వెలుగుతున్న తెలుగు
సెల్ఫ్ చెక్
తెలుగు వాళ్లే తెలుగు భాషను మాట్లాడడం లేదని బాధపడుతుంటాం. కాని తెలుగు భాష తేజస్సుతో వెలుగుతూనే ఉంది. ప్రపంచీకరణ ప్రవాహంలో కొట్టుకుపోకుండా తెలుగు పదాల్లో దాగిన పొందికే దానిని నిలబెడుతోంది.
1. మనదేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల జాబితాలో తెలుగుది మూడవస్థానం.
ఎ. అవును బి. కాదు
2. ఏడు కోట్ల మందికి పైగా తెలుగు మాట్లాడుతున్నారు.
ఎ. అవును బి. కాదు
3. మొదటి రెండు స్థానాల్లో హిందీ, బెంగాలీ ఉన్నాయని మీకు తెలుసు.
ఎ. అవును బి. కాదు
4. ప్రపంచ భాషల జాబితాలో మనది 15వ స్థానం.
ఎ. అవును బి. కాదు
5. కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేసియా, బహ్రెయిన్, సౌత్ ఆఫ్రికా, అమెరికా, ఇంగ్లండ్, ఫిజి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి కొన్ని దేశాలకు రెండు– మూడు తరాల క్రితం వలస వెళ్లిన కుటుంబాలు ఇప్పటికీ తెలుగులోనే మాట్లాడుతున్నాయి.
ఎ. అవును బి. కాదు
6. శాతవాహనకాలంలో రాజులు అధికారులు ప్రాకృత భాషను మాట్లాడుతున్నప్పటికీ సామాన్యులు తెలుగునే మాట్లాడేవాళ్లు.
ఎ. అవును బి. కాదు
7. రేనాటి చోళులు పూర్తిగా తెలుగులో వేసిన శాసనం కడపజిల్లా ఎర్రగుడిపాడులో దొరికింది.
ఎ. అవును బి. కాదు
8. ప్రాచీన భాష హోదా కోసం చేసిన ప్రయత్నం 2008 అక్టోబర్ 31వ తేదీన ఫలించిందని మీకు గుర్తుంది.
ఎ. అవును బి. కాదు
సమాధానాల్లో ‘ఎ’లు ఎక్కువ వస్తే మీకు మన భాష మీద గౌరవం, మూలాలను తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువే అనాలి. ‘బి’ లు ఎక్కువైతే... ఒకసారి తెలుగుభాష మీద ధ్యాస పెట్టండి ప్లీజ్.