మెడి క్షనరీ
సూర్యకాంతికి భయపడి భూతాలు పగటివేళ బయటికి రానట్లే... ఈ వ్యాధి సోకిన వారు కూడా భూతాల్లా పగటివేళ ఇంట్లోంచే బయట కాలుపెట్టలేరు. పైగా హాలీవుడ్ చిత్రాల్లో భూతాల్లా చూడటానికే చాలా భయంకరంగానూ మారిపోతారు. అందుకే ఈ వ్యాధికి వ్యాంపైర్స్ సిండ్రోమ్ అని పేరు. సూర్యుడి నుంచి లభించే సూర్మరశ్మి అందరికీ అవసరం. అయితే సూర్యకాంతిలోని అల్ట్రా వయొలెట్ కిరణాలు అందరి చర్మానికి హానికరం.
పోర్‌ఫైరియా అనే పేరున్న ఈ వ్యాధి వల్ల ఉన్నవారికి ఏమాత్రం సూర్యకాంతి సోకినా భరించలేరు. అందుకే వాళ్లు ఏమాత్రం సూర్యకాంతిని భరించలేకపోవడంతో పాటు, చాలా భయంకరంగా కనిపించేలా మారిపోతారు కాబట్టి ఈ వ్యాధికి ఆ పేరు పెట్టారు. అయితే అదృష్టవశాత్తు ఇది చాలా అరుదైన వ్యాధి.
వ్యాంపైర్ డిసీజ్!
Published Mon, Oct 12 2015 11:29 PM | Last Updated on Sun, Sep 3 2017 10:51 AM
Advertisement
Advertisement