ఉన్నట్టేగా? అంటే వాడికి నేనంటే ఇంట్రెస్ట్ లేదనేగా? అంటే వాడికి ఇంకెవరో ఇంట్రెస్ట్ అని కదా? అర్థం చేసుకో జుకర్. వాడు నేనేసే దోసె కాకుండా ఇంకెక్కడో బర్గర్ తింటున్నాడు. అందుకే ఇవాళ్టి నుంచి నేను వాట్సాప్‌లో ఉండడం లేదు’ అని రాసింది. టెక్నాలజీ మనుషులను దగ్గర చేస్తుంది కానీ, సహనం నశించేలా చేస్తుంది. అపార్థాలకు వారధి అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment