
పున్నమిరాత్రి
హృదయము లోపలి రోదసి
నీలినయనాల రాలిపడి
కాన్‌స్పిరటోరియల్ కన్నుల
వెన్నెల
వెండి వెన్నెల పండు వెన్నెల
నిండాతి నిండు వెన్నెల
మోహజాలము వలదేహము
ఏక్ ఐసా జిస్మ్
మేఘ మల్‌హరి శిలరంజని
నీతోపాటు పరిచయమైన పాట
అదియొక మర్మకవిత
స్వప్నములు విసిరిసిరి జల్లుకో
ఎనదర్ ఆన్ సెట్!
కభీ కభీ ఐసాభీతో హోతాహై జిందగీమే!
ఆకాశం వెండికొలను
నిండు కలువ చంద్రవదన
బంజారాహిల్స్ టు పంజగుట్ట
రోడ్డు మీద శశిరేఖలు
.ై.
ఎల్.ఇ.డి రెడ్!
ట్రాఫిక్ సిగ్నల్
రెఫ్లెక్టెడ్ ఆన్ హర్ బుగ్గల్స్
ఎర్రబుగ్గా పచ్చబుగ్గా ఆకుపచ్చ బుగ్గా
(లేక సిగ్గా)
అవుట్‌స్కర్టూ దాటుదాకా
తోడురారా చందురూడా
ఆఖిర్!
మర్నేసే పెహెలే
ప్రకాశించే దేహాలకు ఒక కౌగిలి వింత
తడిసి మెరిసి విరిసి అలసి సొలసే
పట్టణముల్ నగరాల్ హైవేల్ వీడి
స్త్రీ పురుషుల్
చంద్రమావుల వెంట పడి పడి
నువ్వంటె పా..డి..ప్పడి...
- అరుణ్ సాగర్