బాలికలు నీళ్లు పట్టే సమయాన్ని 15 నిమిషాలు తగ్గిస్తే, వాళ్లు స్కూలుకు హాజరయ్యే శాతం 8 నుంచి 12 వరకు పెరుగుతుందని ఒక సర్వేలో వెల్లడయింది.
నీరు ప్రాణం జలం అయితే, మహిళలు ప్రాణదాతలు. కుటుంబం కోసం నాలుగు రాళ్లు సంపాదించుకురావడం కన్నా కూడా, కుటుంబం కోసం బిందెడు నీళ్లు మోసుకురావడం పెద్ద బాధ్యత అయింది నేటి ప్రపంచంలో! నీళ్లు ఎక్కడబడితే అక్కడ దొరకడం లేదు. మంచినీళ్లు అసలే దొరకడం లేదు. మైళ్లకు మైళ్లు వెళ్లాలి. నీళ్ల కోసం ఈరోజు ఒక చోటుకు వెళితే, మళ్లీ అక్కడికే వెళ్లి తెచ్చుకునే పరిస్థితి లేదు. రాత్రికి రాత్రి నీళ్లు ఇంకిపోతున్నాయి! కొత్త చెలమను, కొత్త బావిని వెతుక్కుంటూ పోవాలి. కారణాలు ఏమైనా గుక్కెడు నీళ్లు దొరకడం గగనమైపోయింది. ఇవాళ్ల ‘వరల్డ్ వాటర్ డే’. ఈ సందర్భంగా.. నీళ్ల గురించి, మహిళల గురించి కొన్ని వాస్తవాలు, విశేషాలు.
∙ప్రపంచంలో ఎక్కువ భాగం కుటుంబానికి నీళ్లు అందిస్తున్నది మహిళలు, బాలికలే! నీళ్ల కోసం మహిళలు, బాలికలు రోజుకు ప్రయాణిస్తున్న దూరం సగటున 3.7 ఏడు మైళ్లు.
∙ప్రపంచవ్యాప్తంగా మహిళలు నీళ్ల కోసం వినియోగిస్తున్నవి రోజుకు 20 కోట్ల పని గంటలు.
∙నీళ్ల బిందెలను తలపై మోయడం వల్ల మహిళలు మెడనొప్పి, నడుమునొప్పి, ఇతర శారీరక బాధలకు గురవుతున్నారు. ఆ బరువు ప్రభావం తుంటి ఎముకలపై పడి, ప్రసవ సమస్యలు తలెత్తుతున్నాయి.
∙ప్రపంచంలోని అంధులలో 70 శాతం మంది మహిళలే. వీళ్లలో ఎక్కువమంది.. నీటికి అందుబాటులో లేని నివాస ప్రాంతాలలో ఇన్ఫెక్షన్‌ను కలిగించే బ్యాక్టీరియా వల్ల కంటిచూపు పోగొట్టుకున్నవాళ్లే.
∙ఇంట్లో మరుగుదొడ్లు, ఇంటికి సమీపంలో మరుగు లేనందువల్ల నీటి సదుపాయం ఉన్నచోటికి వెళ్లేందుకు ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలు రోజుకు 26 కోట్ల 60 లక్షల గంటలను వెచ్చించవలసి వస్తోంది.
భారతదేశంలో పురుష కౌన్సిలర్లు ఉన్న ప్రాంతాలతో పోలిస్తే, మహిళలు కౌన్సిలర్లుగా ఉన్న ప్రాంతాలలో తాగునీటి సౌకర్యం 60 శాతానికి పైగా ఉంది
Comments
Please login to add a commentAdd a comment