టీచర్ ఆరోజు తరగతి గదిలోకి రాగానే.. ‘‘ఇవాళ మీరొక పరీక్షను రాయవలసి ఉంటుంది. సిద్ధంగా ఉండండి’’ అన్నారు. విద్యార్థులలో ఆందోళన మొదలైంది. కొద్దిసేపటి తర్వాత ప్రశ్నపత్రాలు వచ్చాయి! ఎప్పటిలా ప్రశ్న పత్రాలను విద్యార్థుల ముందు బోర్లించి ఉంచారు టీచర్. ఆయన చెప్పేవరకు ఎవరూ ప్రశ్నపత్రాలను తిప్పి చూడకూడదు. ‘దేవుడా, ప్రశ్నలు ఎంత కఠినంగా ఉండబోతున్నాయో’ నని విద్యార్థులు బిక్కముఖాలు వేసుకుని కూర్చున్నారు. నిమిషాలు గడుస్తున్నాయి. ‘‘స్టార్ట్’’ అన్నారు టీచర్, చేతివాచీ చూసుకుంటూ. వెంటనే విద్యార్థులంతా ప్రశ్నపత్రాలను తిప్పి చూసుకున్నారు. చూసుకుని, అంతా తెల్లమొహం వేశారు. ప్రశ్నపత్రంలో ప్రశ్నలు లేవు. అదొక తెల్ల కాగితం. కాగితం మధ్యలో మాత్రం ఒక నల్లటి చుక్క ఉంది! టీచర్ వైపు చూశారు. టీచర్ వారి వైపు చూసి, ‘‘కాగితంలో మీరేం చూశారో అదే అక్కడ రాసివ్వండి’’ అని చెప్పారు. పీరియడ్ ముగియబోతుండగా టీచర్ ఆ ప్రశ్నప్రతాలన్నీ తీసుకుని, ఒక్కో పత్రంలో ఏం రాసి ఉందో పెద్దగా చదివి వినిపించడం మొదలు పెట్టారు. అందరూ ఒకటే రాశారు. ‘ఒక నల్లటి చుక్క ఉంది. అది కాగితం మధ్యలో ఉంది’ అని. ‘‘మీరు రాసిన దానిని బట్టి నేను మీకేమీ మార్కులు ఇవ్వబోవడం లేదు. కేవలం మీలో ఆలోచన రేకెత్తించడానికే ఈ పరీక్షను పెట్టాను. మీలో ఎవరూ కాగితంలో తెల్లగా ఉన్న భాగం గురించి రాయలేదు. అందరి దృష్టీ నల్లచుక్క మీదే ఉండిపోయింది.
తప్ప సంతోషాలను పట్టించుకోము. భగవంతుడు ఎంతో ప్రేమతో, ఆపేక్షతో మనకు ఈ జీవితాన్ని గొప్ప వరంలా ప్రసాదించాడు. మన చుట్టూ చాలా సంతోషాలు ఉన్నాయి. ఆహ్లాదకరమైన ప్రకృతి ఉంది. మంచి కుటుంబం ఉంది. మంచి స్నేహితులు ఉన్నారు. బతకడానికి ఒక ఉపాధి ఉంది. వాటిని పట్టించుకోము! ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లోని కలతలు, బయటి కలహాలు.. వీటిచుట్టూ మాత్రమే మనసు తిరుగుతుంటుంది. ఇవన్నీ జీవితంలోని నల్లచుక్కలు. సంతోషాలను మసకబార్చే చుక్కలు. వీటిని తలచుకుని మనం నిస్పృహ చెందకూడదు. జీవితం ఇచ్చిన సంతోషాలను మాత్రమే దైవప్రసాదంలా స్వీకరించి ముందుకు నడవాలి. ప్రతి క్షణాన్నీ ఆనందించాలి’’ అని ముగించారు టీచర్. టీచర్ చెప్పినట్లు.. జీవితం నిండా సంతోషాలే! చిన్న పువ్వు సంతోషం. తేనీటి పరిమళం సంతోషం. సూర్యకిరణం సంతోషం. చంద్రవంక సంతోషం. అసలు మనిషికి మనిషే ఒక సంతోషం! కష్టాలు ఒకటీ రెండే. ఎప్పుడూ ఆ ఒకటీ రెండు గురించే ఆలోచిస్తూ కూర్చుంటే, సంతోషంగా ఎప్పుడు గడుపుతాం? ఇన్ని సంతోషాలను ఇచ్చిన దేవుడికి ఎప్పుడు కృతజ్ఞతలు తెలుపుకుంటాం?
జీవితమే ఒక సంతోషం
Published Wed, Jan 10 2018 11:52 PM | Last Updated on Wed, Jan 10 2018 11:52 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment