హాయి హాయిలే వాటర్ మేలే నులే! | water milan better to in this stage | Sakshi
Sakshi News home page

హాయి హాయిలే వాటర్ మేలే నులే!

Published Tue, Mar 24 2015 11:16 PM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM

హాయి హాయిలే  వాటర్ మేలే నులే! - Sakshi

హాయి హాయిలే వాటర్ మేలే నులే!

ఎర్రటి ఎండల్లో ఎర్రెర్రెగా నోరూరించే వాటర్‌మెలాన్‌లు చూసి లొట్టలేయకుండా వాటిని హాయి హాయిగా చల్లచల్లగా ఆరగించండి. ఎండకు గట్టి పోటీ ఇవ్వండి. కూల్‌గా ఉండండి. ఇంతకీ ఏమిటా లాభాలు?

 ఇదిగో:

వేసవి దాహాన్ని తట్టుకోవడానికి మానవాళికి ప్రకృతి ప్రసాదించిన బహుమతి వాటర్ మెలాన్.  దాహం తీర్చడమే కాదు విటమిన్-ఎ తాలూకు సంపూర్ణ ఫలితాలను ఇస్తుంది  వేసవిలో చర్మసంరక్షణకు తోడ్పడుతుంది గుండెకు సంబంధించి రుగ్మతలు, ఎండ దెబ్బ నుంచి కాపాడుతుంది  శక్తి ఉత్పత్తికి అవసరమయ్యే విటమిన్-బి దీనిలో ఉంటుంది.

గమనిక: ఉప్పులాంటి వేవీ అద్దుకోకుండా, వీటిని తాజాగా, సహజంగా తింటేనే మంచిది.
 
ఒక చల్లటి పొగడ్త:

సుఖాలలోకెల్లా గొప్ప సుఖం... వాటర్ మెలాన్‌ను భుజించడం. దేవుడి ఆశీస్సులతో ఈ భూమి మీద ఉన్న అన్ని పండ్లకు రారాజుగా కొనసాగుతోంది. దేవతలు ఏంతింటారో తెలుసుకోవాలనుకునేవారు దీన్ని తింటే చాలు.. తెలిసిపోతుంది.
 - మార్క్‌టైన్, రచయిత

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement