
ఓరోజు థామస్ ఎడిసన్ స్కూల్ నుంచి ఇంటికి రాగానే, ‘‘అమ్మా ఈ కాగితాన్ని మా టీచర్ నీకు ఇమ్మంది’ అని చెప్పాడు. ఆ కాగితాన్ని ఆమె విప్పి చూస్తుంటే అక్కడే నిలబడ్డాడు. ఆ తల్లి కళ్లల్లో నీళ్లు!‘‘ఏం రాసి ఉందమ్మా?’’ అని అడిగాడు ఎడిసన్.పైకి చదివి వినిపించింది తల్లి. ‘మీ అబ్బాయి మహా మేధావి. ఆ స్థాయి టీచర్లు మా దగ్గర లేరు. కనుక దయచేసి మీరే అతడిని ఇంట్లో ఉంచుకుని చదువు చెప్పగలరు.’ ఏళ్లు గడిచాయి. ఎడిసన్ తల్లి చనిపోయింది. ఎడిసన్ గొప్ప శాస్త్రవేత్తగా ప్రఖ్యాతుడయ్యాడు. ఓరోజు పాత సొరుగులు తీసి చూస్తుంటే, చిన్నప్పుడు టీచర్ తన తల్లికి రాసిన ఆ కాగితం బయటపడింది. ఎడిసన్ దానిని చేతిలోకి తీసుకుని చదివాడు.
‘మీ అబ్బాయికి బుద్ధిమాంద్యం ఉంది. ఇలాంటి వాడిని మా స్కూల్లో ఉంచుకోలేం. రికార్డుల నుంచి అతడి పేరును తొలగించాం’ అని ఉంది!ఎడిసన్ కళ్ల నిండా నీళ్లు. ఆ తర్వాత ఎడిసన్ తన డైరీలో ఇలా రాసుకున్నాడు : థామస్ ఆల్వా ఎడిసన్ బుద్ధిమాంద్యం గలవాడు. అయితే అతడి తల్లి అతడిని ఒక మేధావిగా మలిచింది!ఆ దేవుడే మార్చాలనీ, ఆ దేవుడే నయం చేయాలని.. టీచర్లు, వైద్యులు వదిలేసిన పిల్లల్ని ప్రేమతో, ఓర్పుతో తీర్చిదిద్దిన, తీర్చిదిద్దుతున్న తల్లులెందరో సమాజంలో ఉన్నాయి. వీళ్లంతా సొంత బిడ్డలకు మాత్రమే తల్లులు కాదు. విశ్వమాతలు. ఈ ప్రేమమూర్తులలో ఒక మానవతా మూర్తి మదర్ థెరిస్సా. ఆమె ‘భారతరత్న’ అయిన రోజు ఇది.మీ అబ్బాయికి బుద్ధిమాంద్యం ఉంది. ఇలాంటి వాడిని మా స్కూల్లో ఉంచుకోలేం. రికార్డుల నుంచి అతడి పేరును తొలగించాం.
Comments
Please login to add a commentAdd a comment