సామాజిక మాధ్యమాలలోనూ మహిళలు రాణిస్తున్నారు. వాస్తవానికి మగవాళ్ల కంటే కూడా యాక్టివ్‌గా ఉంటున్నారు. యూట్యూబ్, ట్విట్టర్, ఇన్‌స్టా గ్రామ్, టిక్ టాక్‌లలో తమ నైపుణ్యాన్ని, ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. స్టార్‌లుగా వెలిగిపోతున్నారు. ఆ స్టార్‌లలో సెలబ్రిటీలు ఉన్నారు. సామాన్యులూ ఉన్నారు.
టాప్ యూట్యూబర్: నిషామధులిక
ఫాలోవర్స్.. 7 కోట్ల 65 లక్షల మంది (7.65 మిలియన్)
మా కె హాత్ కా ఖానా (అమ్మ చేతి వంట)
ఈ చానెల్‌ను అందిస్తున్న షెఫ్ నిషా మధులిక. స్వస్థలం ఉత్తరప్రదేశ్. మొదట.. చిన్నప్పుడెప్పుడో తల్లి దగ్గర నేర్చుకున్న ఉల్లి, వెల్లుల్లి లేని శాకాహార వంటకాలను ఓ వెబ్‌సైట్‌కు రాసేవారు. మంచి స్పందన రావడంతో భర్త, కొడుకు సహాయంతో తనే సొంతంగా http://nishamadhuli ka.com/ అనే వెబ్‌సైట్ పెట్టారు.
దానికీ డిమాండు మొదలవడంతో 2016లో యూ ట్యూబ్‌లో వంటల చానెల్ స్టార్ట్ చేశారు నిషా మధులిక. ఆమె వంట చేస్తూ ఆ రెసిపీని హిందీలో వివరిస్తూంటే ఆమె భర్త వీడియో తీసి చానెల్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఇప్పటి వరకు ఉల్లి,వెల్లుల్లి కూడా లేని దాదాపు పన్నెండు వందల శాకాహార వంటకాలను తన యూట్యూబ్ వంటల చానెల్‌లో అప్‌లోడ్ చేశారు నిషా మధులిక. యూత్, కొత్తగా పెళ్లయిన జంటలు మొదలు వర్కింగ్ విమెన్ చానెల్ సబ్‌స్క్రైబర్స్‌లో ముఖ్యులు.
ట్విట్టర్ ఫేమ్: దీపికా పదుకోణ్
ఫాలోవర్స్.. 1 కోటి 39 లక్షల మంది (13. 9 మిలియన్)
ఆమె ఫాలోవర్స్‌ను పెంచిన ట్వీట్..YES!I am a Woman.I have breasts AND a cleavage! You got a problem!!?? ఎంత అమాయకమో.. అంతే బోల్డ్‌నెస్. ‘అవును.. నేను స్త్రీని. కాబట్టే స్త్రీకి ఉండాల్సినవన్నీ ఉన్నాయి. మీకేమన్నా ప్రాబ్లమా?’ అంటూ ట్విట్టర్‌లో పెట్టింది. ఆమె ధైర్యాన్ని అభిమానులు సరే.. మహిళలు, సినిమా ఇండస్ట్రీలోని మహామహులంతా కొనియాడారు పడుకోణ్ ఫ్యాన్స్ అయిపోయారు.
ఇన్‌స్టా క్వీన్: ప్రియాంక చోప్రా
ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫోలోవర్స్.. 49.9 మిలియన్ (4 కోట్ల 99 లక్షలు)
పీసీ అని ప్రేమగా పిలుచుకునే అభిమానులను సంపాదించుకున్న ప్రియాంక చోప్రా.. పాప్ గాయనిగా పాశ్చాత్యులకూ పరిచయమయ్యారు. అక్కడి టెలివిజన్ సిరీస్‌లో నటనతోనూ వాళ్లను మెప్పించారు. తన మీద మనసు పారేసుకున్న పాప్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లాడారు. ఆ ముచ్చట్లను ఫోటోగ్రాఫ్‌లుగా ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ ఫాలోవర్స్‌నూ తన అకౌంట్‌కు కట్టిపడేస్తున్నారు. ఇన్‌స్టా క్వీన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.
టిక్ టాక్ లేడీ.. నిషా గురగైన్
ఫాలోవర్స్.. 21.7 మిలియన్ (2 కోట్ల 17 లక్షలు)
నిషా గురగైన్ పుట్టిపెరిగింది నేపాల్‌లో. సినిమాల్లో అవకాశాలను వెదుక్కుంటూనే సోషల్ మీడియాలో ప్రతిభను ప్రదర్శించింది ఈ అమ్మాయి. బాలీవుడ్ కంటే ముందు టిక్ టాక్‌లో స్టార్ అయింది. ‘ముఝే యాద్ హై ఆతా తెరీ వో నజ్రే మిలానా’ అనే పాటకు ఆమె లిప్ సింగ్ చేస్తూ అభినయించిన తీరు వైరలై.. లక్షల్లో లైక్స్ తోడై టిక్ టాక్ స్టార్‌ను చేసింది. వ్యూస్‌ను, షేర్స్‌ను సంపాదించి పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment