ఈ వారం యూటూబ్ హిట్స్ | this week youtube special hit videos | Sakshi
Sakshi News home page

ఈ వారం యూటూబ్ హిట్స్

Published Sun, Oct 23 2016 11:40 PM | Last Updated on Mon, Sep 4 2017 6:06 PM

ఈ వారం యూటూబ్ హిట్స్

ఈ వారం యూటూబ్ హిట్స్

డియర్ జిందగీ: లైఫ్ ఈజ్ ఎ గేమ్ టీజర్
షారుక్ ఖాన్, ఆలియా భట్ ఈ టీజర్‌లో కనిపిస్తారు. ‘మా నాన్న ప్రతి ఆదివారం నన్ను ఇక్కడి తీసుకొచ్చేవారు. సముద్రంతో కబడ్డీ ఆడడానికి’ అంటాడు షారుక్ ఆలియాతో. ‘సముద్రంతో కబడ్డీనా’ ని ఆలియా అడుగుతుంది. సముద్రంతో ఎలా కబడ్డీ ఆడతారో చూపిస్తాడు షారుక్. ఆలియా నవ్వుతుంది. కేరింతలు కొడుతుంది. సముద్రపు ఒడ్డు నుంచి ఇద్దరూ రోడ్డు మీదకు వస్తారు. చెరో సైకిల్ మీద ప్రయాణం మొదలు పెడతారు. ‘‘నాకు స్వేచ్ఛ కావాలి. అన్నిటి నుంచీ స్వేచ్ఛ’’అంటుంది ఆలియా. స్వేచ్ఛను కోరుకుంటే లైఫ్‌లో ఏం దొరుకుతుందో వెంటనే అనుభవంలోకి వస్తుంది ఆలియాకు. షారుక్ నవ్వుతాడు. గౌరీఖాన్, కరణ్‌జోహర్ నిర్మిస్తున్న ‘డియర్ జిందగీ’ నవంబర్ 25న విడుదల అవుతోంది. 
నిడివి : 1 ని. 22 సె., హిట్స్ : 77,88,606

గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ .2 స్నీక్ పీక్
మార్వెల్ కామిక్స్ ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ’ ఆధారంగా వస్తున్న మరో హాలీవుడ్ మూవీ... ‘గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్.2’. రెండేళ్ల క్రితం విడుదలైన ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ’కి ఇది సీక్వెల్. 2017 మే 5 విడుదల అవుతోంది. ఇందులో పీటర్ క్విల్ ఒక సూపర్ హీరో. సగం మనిషి దేహం, సగం గ్రహాంతరవాసి దేహంతో ఉంటాడు. చిన్నప్పుడే అతడిని రావేజర్స్ అనే ఏలియన్ దొంగలముఠా భూమి నుంచి అపహరించుకుని వెళ్లి తమ గ్రహంలో అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటుంది. అక్కడ అతడు గ్రూప్ లీడర్‌గా ఎదుగుతూ ఉంటాడు. అతడిని వెతుక్కుంటూ భూగోళం నుంచి గార్డియన్స్ అంతరిక్షంలోకి వెళతారు. ఆ ప్రయత్నంలో వారు దష్టశక్తులతో పోరాడతారు. ఆ పోరాటాలు ఎంత ఉత్కంఠను రేకెత్తాయో ఈ ట్రైలర్‌లో శాంపిల్‌గా చూడొచ్చు. 
నిడివి : 1 ని. 26 సె., హిట్స్ : 65,51,479

దంగల్: అఫిషియల్ ట్రైలర్
‘దంగల్’ మూవీ గురించి మీరు ఇప్పటికే విని ఉంటారు. తన కూతుళ్లను వరల్డ్ క్లాస్ రెజ్లర్స్‌గా తీర్చిదిద్దిన తండ్రి కథే దంగల్. తండ్రి పాత్రను ఆమిన్‌ఖాన్ పోషిస్తున్నారు. కొడుకు పుడితే రెజ్లర్‌గా తయారు చెయ్యాలని తపిస్తున్న ఆమిర్‌కు వరసగా కూతుళ్లే పుడుతుంటారు. అయితే ఊహించని ఓ సంఘటనతో అతడికి అర్థమౌతుంది... పుట్టిన కూతుళ్లు, పుట్టాలని కోరుకుంటున్న కొడుక్కన్నా ఏం తక్కువ కాదని! వాళ్లకి ట్రైనింగ్ ఇస్తాడు. భారతదేశం గర్వించే కుస్తీ యోధులుగా మలుస్తాడు. దంగల్ అంటే కుస్తీపోటీ అని అర్థం. దంగల్ డిసెంబర్ 23న రిలీజ్ అవుతోంది. నో డౌట్. ఆమిర్ ఖాతాలో ఇది మరొక హిట్. డెరైక్షన్ నితీశ్ తివారి. మ్యూజిక్ ప్రీతమ్.
నిడివి : 3 ని. 25 సె., హిట్స్ : 1,87,97,665

లిటిల్ మిక్స్-షౌట్ ఔట్ టు మై ఎక్స్: వీడియో
లిటిల్ మిక్స్ అనేది బ్రిటిష్ గర్ల్ గ్రూప్. యువ పాప్‌గాయనీ మణుల బృందం. ఇప్పుడీ బృందం ‘షౌట్ ఔట్ టు మై ఎక్స్’ అనే వీడియోను విడుదల చేసింది. అదిప్పుడు యూట్యూబ్‌ను ఊపేస్తోంది. ఈ నలుగురు అమ్మాయిల నాలుగో స్టూడియో ఆల్బమ్ ‘గ్లోరీ డేస్’లోని సింగిల్ ఇది. జేడ్, జెస్సీ, యాన్, పియరీ ఇందులో యాక్ట్ చేశారు. డాన్స్ చేశారు. యూత్‌ని ఎట్రాక్ట్ చేశారు. ‘నా మాజీ బాయ్‌ఫ్రెండ్ ఇంకో అమ్మాయి ప్రేమలో పడ్డాడు. అది నన్ను హర్ట్ చేస్తోంది’ అని పియరీ వెక్కిరింపుగా పాడితే మిగతా ముగ్గురూ వంత పాడతారు. బాయ్‌ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్లు డిలీట్ చేస్తుంటారు. ఫొటోలు చింపేస్తుంటారు. ఇది ఆడపిల్లలకు నచ్చుతుంది. మగపిల్లలకు నచ్చదు. నేచురల్లీ! 
నిడివి : 4ని. 8 సె., హిట్స్ : 96,04,282

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement